Posts

Bathing time for success ,good health, prosperity, and good relationship

*MUNI BATH and DEV BATH* Bathing Between 4 am to 6 am Brings happiness, peace, wealth, and good health in your life.  *MANAV BATH* Bathing Between 6 am to 8 am Brings success in your work, good luck, mutual relationship, good health and wealth. *RAAKSHAS BATH* Bathing After 8 am leads to  arguments at home and also at work, depression, loss in income and bad health.  So for successful life, have a bath before 8 am.

నవగ్రహాల అనుగ్రహాన్ని కలిగించే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం

శ్రీ ఆంజనేయస్వామి వారిని పూజిస్తే సకల దేవతలని పూజించిన ఫలితం వస్తుందని పరాశర సంహిత'లో ఉంది. నవగ్రహాల అనుగ్రహం త్వరగా పొందాలంటే వాల్మీకి రామాయణం లోని ఈ 9 శ్లోకాలు నిత్యం పారాయణ చేయడం మంచిది. నవగ్రహాలు అత్యంత కరుణా స్వరూపులు. మనం పూర్వజన్మలలో చేసిన పుణ్యపాపాల బట్టి ఫలితాలని ఇస్తారు.  కానీ భక్తితో వారిని ఇటువంటి స్తోత్రాలతో స్తుతిస్తే శుభఫలితాల్ని అనుగ్రహిస్తారు.  శ్రీ ఆంజనేయ నవరత్నమాలా శ్లోకాల పారాయణం వల్ల విద్యార్థులకు మేధస్సు, ఉద్యోగస్తులు, వ్యాపారులకు అభివృద్ధి, స్త్రీలకు వివాహం, సత్సంతానము మరియు వృద్దులకు ఆరోగ్యం కలుగుతుంది. నిత్యం లేదా శనివారం అయినా వీటిని పారాయణ చేయడం వలన శుభఫలితాలని పొందవచ్చు. వాల్మీకి రామాయణమునకు సుందరకాండ తలమానికము.సుందరకాండ సారమైన 9 శ్లోకములతో ఏర్పడినదే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం.  రత్నములవంటి తొమ్మిది శ్లోకములను ఒక మాలగా కూర్చి శ్రీ ఆంజనేయస్వామి వారికి సమర్పించబడినది. ఈ తొమ్మిది శ్లోకములు తొమ్మిది గ్రహములకు చెందునని చెప్పబడినది.  ఇవి శ్రీ ఆంజనేయస్వామి వారి వైభవము, స్వామి వారికి నవ గ్రహములతో గల సంబంధము తెలియబర్చును. ఈ స్తోత్రం పారాయణ చేసినవారికి శ్రీ ఆ

శ్యామశాస్త్రిగారు/Sri Syamasastry

కర్ణాటక సంగీత మూర్తిత్రయం గురించి మీరువినే ఉంటారు..వారే...శ్యామశాస్త్రి,త్యాగరాజు,దీక్షితులు-వీరి ముగ్గురిలోశ్యామశాస్త్రిగారి రచనలు బహు కొద్దిగా సుమారు 300 వరకూ మాత్రమే ఉన్నాయి.వాటిలోనూ ప్రస్తుతం అందరికీ తెలిసినవి వందలోపే ఉంటాయి.సంఖ్యాపరంగా తక్కువ రచనలుచేసినా,మిగిలిన ఇరువురితో సమాన స్థానం శ్యామశాస్త్రిగారికి దక్కటం విశేషం.     తంజావూరులో వంశపారంపర్యంగా తమకు లభించిన బంగారుకామాక్షి ఆలయ అర్చకత్వ విధులు నిర్వర్తిస్తూ,పరమభక్తులైన శ్యామశాస్త్రిగారు,నిత్యం అమ్మవారితో జరిపిన సంభాషణే కృతులుగా మనకు లభించాయి.వర్ణాలు,స్వరజతులు కూడా శ్యామశాస్త్రిగారు చేశారు.భాషాపరంగా చాలా సరళంగా ఉన్నా,సంగీతపరంగా ఎంతో ఘనమైనవి వారి రచనలు.ముఖ్యంగా లయ జ్ఞానంలో అసామాన్యులు వారు.     వారి జీవితంలో జరిగిన ఒక ఘట్టం వివరిస్తాను...         అది తంజావూరు రాజాస్థానం.శరభోజి మహారాజుగారు కొలువుతీరి ఉన్నారు.సభలోకి ఒక సంగీత విద్వాంసుడు ప్రవేశించాడు.ఆయన ఆంధ్రదేశం నుండివచ్చిన 'భూలోక చాపచుట్టె'గా ప్రసిద్ధులైన బొబ్బిలి కేశవయ్యగారు.ఆయన లోకమంతా చుట్టబెడుతూ,తన సంగీత విద్వత్తుతో అనేక రాజాస్థానాలలోని విద్వాంసులను ఓడిస్తూ,వస్తున్నారు.

