Posts

SRI GOURI ASHTHOTARA NAMAVALI/ శ్రీ గౌరీఅష్టోత్తర నామావళి / श्री गौरी अ...

Image

అమ్మవారికి ఏ తిథి రోజున..ఏ అబిషేకం..ఏ నైవేద్యం.. పెట్టాలి

🌷🙏🙏🌷 పాడ్యమి రోజు.. ఆవు నేయి తో అభిషేకం చేస్తే సకల రోగాలు నివారణ అవుతాయి. విదియ రోజు.. చక్కర తో అభిషేకమ చేస్తే దీర్గాయువు కలుగుతుంది. తదియ రోజు.. ఆవు పాలు తో అభిషేకం చేస్తే ఎలాంటి అకాల మృత్యు దోషాలు తొలిగిపోతాయి. చవితి రోజున.. పిండివంటలు నైవేద్యం పెట్టడం వలన సకల విద్యలు లబిస్తాయి. పంచమి రోజు.. అరటి పళ్ళు నైవేద్యం పెట్టడం వలన మేధస్సు, బుద్ది శక్తి పెరుగుతుంది. షష్టి రోజున.. తేనే తో అమ్మవారిని అభిషేకించి, బ్రహ్మణునికి దానం ఇవటం వలన కాంతి పెరుగుతుంది, యషస్సు పెరుగుతుంది. అష్టమి రోజున.. బెల్లం నీటి తో అభిషేకించి, మంచి బెల్లం ఎవరికయినా దానం ఇవటం వలన అష్ట కష్టాలు అంటారు కదా అలాంటివి అన్నీ తీరిపొతాయి అంటారు. నవమి రోజున.. నైవేద్యం పెట్టడం వలన సకల సౌభాగ్యలు కలుగుతాయి. దశమి రోజున.. నల్ల నువ్వులు తో చేసిన పదార్ధాలు నైవేద్యం పెట్టడం వలన సకల రోగలు పోతాయి అని , దీర్గాయుషు పెరుగుతుంది. వారాలలో ఏ నైవేద్యం..! ఆదివారం రోజు - పాలు సోమవారం - పాయసం మంగళవారం - అరటిపళ్ళు బుధవారం - వెన్న గురువారం - పటికబెల్లం శుక్రవారం - తీపి పదార్ధాలు శనివారం - ఆవు నేయి అమ్మవారికి ఇష్టమయిన అన్నం.💐 పులగం - అన్నం + పెసరపప

ఏవి చేయకూడదు? ఏవి చేయాలి?

1. గడప ఇవతల నుంచి భిక్షం వేయకూడదు. 2. ఎంత అవసరమైన  కర్పూరాన్ని ఎండాకాలంలో దానమివ్వకూడదు. 3. మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటికి భోజనానికి ఎవర్ని పిలవకూడదు. 4. శుభానికి వెళ్తున్నప్పుడు స్రీలు ముందుండాలి. అశుభానికి స్రీలు వెనక వుండాలి. 5. ఉదయం పూట చేసే దానకార్యాలు ఏవైనా సరే ఎక్కువ ఫలన్నిస్తాయి . 6. అమంగళాలు కోపంలోను , ఆవేశంలోను ఉచ్చారించకూడదు. తదాస్తు దేవతలు ఆ పరిసరాల్లో సంచరిస్తూ వుంటారు. 7. పెరుగును చేతితో చితికి మజ్జిగ చేసే ప్రయత్నం ఎన్నడు చేయకూడదు. 8. పిల్లి ఎదురొస్తే కొన్ని నిముషాలు ఆగి బయలుదేరాలి.కుక్క ఎదురొస్తే నిరభ్యంతరంగా ముందుకు సాగాలి. 9. చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు. 10. పగలు ధనాన్ని సంపాదించాలి. రాత్రి సుఖాలను పొందేందుకు సిద్దపడాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకున్నాం కదా ... కొన్ని నిజాలు చూద్దాం ... అరటిఆకులో భోజనం చేయడానికి/పెట్టడానికి కారణం అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది, వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని  అనేక రకాల పోషకాలు ఈ అరటిఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి ,మరియు పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి  అందుకే ఇంటిక

