సరస్వతీ దేవి చేతి లో వీణ ఎందుకు ఉంటుంది ?

🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌹శ్రీరస్తు, 🌹  

లోకం లో  ఎన్నో రకాల సంగీత వాయిద్యాలు ఉండగా సరస్వతీ దేవి చేతి లో వీణ ఎందుకు ఉంటుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? 

సరస్వతీ అమ్మ వారు చేతి లో కచ్ఛపి  అనే వీణ ఉంటుంది. 

ఆ దేవి తెల్లని వర్ణం కలది. 

చాలా సాత్విక రూపిణి గా తెల్లని పద్మం పై కానీ తెల్లని హంస పైన కానీ కూర్చుని ఉన్నది గా వర్ణింపబడినది.

తెల్లని హంస పైన ఎందుకు ఉన్నది లేక తెల్లని తామర లో ఎందుకు ఉన్నది?

ఆమె తెల్లగా ఉండడం దేనిని సూచిస్తుంది అనే విషయాలు తరువాత తెలుసుకుందాం.

సరస్వతీ దేవి జ్ఞానానికి, సంగీతానికి, కళలకు, వివేకానికి అధిష్ఠాన దేవత కదా. 

మరి మన శరీరం లో వివేక, జ్ఞానాల యొక్క స్థానం ఏది? 

అది మన మెదడు ఇంకా వెన్నుపాము కదా. 

ఇప్పుడు మీరు వీణ ను గమనించండి. 

మెదడు ఉండే పుఱ్ఱె కు వెన్ను పామును అమర్చినట్టు ఉంటుంది. 

అంటే ఆ వీణ యొక్క బుర్ర మన పుఱ్ఱె  అన్నమాట.

మిగతా భాగం మన వెన్నుపాము. 

అక్కడితో అయిపోలేదు. 

వీణ చివర మీరు సరిగ్గా గమనిస్తే ఒక జంతువు ముఖం కనిపిస్తుంది. 

దాని పేరు యాళి. 

అది ఒక పౌరాణిక మృగం. 

అది మన వెన్నుపాము కు చివర ఉండే చక్రం లో ఉన్న కుండలినీ శక్తిని సూచిస్తుంది. 

మానవ శరీరం లోని చక్రాలు తోకను నోటితో కరుచుకుని ఉన్న కుండలిని మానవ శరీరం లో వెన్నుపాము మీద గా  ఏడు చక్రాలు ఉంటాయి. 

అందులో అన్నిటి కన్నా కింద మూలాధారం  అనే చక్రం ఉంటుంది. 

అందులో మనిషి లోని కుండలిని శక్తి  ఒక నల్లని పాములా తన తోక ను తానే నోటి తో కరిచి పట్టుకుని ఉంటుంది. 

ఈ వీణ లో యాళి ఆ కుండలిని శక్తి కి ప్రతిరూపం అన్నమాట. 

అంటే వీణ పట్టుకోవడం ద్వారా అమ్మవారు ఎవరైతే తనకు స్వచ్ఛమైన మనసు తో తమని తాము ఆమె కి దాసోహం ( నేను నీకు దాసుడను ) అని అంటారో 

వాళ్ళ బుద్ధి అనే వీణ ను మంచివి, గొప్పవి ఐన ఆలోచనలు అనబడే సుస్వరాలు పలికేలా మీటుతుంది అని అర్థం.

        🌹శుభమస్తు🌹

🙏సర్వే జనా సుఖినోభవంతు🙏

Comments

Popular posts from this blog

సుందరకాండ లఘుపారాయణ - Sunderakanda Song

GANESH PANCHA RATNA STOTRAM

బీజాక్షర సంకేతములు/ Meaning of Bheejaksharas