కాశీకంటే పురాతనమైన పుణ్యక్షేత్రం వృద్ధాచలక్షేత్రం

తమిళనాడులోని ఓ పుణ్యక్షేత్రం కాశీ క్షేత్రం కంటే పురాతనమైనది. అందువల్లే ఇక్కడ స్వామివారిని పూజిస్తే కాశీలో విశ్వనాధుడిని సేవించిన దానికంటే ఎక్కువ పుణ్యం వస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడ పుట్టినా, చనిపోయినా అప్పటి వరకూ చేసిన తప్పులు సమిసిపోయి తప్పక కైలాసానికి వెళ్తామని  ప్రతీతి. అందుకే కాశీలో జీవిత చరమాంకం గడపడానికి వీలుకుదరని వారు ఇక్కడికి వచ్చి దైవ సన్నిదిలో తమ శేష జీవితాన్ని ముగిస్తారు. ఈ నేపథ్యంలో ఆ దేవాలయానికి సంబంధించిన కథనం. వృద్దాచలాన్ని వృద్ధ కాశి అని కూడా పిలుస్తారు. ఇందుకు కారణం లేకపోలేదు. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం వృద్ధ కాశి అని పిలువబడే ఈ విరుదాచలంలో మరణిస్తే కాశీలో మరణించిన వారికంటే ఎక్కువ పుణ్యమే లభిస్తుందని చెబుతారు. మహిళలు తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని ఈ దేవతను పూజిస్తారు కాశీలో చెప్పినట్టే ఇక్కడ కూడా చనిపోతున్నవారి శిరస్సును తన ఒడిలో ఉంచుకొని ఇక్కడ కొలువై ఉన్న వృధ్ధాంబిక తన చీర కొంగుతో విసురుతూ ఉండగా వారి చెవిలో పరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశించి వారికి మోక్షం ప్రసాదిస్తాడని చెబుతారు. అదే విధంగా పరమశివుడు నటరాజ ర

భీష్మాష్టమి

మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమి అంటారు. ఈ రోజునే భీష్మ పితామహుడు మోక్షప్రాప్తిని పొందిన పర్వదినము . భీష్మాష్టమి రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. నలభై ఆరు రోజుల పాటు అంపశయ్య మీద ఉన్న కురువృద్ధుడు ఈ రోజున తన ఇష్టం ప్రకారం ప్రాణాలను వదిలాడు.  మాఘ మాసే సితాష్టమ్యాం   సతిలం భీష్మ తర్పణం ! శ్రాద్ధం యే మానవాః కుర్యుస్తేస్యు స్సంతతి భాగినః !!  ఏతజ్జీవ పిత్రుకేన అపి   కార్యం !  సాధారణంగా తండ్రి బతికి ఉన్నవారు తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కారు. కానీ భీష్మ తర్పణం విషయంలో ఆ నియమాన్ని పాటించరు. నరకచతుర్దశి, దీపావళి సమయంలో యమ తర్పణం ఎలాగైతే  తండ్రి జీవించి వున్నవాళ్ళు కూడా చేస్తారో. అదే విధిన భీష్మ తర్పణం కూడా నిర్వహించాలి. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం అని పద్మ పురాణం చెబుతుంది.  అంతటి ప్రత్యేక స్థానం భీష్ముడికి ఉంది. *భీష్మతర్పణ విధి* భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా సత్యధర్మములకు కట్టుబడి జీవించి చివర శ్రీకృష్ణుని సన్నిధిలో ముక్తినిబడసినవాడు, మూడు దోసిళ్ళ అర్ఘ్యం భీష్మ ప్రీతికి కింద ఇచ్చిన శ్లోకములను చెప్పి ఇవ్వవలసి వుంటుంది. అలాగే తర్పయామి అని చెప్పినచోట్ల