🕉️ *గణానాం త్వా గణపతి గం..* 🕉️

మహా గణపతి ఆయన వదనం ఓంకారం... ఆయన మాట శ్రీకారం... ఆయన పూర్ణసృష్టికి సంకేతం.  అతి గొప్ప ఆధ్యాత్మికతత్త్వం ఆయనదేనంటూ శాస్త్రాలు, ఉపనిషత్తులు వివరిస్తున్నాయి. గణపతిని పూజించే మంత్రాల్లో అత్యంత ప్రసిద్ధిపొందిన మంత్రం రుగ్వేదం రెండో మండలంలో ఉంది. *ఓం గణానాం త్వా గణపతిగ్‌ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం* *జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన సృణ్వన్నూతిభిస్సీదసాదనం* తాత్పర్యం:  భూత గణములకు అధిపతివి, విద్వాంసులలో విద్వాంసుడవు, పోల్చదగిన కీర్తి శ్రేష్టులకు కూడా నీవే పోలికవు, బ్రహ్మణ్యులలో బ్రహ్మణ్యుడవు, సర్వ జగత్తుకు అధిపతివి (రాజాది రాజువు), అయిన నిన్ను మా కోర్కెలు తీర్చుటకు, మా ప్రార్థన ఆలకించి ఈ పూజా సమయము నందు ఈ స్థానమును లేక ఆసనమును అలంకరించుము. గణపతిని రాజుల్లో పెద్దవాడుగా, దేవతల్లో పూజలందుకునే మొదటివాడుగా, 33 కోట్ల దేవతాగణాలకు అధినాయకుడిగా వర్ణిస్తుంది రుగ్వేదం. గణాలకు నాయకుడిగా గణపతిని చెబుతోందే కానీ గజముఖ స్వరూపం గురించి ఈ వేదంలో కనిపించదు. పునరావృతం అవుతున్న ఈ స్తోత్రం వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. మధుర భక్తి రస గానం : *శ్రీ ప్రకాష్ కౌశిక్

Amarnath Aarati/ శ్రీ అమర్నాథ్ ఆరతి / श्री अमरनाथ आरती (22nd July 2019)

Image

వ్యాస పూర్ణిమ - కథ

మన (చాంద్రమాన) పంచాంగం లో ఆషాఢ మాసం  లో వచ్చే పౌర్ణమిని "గురు పూర్ణిమ" లేదా "వ్యాస పూర్ణిమ" గా పరిగణిస్తారు. ఇది వేద వ్యాసుని జన్మ దినం (వ్యాస జయంతి). ఇతడు పరాశర మహర్షికి, సత్యవతికి కృష్ణ వర్ణం (నల్ల రంగు) తో ఒక ద్వీపంలో జన్మించాడు. కనుక "కృష్ణ ద్వైపాయనుడు" అని పిలవబడ్డాడు. అయితే, తన తండ్రియైన పరాశర మహర్షి సంకల్పించి ప్రోగు చేసిన వేద రాశులను నిత్య కర్మలలో, క్రతువులలో వాటివాటి ఉపయోగాన్ని బట్టి ఋగ్-యజుర్-సామ-అధర్వణ అను నాలుగు వేదములుగా విభజించి లేదా వేర్పరచినందువలన "వేద వ్యాసుడు" అను పేర సార్ధక నామధేయుడైనాడు. తదుపరి బ్రహ్మ అనుజ్ఞతో, సరస్వతీ కటాక్షంతో విఘ్నాధిపతియైన గణేశుడు వ్రాయగా చతుర్వేదములలోని సారం ప్రతిబింబించేవిధంగా ఘనతకెక్కిన మహాభారత ఇతిహాసకావ్యాన్ని రచింపజేసాడు. అందుకే భారతాన్ని "పంచమవేదం" అన్నారు. ఇవే కాక, వేద వ్యాసుడు మనకు అష్టాదశ (పద్ధెనిమిది) పురాణాలను, మరెన్నో పురాణేతిహాసాలను ప్రసాదించిన పూజ్యుడు, తొలి గురువు. విష్ణుతేజం తో జన్మించిన ఈ మహనీయుని సాక్షాత్తు శ్రీమహావిష్ణు అవతారంగా భావిస్తారు. అందుకే శ్రీ విష్ణుసహస్రనామం పీఠికలో &

