భగవంతుని పూజ
భగవంతుని పూజ
భగవంతుని
మెప్పిస్తే మన
కష్టాలన్నీ దూరమవుతాయని
మన శాస్త్రాలు,
పురాణాలూ చెబుతున్నాయి!!!
భగవంతుని (ఏ
దేవతా స్వరూపమైనా)
భక్తి పూర్వకంగా
స్తోత్రాలు పఠించినా,
సంకీర్తనలు పాడినా,
దేవాలయాలలో సేవా కార్యక్రమాలలో పాల్గొన్నా,
బ్రహ్మోత్సవాలలో నృత్యం
చేసిన, ఆపదలో ఉన్నవారిని ఆదుకున్న,
ధాన ధర్మాదులు
చేసిన, పదిమందికి
ఉపయోగపడే ఎలాంటి
ధార్మిక మార్గములో
నడచిన..... భగవంతుడు మెచ్చి
ఆపదలనుడి రక్షిణించి,
మనకు మేలు
చేస్తాడు అని
మనందరి నమ్మకము, కదా?
నిజంగా భగవంతుడు మనల్ని రక్షిస్తాడా? అది సాధ్యమా?
అది ఎలా సాధ్యపడుతుందో నేను తెలుకున్న విషయాన్ని మీకు తెలియ చేస్తున్నాను!
భగవంతుని పేరిట
ఎలాంటి పని
చేసినా భయముతో
కూడిన భక్తి
ఉంటుంది. ఎందుకంటే
పొరపాట్లు ఎమన్నా
జరిగితే పరిణామము
(రిసల్ట్ ) మనము
అనుభవించాల్సి ఉంటుంది, కదా?
కాబట్టి మనన్సును,
మాటను, అదుపులో
పెట్టి, చేసే
పనిని
జాగ్రత్తగా
చేస్తూ ఉంటాము.
ఎప్పుడైతే మనన్సును,
మాటను అదుపులో
పెడతామో అప్పుడే బుద్ది సక్రమముగా
పనిచేస్తుంది. మన
బుద్ధి సరిగ్గా
పనిచేసినప్పుడు విచక్షణా
జ్ఞ్యానము మేలుకొంటుంది.
అంటే మంచికి
చేడుకు వ్యతాసాము
తెలుస్తుంది.
విచక్షణా జ్ఞ్యానం
పనిచేసినప్పుడు సరియైనది,
సరికానిదానికి తేడా
తెలుస్తుంది. మనస్సు
ప్రశాంతంగా ఉంటుంది.
సమస్యలకు సమాదానాలు
వాటంతట అవే
మన ముందుకు
వస్తాయి. చింత
అనేది ఉండదు.
చింత లేనిచోట
భయం ఉండదు.
అప్పుడు మన
మనస్సు నిశ్చలంగా,
నిర్మలంగా ఆనందంగా
ఉంటుంది అని తెలుసుకోవాలి!!! .
(నిర్మలమైన, నిశ్చలమైన స్థితిని భగవంతుడని లేదా భగవత్ తత్వమని తెలుసుకోవాలి
ఎందుకంటే ఆ స్తితిలో ఉన్నపుడే మనము
ఎలాంటి పరిస్థితులమైన
ఎదురొకొని, ప్రశాంతంగా ఆలోచించి,
పరిష్కరించి సరైన మార్గంలో నడవడమే కాకుండా, మన తోటి వారినికూడా నడిపించ గల్గుతాము)
అంతర్ ముఖ
సమారాధ్యా బహిర్ముఖ
సుదుర్లభా!
లోపల ఉన్న
వస్తువును బయట
వెదికితే ఎలా?
కాబట్టి
మనలో ఉన్న
మాలిన్యాలను తీసివేస్తే
ఆ శక్తి స్వరూపము వెలువడుతుంది!
బుద్ధి
చెడుమార్గం ఎలా పడుతుంది?
2. అశాంతికి కారణము డబ్బు!
3. డబ్బుఆర్జించడానికి కారణము కోరికలు !
4. కోరికలు పుట్టుకురావడానికి కారణము సుఖం!
5. సుఖం పొందాలనుకోవడాని కారణము బద్దకం!
6. బద్దకానికి కారణము అమూల్యమైన జీవితము విలువ తెల్సుకోకపోవడము!