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా అష్టోత్తర సహస్రనామావళి

Image

సరస్వతిదేవి రాతి మీద కూర్చుంటుంది. నెమలి, హంస పక్కనే ఎందుకు నిలబడి ఉంటుంది?a

సరస్వతిదేవిని అందరం చిత్ర పటలలో, ప్రతిమలలో చూస్తూనే ఉంటాం. బ్రహ్మపత్నిఅయిన ఈమె తెల్లని వస్త్రాలు ధరించి శ్వేత పద్మం లో కూర్చుని మాణిక్య వీణను మీటుతూ ఉంటుంది. ఈమెకు శరదృతువు అంటే ఇష్టం. మూలా నక్షత్రం సరస్వతి నక్షత్రంగా భావిస్తారు. ముత్యాల సరాలు ధరించే ఈమెకు హంస వాహనం. నెమలి ఫించం అంటే ఇష్టం కూడా..  అందరు దేవతలు కమల పుష్పంలో కూర్చున్నట్లుగా చిత్రాలలో చూస్తూ ఉంటాం కదా! మరి దానికీ అర్ధం ఏమిటంటే... కమల పుష్పం నిలువులోతులో నీటిలో బురదలో పుడుతుంది. నీటిలో ఉన్న కమల పుష్పానికి నీరు అంటుకోవు. నీటికి నానదు. చీకటి అంటే ఇష్టం ఉండదు. వెలుగు ఉంటేనే వికసిస్తుంది. అందుకే దీనిని జ్ఞానపుష్పం గా హిందువులు గౌరవిస్తారు.  సరస్వతీదేవి రాతి మీద కూర్చుని ఉండటానికి ఒక సంకేతం ఉంది. సరస్వతి సర్వవిద్యలకు అధిదేవత! శక్తి సంపదలు స్థిరం కావు ఎదోకనాటికి హరించుకుపోతాయి, కాని విద్య బండరాయి లా సుస్థిరమైనది అనే విషయాన్ని తెలియ పర్చటానికే సరస్వతీదేవి రాతి మీద కూర్చుని ఉంటుంది.  ఆమె హంస నే వాహనంగా ఎంచుకోవడానికి కారణమేమిటంటే... హంస జ్ఞాన పక్షి. పాలలో నీటిని పోసి వేరు చేయడం సాధ్యమా! కాదు కదా! కాని హంస ముందు పాలలో నీటిని పోసి ఉం

వసంత పంచమి/ Vasanta Panchami

శ్రీకరమైన జ్ఞానదీప్తిని పెంపొందించి, బుద్ధిశక్తిని ధీయుక్తిని ప్రసాదించే మాతృశక్తి స్వరూపిణి సరస్వతి. సమస్త సంపదలకు మూలభూమిక- విద్య. లౌకికపరమైన, ఆధ్యాత్మికమైన బ్రహ్మవిద్యకు అధిష్ఠాత్రి- శ్రీవాణి. ప్రతిభ, మేధ, శ్రద్ధ, స్ఫురణ, ధారణ, చైతన్యం, వాక్పటిమ, ఏకాగ్రత, కళావైదుష్యం వంటి అంశాల్ని శ్రీవిద్యగా భారతి అనుగ్రహిస్తుందంటారు. ‘సరస్వతి’ అనే శబ్దానికి సర్వత్రా వ్యాపించిన శక్తి అని అర్థం. మనలో వెల్లివిరిసే, సర్వ అణువుల్లో వ్యాపించి ఉన్న జీవశక్తే సరస్వతి అంశ. జీవుల్లోనే కాకుండా, సకల సృష్టిలో సజీవకళకు ప్రతిరూపంగా సరస్వతిని సమార్చన చేస్తారు. జ్ఞానమే అసలైన సంపద. ఆ సంపదల్ని సంతుష్టిగా అందించే సత్వగుణ స్వరూపిణి సరస్వతీదేవి. మాఘశుద్ధ పంచమినాడు విద్యా వరదాయినిగా అభివ్యక్తమైందంటారు. ఈ విశేషమైన పంచమిని శ్రీపంచమి, వసంత పంచమి, విద్యాపంచమి, మదన పంచమి, దివ్య పంచమి, మహాపంచమిగా వ్యవహరిస్తారు. మకర సంక్రమణం తరవాత క్రమంగా వసంత రుతువు లక్షణాలు ప్రకృతిలో వ్యక్తమవుతుంటాయి. చైత్రంతో విచ్చేసే వసంతానికి శిశిరంలో శుభస్వాగతాన్ని పలికే రుతుసంబంధిత పర్వదినం వసంతపంచమి. సరస్వతి జన్మదినోత్సవంగా నిర్వహించే ఈ వేడుకకు ఉత్తర భా