Sri Lalitha Ashtakam/ శ్రీ లలిత అష్టకం /श्री ललिता अष्टकम

Image

Sri Lalitha Ashtakam/ శ్రీ లలిత అష్టకం /श्री ललिता अष्टकम

Image

*నేటి మన పెళ్ళిళ్లలో చేస్తున్న పొరపాట్లు*

15000 మంది దంపతుల పై గడచిన 20సంవత్సరాల నుంచి పరిశోధన చేస్తున్న ఒక పండితుల గోష్టి నుంచి  ఒక పండితుడు షేర్  చేసి వారు చేసిన కృషియే ఈ  అక్షర రూపం  1. మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం.. పెళ్ళి ముహూర్తం పెట్టేది ఎందుకు ఆ ముహూర్తానికి వధూవరులు ఒక్కటి అయితే సంతోషంగా వుంటారు అని  ముహూర్తానికి పెళ్ళి జరగక పోతే ఎలాగయినా చేసుకోవచ్చు కదా హంగు ఆర్భాటాలకు పోకుండా ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం, చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవటం.. భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం..! 2. జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో ఒకరు చూపులు నిలపకపోవటం.. - ఫలితం: దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించటం..! (వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం) (పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం ఆచరించాకే మిగతావి) 3. ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం.. ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం...! 4. తలంబ్రాల కు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం.. ఫలితం: దీనివలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బందులు ...! 5. బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి రావటం వధూవరులని ఆశీర్వదించటం.. ఫలితం: దీనివలన మంటపంల

పురందర దాసు కీర్తన

పురందర దాసు (1484 – 1564) ప్రప్రధమ కర్ణాటక సంగీత విద్వాంసులు,వాగ్గేయకారుడు, మరియు కర్ణాటక సంగీత పితామహులు. వీరు రచించిన కీర్తనలుఎక్కువగా కన్నడంలో, కొన్ని సంస్కృతంలో ఉన్నాయి.         అన్ని కీర్తనలు విష్ణుమూర్తికి అంకితమిస్తూ 'పురందర విఠలా' తోనే అంతం చేశారు. సింధుభైరవి రాగం లొ చెయ్యబడినది. వేంకటాచల నిలయం వైకుంఠ పురవాసం ||  పంకజ నేత్రం పరమ పవిత్రం  శంఖ చక్రధర చిన్మయ రూపం ..♫ అంబుజొద్భవ వినుతం అగణిత గుణ నామం తుంబురు నారద గాన విలొలం వేంకటాచల నిలయం వైకుంఠ పురవాసం ..♪ మకర కుండల ధరా మదన గోపాలం  భక్తపోషక శ్రీ పురంధర విఠలమ్  వేంకటాచల నిలయం వైకుంఠ పురవాసం  పంకజ నేత్రం పరమ పవిత్రం  శంఖ చక్రధర చిన్మయ రూపం  వేంకటాచల నిలయం వైకుంఠ పురవాసం  by Sriranjani Santhanagopalan Music 

సుందరకాండ మన సమస్యలకి పరిష్కారం

మన సమస్యలకి  సుందరకాండ అతిశక్తివంతమైన  తాంత్రిక పరిష్కారాలు...........!! సుందరకాండ అద్భుతమైన పారాయణం, ఎన్నో సమస్యలకు సుందరకాండ లోని వివిధ సర్గలు పారాయణ చేసి ఎంతో మంది పరిష్కారం పొందారు..  ఈ రోజుల్లో అందరికి వివిధ కారణాల వల్ల నిత్యం కాండం మొత్తం పారాయణ చేయలేరు, అయితే అందులో ఏ సమస్యకు ఏది పరిహారామో వివరంగా ఉంది. పారాయణ నియమాలతో ఉంటుంది.  ఇక్కడ ఇచ్చిన వివరాలు ఒకసారి పరిశీలించండి.  1. ఆపదలు తొలగటానికి , సంపదలు కలగటానికి ----------------------------------- శ్లోకం : ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదామ్  *లోకాభిరామం శ్రీరామం, భూయో భూయో నమామ్యహమ్ || 21 దినములు , 108 సార్లు , శక్తి  కొలది తమలపాకులు, అరటిపళ్ళు నివేదన చేయాలి.  2. విద్యాప్రాప్తికి ---------------------- ఒకసారి పరిపూర్ణంగా పారాయణ చేయవలెను . 3 రోజులు ద్రాక్ష , అరటిపళ్ళు నివేదన  3. భూతబాధ  నివారణకు -------------------------------- 3 వ సర్గ వచనము రోజుకు 108 సార్లు 30 దినములు పారాయణ చేయవలెను . 1 కొబ్బరికాయ , అరటిపళ్ళు నివేదన 4. సర్వ కార్య సిద్దికి ------------------------ 64 వ సర్గ నిష్ఠతో 11 సార్లు 40 దినములు పారాయణ చేయవలెను .శక్తి  కొలది

