🕉️ *గణానాం త్వా గణపతి గం..* 🕉️
మహా గణపతి ఆయన వదనం ఓంకారం... ఆయన మాట శ్రీకారం... ఆయన పూర్ణసృష్టికి సంకేతం.
అతి గొప్ప ఆధ్యాత్మికతత్త్వం ఆయనదేనంటూ శాస్త్రాలు, ఉపనిషత్తులు వివరిస్తున్నాయి.
గణపతిని పూజించే మంత్రాల్లో అత్యంత ప్రసిద్ధిపొందిన మంత్రం రుగ్వేదం రెండో మండలంలో ఉంది.
*ఓం గణానాం త్వా గణపతిగ్‌ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం* *జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన సృణ్వన్నూతిభిస్సీదసాదనం*
తాత్పర్యం:
భూత గణములకు అధిపతివి, విద్వాంసులలో విద్వాంసుడవు, పోల్చదగిన కీర్తి శ్రేష్టులకు కూడా నీవే పోలికవు, బ్రహ్మణ్యులలో బ్రహ్మణ్యుడవు, సర్వ జగత్తుకు అధిపతివి (రాజాది రాజువు), అయిన నిన్ను మా కోర్కెలు తీర్చుటకు, మా ప్రార్థన ఆలకించి ఈ పూజా సమయము నందు ఈ స్థానమును లేక ఆసనమును అలంకరించుము.
గణపతిని రాజుల్లో పెద్దవాడుగా, దేవతల్లో పూజలందుకునే మొదటివాడుగా, 33 కోట్ల దేవతాగణాలకు అధినాయకుడిగా వర్ణిస్తుంది రుగ్వేదం. గణాలకు నాయకుడిగా గణపతిని చెబుతోందే కానీ గజముఖ స్వరూపం గురించి ఈ వేదంలో కనిపించదు.
పునరావృతం అవుతున్న ఈ స్తోత్రం వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది.
మధుర భక్తి రస గానం :
*శ్రీ ప్రకాష్ కౌశిక్
Comments
Post a Comment