Communion with Swami Bhagwan Sri Sri Styasaibaba

*Communion with Swami How to communicate with Swami? As detailed by Bhagawan Himself:* So much of worries, so much of problems, I am not well, I am not rich, I am not considered by anyone, I am not married, I have no children......why why why Bhagawan is not listening to my prayers? Is he in a reachable distance to hear my prayers? Or is he not interested to solve my problems? Do you think Bhagawan is somewhere and you are away from Swami? No... I am not somewhere, I am not away from you. I have not avoided to respond your prayers. Listen one thing here.  This world, this Kali yuga is filled with negativity. Man is rushing to temples to request the God to solve his problems or to get something from him. Do you think Bhagawan is a merchant selling something you need always? I have come not to sell anything to you. You need not ask me anything. A cow always keeps milk ready for its calf, and the calf never seeks permission or requests to enjoy the cow's milk. Why you do prayers? When

మాసికాల_రహస్యం/ Masikala Rahasyam

*ఎల్లుండి అమావాస్య సందర్భంగా.....* *పితృదేవతల ఆరాధన చేద్దాం*  *మాసికాల_రహస్యం_ఇదే*!  *మాసికాలు_ఎందుకు_పెట్టాలి?* *అన్ని_మాసికాలు_పెట్టాలా?* *కొన్నిమానేయవచ్చా?*  వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది.  *అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు.* *కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి.*  చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి? అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు. వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు. బ్రహ్మదేవుని

Ragas Cure Rogas

Healing power of music: Every Raga is a medicine, Every Raga is a Mantra, Every Raga has healing powers.  Sapthaswara's are 7 Gods.* SA  -is Agni RE  - is Brhma GA  -is Saraswathi MA - is Shiva PA  -is Vishnu DHA - is Ganesha NI - is Surya Bhagawan 01. Ahir Bhairav -Gives free relaxed feeling and mitigates dust allergies and skin disease. Good for arthritic conditions 02. Amrutavarshini - Ushana vyathi nasini ( alleviates diseases related to heat) 03. Ananda Bhairavi - Supresses stomach pain in both men and women. Reduces kidney type problems. Controls blood pressure 04. Bagesri - Helps in attaining Guru's grace. Arouses a feeling of darkness, stability, depths and calmness. This raga is also used in treatment of diabetes and hypertension. 05. Bhairavi - Reduces anxiety, pressures, skin, disease, allergies 06. Bhupala - To awaken someone out of deep sleep 07. Charukesi - 26th raga in the melakarta scale (parent) of the south Indian classical music. Rejuvenates the mind helping

సరస్వతీ దేవి చేతి లో వీణ ఎందుకు ఉంటుంది ?

🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌹శ్రీరస్తు, 🌹   లోకం లో  ఎన్నో రకాల సంగీత వాయిద్యాలు ఉండగా సరస్వతీ దేవి చేతి లో వీణ ఎందుకు ఉంటుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ?  సరస్వతీ అమ్మ వారు చేతి లో కచ్ఛపి  అనే వీణ ఉంటుంది.  ఆ దేవి తెల్లని వర్ణం కలది.  చాలా సాత్విక రూపిణి గా తెల్లని పద్మం పై కానీ తెల్లని హంస పైన కానీ కూర్చుని ఉన్నది గా వర్ణింపబడినది. తెల్లని హంస పైన ఎందుకు ఉన్నది లేక తెల్లని తామర లో ఎందుకు ఉన్నది? ఆమె తెల్లగా ఉండడం దేనిని సూచిస్తుంది అనే విషయాలు తరువాత తెలుసుకుందాం. సరస్వతీ దేవి జ్ఞానానికి, సంగీతానికి, కళలకు, వివేకానికి అధిష్ఠాన దేవత కదా.  మరి మన శరీరం లో వివేక, జ్ఞానాల యొక్క స్థానం ఏది?  అది మన మెదడు ఇంకా వెన్నుపాము కదా.  ఇప్పుడు మీరు వీణ ను గమనించండి.  మెదడు ఉండే పుఱ్ఱె కు వెన్ను పామును అమర్చినట్టు ఉంటుంది.  అంటే ఆ వీణ యొక్క బుర్ర మన పుఱ్ఱె  అన్నమాట. మిగతా భాగం మన వెన్నుపాము.  అక్కడితో అయిపోలేదు.  వీణ చివర మీరు సరిగ్గా గమనిస్తే ఒక జంతువు ముఖం కనిపిస్తుంది.  దాని పేరు యాళి.  అది ఒక పౌరాణిక మృగం.  అది మన వెన్నుపాము కు చివర ఉండే చక్రం లో ఉన్న కుండలినీ శక్తిని సూచిస్తుంది.  మానవ శరీరం