స, రి, గ, మ, ప, ద, ని, స* తోసరస్వతీ దేవి ప్రశంస

స, రి, గ, మ, ప, ద, ని, స* తో సరస్వతీ దేవి ప్రశంస *స* ద సత్కళా క్షీరజల విభాగ క్రియా నిపుణ హంసీ తురంగిత విలా *స* *రి* పు వదజ్ఞాన పరిభ్రాంతి హారి పుస్తక హస్త వారిజాత సుకుమా *రి* *గ* గనాపగా సమాన గంభీరగాన భాక్కమ్ర వీణా గీతికి తరం *గ* *మ* ధు మాధురీ మంజ మంజుల గేయ సమ్యక్పరిగణన సదక్ష దా *మ* *ప* రభృత కిశోర పంచమ స్వర కలాం *ప* *ద* రహసన మథురారవింద మకరం *ద*  *ని* రుపమాన ఘృణా వరణీయ జన *ని*  *స* రస శారదా యందు మన్మత్ ప్రశం *స* (ఏ శతాబ్దంలోనో పేరుకూడా చెప్పుకోని మహాకవి సరస్వతీ దేవిని స్తుతిస్తూ వ్రాసిన పద్యం ఇది)

చూడామణి నామక సూర్యగ్రహణం* తేదీ : 21-06-2020 ఉదయం 11:58

*చూడామణి నామక సూర్యగ్రహణం*   తేదీ : 21-06-2020  ఉదయం 11:58  శ్రీశార్వరినామ సంవత్సరం జ్యేష్ఠ అమావాస్య ఆదివారం .మృగశిర -4 , ఆరుద్ర -1 పాదాలు మిథున రాశి లో రాహుగ్రస్త అంగుళ్యాకారంలో సూర్య గ్రహణం సంభవిస్తోంది . ఈ గ్రహణం భారతదేశముతో పాటు ఆసియా , ఉత్తర ఆస్ట్రేలియా , పాకిస్తాన్ , శ్రీలంక , ఆఫ్రికా మొదలగు ప్రాంతములయందు కూడా కనిపించును . చాలా ప్రాంతములలో పాక్షికముగా కనిపించును , డెహ్రాడూన్ ( ఉత్తరాఖండ్ ) లో సంపూర్ణంగా కనిపించును . *మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రముల వారు , మిథునరాశి వారు ఈ గ్రహణం అసలు చూడరాదు.* *తెలంగాణ రాష్ట్రానికి* గ్రహణ ఆరంభకాలం : ఉ . 10.14 గ్రహణ మధ్యకాలం : ఉ . 11.55  గ్రహణ అంత్యకాలం : మ . 1.44  గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 30 నిమిషాలు *ఆంధ్ర రాష్ట్రానికి* గ్రహణ ఆరంభకాలం : ఉ . 10.23  గ్రహణ మధ్యకాలం : మ .12.05 గ్రహణ అంత్యకాలం : మ . 1.51 గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 28 నిమిషాలు *గ్రహణ నియమాలు*   గ్రహణం రోజు అనగా 21-06-2020 ఆదివారం నాడు  ఉదయం 6 గంటల వరకు సామాన్య మానవులు అందరూ అన్నపానాదులు ముగించాలి. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం  ఉదయం 8 గంటల వర

