తీర్ధం 3 సార్లు ఎందుకు తీసుకోవాలో తెలుసా?


ఇంట్లో, దేవాలయంలో లేదా ఇంకెక్కడైనా 
దేవుడిని దర్శించుకున్న తర్వాత 
తీర్ధం తీసుకుంటాం. 

కాని తీర్ధాన్ని మూడుసార్లు ఎందుకు తీసుకోవాలి అన్నది ఎప్పుడైనా ఆలోచించరా? 

దేవునికి పూజ చేసిన తర్వాత తీసుకునే *తీర్ధంలో-* 
a. పంచామృతాలు, 
b. తులసి దళాలు, 
c.సుగంధ ద్రవ్యాలు, 
d. మంత్ర శక్తులు ఉంటాయి. 

దీంతో ఆ తీర్ధం *అత్యంత పవిత్రంగా మారుతుంది*. 
తీర్ధం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్యాత్మికత మెరుగవుతాయి.

1. మొదటిసారి తీర్ధం తీసుకుంటే, *శారీరక, మానసిక శుద్ధి* జరుగుతుంది.

2. రెండవసారి తీర్ధం తీసుకుంటే, *న్యాయ, ధర్మ ప్రవర్తనలు* చక్కదిద్దుకుంటాయి.

3.ఇక మూడవది, పవిత్రమైన *పరమేశ్వరుని పరమ పదం* 
అనుకుని తీసుకోవాలి.

*మన పురాణాల ప్రకారం -*
తీర్ధం అంటే తరింపజేసేది అని అర్ధం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే.. భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు.

తీర్ధం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి. " *ఈ తీర్ధం నాకు మంచి చేస్తుంది, నా ఆరోగ్యానికి మరియు నా ఆధ్యాత్మికతను మెరుగు పరుస్తుంది* " అనే సద్భావంతో తీసుకోవాలి.

దేవుడికి పూజలు చేసే *పూజారులు, క్రింది మంత్రం జపిస్తూ,* 
భక్తులకు తీర్ధాన్ని ఇస్తారు.

*అకాల మృత్యు హరణం*
*సర్వవ్యాధి నివారణం!*
*సమస్త పాపక్షయకరం*
*శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం!!*

మూడు సార్లు కూడా 
*కుడిచేయి కింద,*
 ఎడమ చేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి. 
కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే ,
*గోముఖం అనే ముద్ర* వస్తుంది. 
ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి. 

తీర్థాన్ని తీసుకున్నాక *తలపై తుడుచుకుంటారు.* కాని అలా చేయకూడదు. 
తల పైన బ్రహ్మ దేవుడు ఉంటాడు. *మన ఎంగిలిని,* బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాము. కనుక కళ్లకద్దుకోవడం మంచిది.

అలాగే, తీర్థాన్ని తీసుకున్నాక,
*చేతినీ,*
*వేరొక కర్చీపుతో / గుడ్డతో తుడుచుకుంటే* మంచిది.

ముఖ్యంగా 
*మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు* 
ఇలాంటి వాటిపై *అవగాహన కలిపించండి..!*

🙏🙏🕉🕉🇮🇳🇮🇳🚩🚩

Comments

Popular posts from this blog

Ananda Nilayam/ ఆనంద నిలయం /आनंद निलयम

బీజాక్షర సంకేతములు/ Meaning of Bheejaksharas