Oyamma Ravamma / ఓయమ్మా రావమ్మా

Image

తిరువెంబావై/ Tiruvembavai

🙏🏻విష్ణువును మేల్కొల్పుతూ 🙏🏻తిరుప్పావై🙏🏻 - 🔱శివుని🔱 మేల్కొల్పుతూ ‘🙏🏻తిరువెంబావై🙏🏻 సూర్యుడు ధనూరాశిలోనుండి మకరరాశిలోనికి ప్రవేశం చేసిన వరకు గల ముప్ఫది రోజుల కాలాన్ని ధనుర్మాసంగా వ్యవహరిస్తారు. రెండు సంక్రమణాల మధ్య కాలం ఎంతో పవిత్రమైనది. మార్గశిర పుష్యమాసాలలో వ్యాపించి ఉంటుంది. శివకేశవులను ఉషఃకాలం కీర్తించే సమయం. హిందూ మతంలో ప్రధాన శాఖలు శైవము, వైష్ణవము. శైవములో శివుడు, వైష్ణవంలో విష్ణువు ప్రధాన దైవాలు. ఆయా ఆలయాల్లో ఉషఃకాలంలో శివుని మేల్కొల్పుతూ ‘తిరువెంబావై’, *విష్ణువును మేల్కొల్పుతూ ‘తిరుప్పావై’ గానం చేస్తారు. వీటిని పాశురాలుగా పేర్కొంటారు*. ముప్ఫది రోజులు రోజుకొక పాశురం గానం చేయబడ్డ తిరువెంబావై, తిరుప్పావై తమిళ వాఙ్మయంలో అత్యంత ప్రసిద్ధిని పొందాయి. భక్త్భివనమే ప్రధానంగా వున్న వీటిని పావై పాటలుగా వ్యవహరిస్తారు.  *‘*తిరువెంబావై’ తిరువాచకమనే అత్యంత భక్తిప్రధానమైన తమిళ గ్రంథంలో అగ్రస్థానమలంకరించింది*.*  అలానే తిరుప్పావై ద్రవిడ వేదంగా ప్రాముఖ్యత పొందిన నాలాయిరంలో హృదయ స్థానమలంకరించింది. ఉత్కృష్టమైన విష్ణ్భుక్తిని తిరుప్పావై ప్రసాదించింది. గోదాదేవి హృదయం ఆవిష్కరించినది. అదేవిధంగ

తీర్ధం 3 సార్లు ఎందుకు తీసుకోవాలో తెలుసా?

ఇంట్లో, దేవాలయంలో లేదా ఇంకెక్కడైనా  దేవుడిని దర్శించుకున్న తర్వాత  తీర్ధం తీసుకుంటాం.  కాని తీర్ధాన్ని మూడుసార్లు ఎందుకు తీసుకోవాలి అన్నది ఎప్పుడైనా ఆలోచించరా?  దేవునికి పూజ చేసిన తర్వాత తీసుకునే *తీర్ధంలో-*  a. పంచామృతాలు,  b. తులసి దళాలు,  c.సుగంధ ద్రవ్యాలు,  d. మంత్ర శక్తులు ఉంటాయి.  దీంతో ఆ తీర్ధం *అత్యంత పవిత్రంగా మారుతుంది*.  తీర్ధం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్యాత్మికత మెరుగవుతాయి. 1. మొదటిసారి తీర్ధం తీసుకుంటే, *శారీరక, మానసిక శుద్ధి* జరుగుతుంది. 2. రెండవసారి తీర్ధం తీసుకుంటే, *న్యాయ, ధర్మ ప్రవర్తనలు* చక్కదిద్దుకుంటాయి. 3.ఇక మూడవది, పవిత్రమైన *పరమేశ్వరుని పరమ పదం*  అనుకుని తీసుకోవాలి. *మన పురాణాల ప్రకారం -* తీర్ధం అంటే తరింపజేసేది అని అర్ధం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే.. భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు. తీర్ధం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి. " *ఈ తీర్ధం నాకు మంచి చేస్తుంది, నా ఆరోగ్యానికి మరియు నా ఆధ్యాత్మికతను మెరుగు పరుస్తుంది* " అనే సద్భావంతో తీసుకోవాలి. దేవుడికి పూజలు చేసే *పూజారులు, క్రింది మంత్రం జపిస్తూ,*  భక్తులకు తీర్ధాన్ని ఇస్తారు. *అక