బుద్ధిని
నియంత్రించడం ఎలా?
మానవతా విలువలని నేడు కోల్పోవడానికి కారణమూ విచక్షణా జ్ఞ్యానం నిద్రపోతూవుండడం వల్లనే!!!
విచక్షణా జ్ఞ్యానాన్నిమేలు కొలపాలి
అంటే బుద్ధి సక్రమముగా పని చేయాలి. బుద్ధి సక్రమముగా పని చేయాలి అంటే
మానవతా లక్షణాలని
అభివృద్ధి.
మానవతా లక్షణాలు అని వెటిని అంటారు? ప్రేమ,
దయా, జాలి, కరుణా, సేవ, దానము. సమత్వము....లాంటివి
మనకు
ఈ లక్షణాలు ఉన్నాయి కదా! ఉన్నాయి కానీ స్వార్థంతో
కూడుకొని ఉన్నాయి! ఎందుకంటే మనలో రక్షాస గుణాలు పెరుగుతున్నాయి కాబ్బట్టి.
రాక్షస లక్షణాలు అంటే ఏమిటి? అహంకారము, కోపము, ఈర్ష్య, ద్వేషము, అసూయా,
అధికారము, స్వార్ధము, లోభత్వము ఇంకా ఎన్నో…
మనలో
ఉన్న రాక్షస గుణాలను ప్రాలద్రోలి -------- ప్రేమ, దయా, కరుణా లాంటి అద్భుతమైన గుణాలను
పెంపొందించుకోవాలి అంటే ఏమిచేయాలి?
చేసే
ప్రతీ పనిని ప్రేమతో, నిస్వార్థముతో, అర్పణా భావముతో చేయడము మొదలుపెట్టాలి.
భగవతుని మనతో ఉండమని కోరాలి. భగవంతుడు సద్గుణాలతో సందీకృతమై ఉంటాడు. అంటే సద్గుణాలువుంటే భగవంతుడు మనతో ఉన్నట్టే కదా? ఆ పరమాత్ముడు మనతో ఉంటె ప్రపంచమంతా మనదేకదా? ఇంకా వేరే ఏదన్న కోరాల్సిన అవసరము మనకు ఉందా?
ఏపనైనా చేసేటప్పుడు మన మనన్సును మాటను అదుపులో పెట్టి, అర్పణా భావముతో చేస్తే బుద్ధి క్రమముగా మన అదుపులోకి వచ్చి శాంతిస్తుంది అంటే కోరికలు అనే పిశాచాలు మనలను పీడించవు!
భగవతుని మనతో ఉండమని కోరాలి. భగవంతుడు సద్గుణాలతో సందీకృతమై ఉంటాడు. అంటే సద్గుణాలువుంటే భగవంతుడు మనతో ఉన్నట్టే కదా? ఆ పరమాత్ముడు మనతో ఉంటె ప్రపంచమంతా మనదేకదా? ఇంకా వేరే ఏదన్న కోరాల్సిన అవసరము మనకు ఉందా?
ఏపనైనా చేసేటప్పుడు మన మనన్సును మాటను అదుపులో పెట్టి, అర్పణా భావముతో చేస్తే బుద్ధి క్రమముగా మన అదుపులోకి వచ్చి శాంతిస్తుంది అంటే కోరికలు అనే పిశాచాలు మనలను పీడించవు!
·
కోరికల
బాధ నుండి విముక్తి అయినప్పుడు మనలోని రాక్షసగుణాలు అడుగంటి, మనలో ప్రేమ, దయా, కరుణ,
అహం రహితమైన భావాలు పెంపొందుతాయి.
ఆతరువాత
జీవితమంతా ఆనందం భరితం. ఆ ఆనందం ఎంత శక్తివంతమైనదంటే సుఖదుఃఖాలను(సుఖం వచ్చి నప్పుడు పొంగి పోకుండా దుఃఖం వచ్చి నప్పుడు కృంగిపోకుండా) సమబుద్ధితో స్వీకరించే సామర్ధ్యాని మనకు ప్రసాదిస్తుంది.
అప్పుడు బాధకు స్థానమే లేదు.
అప్పుడు జీవితానికి అర్థం తెలుకొని సార్థకం
చేసుకొనే మార్గాన్ని వెతుకుంటాము!!!
నేను చేసే పూజకు ఫలితమెందుకు కనబడుట లేదు?
