వరలక్ష్మి దేవి షోడశోపచార పూజ
వరలక్ష్మి దేవి షోడశోపచార పూజ
రాగం : తాళం : ఏక తాళం
||ప|| శ్రీ వరమహాలక్ష్మి .... || రావమ్మ మా ఇంటికి ||
నీ ముద్దు మోము. చూడ|| వేచి. ఉన్నానమ్మా ||
||అనుప|| నీ పాద అందియ.లు|| గల్లు గల్లని. మ్రోగ ||
కళ్యాణి వే. వేగ || కదలి రావమ్మా || || శ్రీ వరమహాలక్ష్మి||
||చ1|| అర్ఘ్య పాద్య ఆచమనీయములు|| నీకు సమరపింతు నమ్మ||
పంచామృత శుద్ధోదకము || నీకు ఆ.ర్పింతునమ్మా || || శ్రీ వరమహాలక్ష్మి||
||చ 2|| కౌ.సుంభ వస్త్రము ..|| సౌవర్ణ యఙ్ఞసూత్రము ||
హేమ కంకణములు..|| నా..సా మౌక్తి..కము ||
మంజీర మణికుండలములు || చూడామణి మకుటము ||
అంగుళీయ కట.కము || అలంకరింప జేసెదనమ్మ || శ్రీ వరమహాలక్ష్మి||
||చ 3 || శ్రీ గంధ పంకాంకితము || కస్తూ.రి తిలకము ||
దివ్యా. అంజనము .||నీకు సమర్పింతునమ్మా || || శ్రీ వరమహాలక్ష్మి||
||చ 4 || మల్లి మరువ జాజి చంపక || మాలతి మందార వకుళ ||
కుందాది పుష్పములతో|| నిన్ను సేవింతునమ్మా || శ్రీ వరమహాలక్ష్మి||
||చ 5|| అష్టోత్తర శతనామా..వళి || కుంకుమా..ర్చనలతో ||
మనసారా సేవించి.. ||మనస్స..ర్పింతు నమ్మ || || శ్రీ వరమహాలక్ష్మి||
|| చ 6|| ధూప దీప నైవేద్యములు || తాంబూల నీరాంజనము ||
నాట్య గాన వినోదముతో|| నళినాక్షి నిను సేవింతు || శ్రీ వరమహాలక్ష్మి||
||చ 7|| విశాలాక్షి నీ చూపులను || మా.. మీద ప్రసరించి ||
నీ పాదసేవతో మమ్ము|| తరింప జేయవమ్మా ||
సేవలోని దోషాలన్నీ|| మన్నించి ఆదరించు ||
నీ సేవా భాగ్యము తో|| సదా మమ్ము అనుగ్రహించు || శ్రీ వరమహాలక్ష్మి||
Comments
Post a Comment