అన్నము గురించి సంపూర్ణ వివరణ -

అన్నము గురించి సంపూర్ణ వివరణ -  * అన్నం అగ్నిదీపనం చేయును .  * మలమూత్ర విసర్జనకారిగా ఉండును.  * చక్కగా వండి గంజివార్చిన అన్నం శరీరం నందు వేడిని కలిగించును. శరీరముకు హితము చేయును . మంచి పథ్యముగా ఉండును.  * బియ్యము కడగక గంజివార్చబడని అత్తెసరు అన్నం పైత్యమును చేయును . శుక్రమును వృద్ధిచేయును . కఫానికి కారణంగా ఉండును.   * బియ్యమును వేసి పాకము చెయ్యబడిన అన్నం రుచికరంగా ఉండి కఫాన్ని హరించును . తేలికగా ఉండును.   * పప్పు , మాంసాదులు వేసి వండిన అన్నము గురుత్వము చేయును . శుక్రమును వృద్ధిపరచును. కఫమును పుట్టించును .  * బెల్లము మొదలగు మధురరసములతో కలిసి మధురాన్నం గురుత్వం చేయును . శుక్రాన్ని వృద్దిపరచును. వాతజ్వరమును హరించును .   * మెంతి,మజ్జిగతో చేర్చిబడిన అన్నం గ్రహణి, మూలరోగం , అలసట పొగొట్టును.మరియు జీర్ణకారి.   * అతివేడి అన్నం బలమును పొగొట్టును. సమశీతోష్ణ స్థితిలో ఉన్న అన్నం తినుట మంచిది .  * రెండుమూడు రోజులు నుంచి ఉన్న అన్నం పాచి అన్నం రోగాలను పుట్టించును .  * వరి అన్నం రుచి పుట్టించును . సర్వరోగ హరమైనది . నేత్రాలకు హితము చేయును . జఠరాగ్నిని పెంచును. హృదయమునకు మేలుచేయును. శుక్రవృద్ధి , శరీర ధార

శ్రీ భువనేశ్వరీ మహా విద్య

శ్రీ భువనేశ్వరీ మహా విద్య దశ మహా విద్యలలో 4వ మహా విద్య శ్రీ భువనేశ్వరీ దేవి. భువనేశ్వరి అంటే ఈ చతుర్ధశ భువనాలకీ అధీశ్వరి. పద్నాలుగు భువనాల్లోని చరాచర జీవరాసులన్నీ ఈ దేవి ఆధీనంలోనే ఉంటాయి. ఈ మహా విద్య పరమశాంతి రూపిణీ. మూల ప్రకృతి రెండో నామాన్ని భువనేశీ అంటారు. భువనేశీ అనగా భువనేశ్వరీ. ఈ సృష్టిలోని అన్ని రూపాలూ మూల ప్రకృతి శ్రీ భువనేశీదేవివే. నిత్య జీవితములో పరిపూర్ణమైన శాంతిని కోరుకునే వారు శ్రీ భువనేశ్వరీ దేవిని ఉపాసించాలి. శ్రీ భువనేశ్వరీ దేవికి రాత్రి సిద్ధరాత్రి కాగా, త్రయంబకుడు శివుడుగా, పరమేశ్వరుడు భైరవుడుగా, త్రైలోక్యమోహిని యక్షిణిగా ఉంటారు.  ఆకాశానికి ఆధిదేవత భువనేశ్వరి అని తంత్ర గ్రంథృ఼లు వర్ణిస్తాయి. భువనేశ్వరీ దేవి నాదశరీరం హ్రీంకారం. అందుకే హ్రీం కారాన్ని శక్తి బీజంగా, భువనేశ్వరీ బీజంగా పరిగణిస్తారు. దీనినే తాంత్రిక ప్రణవం (ఓం) అని, హృల్లేఖ అని కూడా అంటారు. ఈ దేవిని మహా మాయగా, ఈమె బీజం హ్రీం కారాన్ని మాయాబీజంగా సంభావిస్తారు. భువనం అంటే లోకం. ఈ లోకానికి సృష్టికర్త భువనేశ్వరి. ఈ సృష్టి మొత్తం భువనేశ్వరీ అవతారమే. ఈమెనే అదితి అని కూడా అంటారు. అ+దితి అంటే ఖండం కానిదని అర్థం. ఈ అద