మాతవట శ్రీమాతవట

రాగం: ఆనంద భైరవి               మాతవట శ్రీమాతవట                       తాళం: ఆది తాళం


||ప ||        మాతవట.. శ్రీమాత|వట.. జగ|న్మాతవట||
    మము మురిపించే….. లీలా| మాతవట|                        || మాతవట||

||అనుప||   నిను నమ్మిన నిరతము..| మా..వెంట|ఉందువట. ||
     మా ఇంట కొలువై….|నడిపించు | రాణి వట                   || మాతవట||

||చ1 ||     మాతవై మాకు మమతలను| పంచెదవు|… శ్రీ ||
    మాతవై మాకు.. శ్రీకర| ములను ఇచ్చెద|వు. జగ ||
    న్మాతవై జఙ్గచక్రమును| త్రిప్పెదవు|.. లీలా||
    మాతవై నీలీలలను వినో|దించెదవు                               || మాతవట||

||చ2 ||      మాతగా జన్మనిచ్చి |దారి చూపె| దవు..    శ్రీ ||
    మాతగా మాయా మోహితుల| చేసెదవు |.. జగ||
                 న్మాతగా మాయా తెరను |తొలగించె|దవు.. లీలా||
                 మాతగా నీ ముంగిట |చేర్చు కొందు|వు…                       || మాతవట||

||చ3||      నిను నమ్మిన వారికీ… |నాశము.. |లేదట.. ||
                నిను ధ్యానించిన మనో |నాశనము | అగునట ||
                నిను శరనొందిన.. 'నేను' | అనేదే.| లేదట.||
                నీ వీక్షణతో 'పుట్టు..|కే' ఉండద|ట…                                || మాతవట||



Comments

Popular posts from this blog

Ananda Nilayam/ ఆనంద నిలయం /आनंद निलयम

బీజాక్షర సంకేతములు/ Meaning of Bheejaksharas