స, రి, గ, మ, ప, ద, ని, స* తోసరస్వతీ దేవి ప్రశంస
స, రి, గ, మ, ప, ద, ని, స* తో
సరస్వతీ దేవి ప్రశంస
*స* ద సత్కళా క్షీరజల విభాగ క్రియా నిపుణ హంసీ తురంగిత విలా *స*
*రి* పు వదజ్ఞాన పరిభ్రాంతి హారి పుస్తక హస్త వారిజాత సుకుమా *రి*
*గ* గనాపగా సమాన గంభీరగాన భాక్కమ్ర వీణా గీతికి తరం *గ*
*మ* ధు మాధురీ మంజ మంజుల గేయ సమ్యక్పరిగణన సదక్ష దా *మ*
*ప* రభృత కిశోర పంచమ స్వర కలాం *ప*
*ద* రహసన మథురారవింద మకరం *ద*
*ని* రుపమాన ఘృణా వరణీయ జన *ని*
*స* రస శారదా యందు మన్మత్ ప్రశం *స*
(ఏ శతాబ్దంలోనో పేరుకూడా చెప్పుకోని మహాకవి సరస్వతీ దేవిని స్తుతిస్తూ వ్రాసిన పద్యం ఇది)
Comments
Post a Comment