సరస్వతిదేవి రాతి మీద కూర్చుంటుంది. నెమలి, హంస పక్కనే ఎందుకు నిలబడి ఉంటుంది?a

సరస్వతిదేవిని అందరం చిత్ర పటలలో, ప్రతిమలలో చూస్తూనే ఉంటాం. బ్రహ్మపత్నిఅయిన ఈమె తెల్లని వస్త్రాలు ధరించి శ్వేత పద్మం లో కూర్చుని మాణిక్య వీణను మీటుతూ ఉంటుంది. ఈమెకు శరదృతువు అంటే ఇష్టం. మూలా నక్షత్రం సరస్వతి నక్షత్రంగా భావిస్తారు. ముత్యాల సరాలు ధరించే ఈమెకు హంస వాహనం. నెమలి ఫించం అంటే ఇష్టం కూడా.. 

అందరు దేవతలు కమల పుష్పంలో కూర్చున్నట్లుగా చిత్రాలలో చూస్తూ ఉంటాం కదా! మరి దానికీ అర్ధం ఏమిటంటే... కమల పుష్పం నిలువులోతులో నీటిలో బురదలో పుడుతుంది. నీటిలో ఉన్న కమల పుష్పానికి నీరు అంటుకోవు. నీటికి నానదు. చీకటి అంటే ఇష్టం ఉండదు. వెలుగు ఉంటేనే వికసిస్తుంది. అందుకే దీనిని జ్ఞానపుష్పం గా హిందువులు గౌరవిస్తారు. 

సరస్వతీదేవి రాతి మీద కూర్చుని ఉండటానికి ఒక సంకేతం ఉంది. సరస్వతి సర్వవిద్యలకు అధిదేవత! శక్తి సంపదలు స్థిరం కావు ఎదోకనాటికి హరించుకుపోతాయి, కాని విద్య బండరాయి లా సుస్థిరమైనది అనే విషయాన్ని తెలియ పర్చటానికే సరస్వతీదేవి రాతి మీద కూర్చుని ఉంటుంది. 

ఆమె హంస నే వాహనంగా ఎంచుకోవడానికి కారణమేమిటంటే... హంస జ్ఞాన పక్షి. పాలలో నీటిని పోసి వేరు చేయడం సాధ్యమా! కాదు కదా! కాని హంస ముందు పాలలో నీటిని పోసి ఉంచితే పాలను మాత్రమే తాగుతుందట. అంటే విద్య వల్ల వివేకం, విజ్ఞానం లభిస్తాయని తెలియపర్చటానికే ఆమె హంసవాహిని అయింది. 

ఇక నెమలి ఆమె వద్ద ఎందుకు ఉంటుందంటే... సమస్త ప్రాణులు ఆడమగ కలిసి సంభోగం చేస్తాయి. కాని నెమలికి సంభోగం ఉండదు. పవిత్ర పక్షి యిది. మగ నెమలి కంటి నీటిని త్రాగి గ్రుడ్డు పెడుతుంది. రాతిక్రియ జరుపని పక్షి ఇదొక్కటే. విద్య పవిత్రమైనదని, విద్య నేర్చుకోనేపుడు పవిత్రంగా ఉండాలని తెలియపర్చటానికే నెమలిని సరస్వతిదేవి వద్ద చిత్రిస్తారు. 

విద్యనిగూఢ గుప్తమగువిత్తము, రూపము పూరుషాళికిన్
విద్యయశస్సు, భోగకరి, విధ్య గురుండు, విదేశబంధుడున్ 
విద్య విశిష్ట దైవతము, విద్యకుసాటి ధనంబు లేదిలన్,
విద్యనృపాల పూజితము, విద్యనెరుంగనివాడు మార్త్యుడే!

భావం: రహస్యంగా దాచుకొన్న ధనం విద్య , మానవులకు అందం విద్య. అది కీర్తిని, సుఖాన్ని ఇస్తుంది. విద్యయే గురువు, విదేశాలలో భందువు; దైవం. ఈ భూమి మీద విద్యకు సాటి అయిన ధనం లేదు. పాలకులచే పూజింపబడేది విద్య.

Comments

Popular posts from this blog

Ananda Nilayam/ ఆనంద నిలయం /आनंद निलयम

బీజాక్షర సంకేతములు/ Meaning of Bheejaksharas