భగవంతుని పేరిట మనము చేసే
ప్రతీ నోము, వ్రతము, పూజ, స్తుతి, పారాయణము, ఏదైనా…. మన స్వార్థం కోసమే చేసుతున్నాము.
సరే స్వార్ధము ఎలాగూ తప్పట్లేదు! పోనీ అదైనా శ్రద్దగా, అణుకువతో చేస్తున్నామా? అక్కడ
కూడా అహంకారము, ఈర్షా, ద్వేషము! మలినమైన మనసుతో పూజ!
కుళ్లిపోయిన పూలను గుడిలోపలకు
కూడా తీసుకు వెళ్ళరు. మరి మలినమైన మనసుతో చేసిన పూజ భగవంతునికి ఎలా చేరుతుంది? కోరికలు
ఎలా తీరుతాయి? వ్యేతించిన డబ్బు, సమయము, శక్తీ అన్ని వృద్ధా నే కదా!
కాబ్బటి ఇప్పటినుంచి కావాలని అనుకున్నవి
పొందాలి అంటే, సద్భావన, సద్బుద్ధి, సత్ప్రవర్తనతో మనలోని శక్తిని పెంచాలి. దుర్గుణాలతో
శక్తి క్షీణిస్తుంది. అణుకువతో, ప్రేమతో, అనురాగంతో మసులోకోవడము నేర్చుకోవాలి! మరీ
అవి మనకు తెలియవా? ఎందుకు తెలియవు? బాగా తెలుసు…….కానీ
అవి ఎలాఉంటాయో మనము మరిచి పోయేలా చేసాడు కలిపురుషుడు! మానవులను తప్పుద్రోవ పాటించడమేగా
అయన పని! ఈ విషయము చాలామందికి తెలియద!
స్వార్ధము,
ఈర్ష్య, ద్వేషము లాంటి దుర్గుణాలు వున్నా వాళ్లవెంట కలిపురుషుడు ధనసంపతి రూపంలోతాండవిస్తూ
ఉంటాడు, వాళ్లు నాశనము అయ్యేంతవరకు విడిచి పెట్టడు!
ఎవరి
ధర్మాన్ని వారు పాటించి నిశ్చలము, నిర్మలమైన మనసుతో వుంటారో వారిని కలిపురుషుడు అంటలేడు.
ప్రేమ, సద్భావన, పరోపకారం లాంటి మంచి గుణాలతోనే ఆ స్థితిని పొందవచ్చు!!!
రహస్యము
- భగవంతునికి చాల ఇష్టమైనది నిస్వార్థము, సద్భావంతో కూడిన సేవ!
- మీకోసం కాకుండా మీకు సంబంధం లేనివారి కోసం మీరు ప్రార్థిస్తే వెంటనే సిద్ధిస్తుంది!
- మీరు మీతోటివారిగురించి ఆలోచిస్తే భగవంతుడు మీగురించి ఆలోచిస్తాడు. మీకోసం మీరు కోరకుండానే అన్ని సిద్ధిస్తాయి!
గమనిక
- కర్మ అనుభవించక తప్పదు! కానీ ధార్మిక మార్గంలో నడిచేవారికి కష్టం అనేది తెలియకుండా కర్మ తీరిపోతుంది!
- కష్టము సుఖము అనేది మన బుధిలోనే వుంది. బుద్ధి సక్రమముగా పనిచేయడానికి భగవత్ కరుణ, కృపా, కటాక్షము కావాలి. అది ఎక్కడనుండి వస్తుంది? మన విచక్షణా జ్ఞ్యానం మేలుకొన్నపుడు మనలోని పరమాత్మద్వారా ప్రసరిస్తుంది.
అందుకే అర్పణా భావనతో పూజ చేయడము అవసరము!!!
చివరిగా, పరమాత్ముడు మనకిచ్చినది ఆయనకే సమర్పించడంలో గొప్పతనం
ఏముంది? వీలైతే మీరు ఇవ్వగల్గినది ఒక్కటే ఒక్కటి ఉంది ..... అదే మీ మనస్సు! అది ఇచ్చి
చుడండి మీకే తెలుస్తుంది!
సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు
సమస్తాలోకా సుఖినో భవంతు
ఓం శాంతిః శాంతిః శాంతిః
Comments
Post a Comment