Posts

సత్యం(నిజం)మే గొప్ప సంపద!!!

ప్రపంచంలో మనకు అబద్ధమే రాజ్యమేలుతున్నట్లు అనిపిస్తుంది కానీ, చివరికి నిలిచేది సత్యమే, సందేహం లేదు. ఉపనిషత్తులలోని ఈ కథ, సత్యం ఎంత గొప్ప సంపదో వివరిస్తున్నది.  అన్ని  విషయాల్లోనూ నిజం చెప్పగల్గటం అన్నది నిజంగానే గొప్ప సంపద. సత్యాన్ని జీవితంలోకి ఆహ్వానించి, అడుగడుగునా నిజాన్నే ఆయుధంగా మలచుకోవాలని నేర్పిన గాంధీజీని ఓసారి తలచుకొని, ఆ స్ఫూర్తితో మన జీవితాల్లో నిజం పాలు ఇంకొంత పెంచుకుందాం. నిజం చెబుదాం; వాస్తవంగా బ్రతుకుదాం. #సత్యవ్రతుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి. అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు. ఆయన ఆమెను ఆపి, గౌరవంగా "ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?" అని అడిగాడు. "రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్

శ్రీ సూర్య భగవాన్

ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల  కిలోమీటర్ల దూరంలో ఉన్నసూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని8 నిమిషాలుగా అంచనా కట్టారు.  హనుమంతుడు బాల్యంలో  సూర్యుణ్ణి పండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట. హనుమ వెళ్లిన దూరాన్ని ‘యుగ సహస్ర యోజన పరాభాను’ అని తులసీదాస్‌ హనుమాన్‌ చాలీసాలో చెబుతారు. దీన్ని లెక్క కడితే..  యుగం.. 12000 ఏళ్లు,  సహస్రం అంటే .. 1000,  యోజనం అంటే . 8 మైళ్లు,  మైలు అంటే ... 1.6 కిలోమీటర్లు  వెరసి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు.  సూర్యకాంతి సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే, ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.  ఆ ఏడు గుర్రాల పేర్లు       1. గాయత్రి       2. త్రిష్ణుప్పు       3. అనుష్టుప్పు       4. జగతి       5. పంక్తి       6. బృహతి       7. ఉష్ణిక్కు వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.  పగలు రాత్రి సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు, రాత్రికి ప్రతీక. ఋతువులు చక్రాలకున్న ఆరు ఆకులు ఋతువులకు ప్రతీక. ధర్మం  ధ

సూర్యుడు నెలకొక్క ప్రాధాన్యతను వహిస్తాడు, తెలుసా?

ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం 12 మంది సూర్యులు.          1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు ధాత           2. వైశాఖంలో అర్యముడు          3. జ్యేష్టం- మిత్రుడు          4. ఆషాఢం- వరుణుడు          5. శ్రావణంలో ఇంద్రుడు          6. భాద్రపదం- వివస్వంతుడు          7. ఆశ్వయుజం- త్వష్ణ          8. కార్తీకం- విష్ణువు          9. మార్గశిరం- అంశుమంతుడు        10. పుష్యం- భగుడు        11. మాఘం- పూషుడు        12. ఫాల్గుణం- పర్జజన్యుడు ఆ నెలల్లో *సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు* వచ్చాయని చెబుతారు. సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు.

తిరుమల: వయోవృద్ధులకు(సీనియర్ సిటిజన్స్) శ్రీ వేంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం.

వయోవృద్ధులకు(Senior Citizens) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం  రెండు సమయాలున్నాయి:         1. ఉదయం 10 AM తరువాత         2. సాయంత్రం 3కు. అంతే. ఫోటోతో వున్న  వయసు నిర్ధారణ పత్రాలు(Photo Identity, (Adhaar Card, PAN Card, Passport, etc. )  *S 1 counter వద్ద చూపించాల్సి వుంటుంది* S1 Counter ఎక్కడ ఆలయానికి కుడివైపు బ్రిడ్జి కింద  గోడ పక్కనే. మెట్లు ఎక్కాల్సిన పనిలేదు. మంచి సీట్లు ఏర్పాటు చేయబడి వుంటాయి. సాంబారన్నం, పెరుగన్నం, వేడి పాలు ఉచితంగా ఇస్తారు. వారికి ₹20/-లకు రెండు లడ్డు టోకెన్లు ఇస్తారు. తరువాత  ₹25/- లకు ఒక లడ్డు చొప్పున ఎన్నైనా టోకెన్లు ఇస్తారు.  బ్యాటరీ కారు కౌంటరు నుండి గుడి-గుడి నుండి కౌంటరుకు బ్యాటరీ కారులో ఉచిత ప్రయాణం. వీరి దర్శనం కొరకు *మిగతా అన్ని క్యు లు నిలిపివేయబడతాయి* *ఎటువంటి వత్తిళ్ళు-తోపులాటలు వుండవు* *30 నిమిషాలలో దర్శనం పూర్తి అవుతుంది*

నవగ్రహాల తల్లిదండ్రులు & భార్యలు పేర్లు*

నవగ్రహాల తల్లిదండ్రులు & భార్యలు పేర్లు రవి జపాకుసుమ సంకాశం! కాశ్యపేయం మహాద్యుతిమ్!! తమో‌రిం సర్వపాపఘ్నం! ప్రణతోస్మి దివాకరం !! రవి[సూర్యుని]   తల్లిదండ్రులు అతిది - కశ్యపులు. భార్యలు ఉష,- ఛాయ చంద్ర   దధి శంఖ తుషారాభం, క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం, శంభోర్మకుట భూషణం చంద్రుని - తల్లిదండ్రులు అనసూయ - అత్రి మహర్షి - భార్య రోహిణి కుజ ధరణీ గర్భ సంభూతం, విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం కుజుని- తల్లిదండ్రులు - భూమి, భరద్వాజుడు - భార్యశక్తి దేవి బుధ ప్రియంగు కళికాశ్యామం, రూపేణా ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం, తం బుధం ప్రణమామ్యహం బుధుని - తల్లిదండ్రులు - తార, చంద్రుడు - భార్య జ్ఞాన శక్తి దేవి గురు దేవానాంచ ఋషీనాంచ, గురుం కాంచన సన్నిభం బుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం గురుని - తల్లిదండ్రులు - తార, అంగీరసుడు - భార్య తారాదేవి శుక్ర హిమకుంద మృణాళాభం, దైత్యానాం పరమం గురుం సర్వ శాస్త్ర ప్రవక్తారం, భార్గవం, తం ప్రణమామ్యహం శుక్రుని - తల్లిదండ్రులు - ఉష,భ్రుగు - భార్య సుకీర్తి దేవి శని నీలాంజన సమాభాసం, రవి పుత

Mantramatruka Pushpamala / శ్రీ మంత్రమాతృకా పుష్పమాలా

             శ్రీ   మంత్ర మాతృకా   పుష్పమాలా   స్తవం                   Sri Mantramatrukaa Pushpamala Stavam శ్రీ   శంకర భగవత్పాదాచార్య విరచిత   శ్రీ   మంత్ర మాతృకా పుష్పమాలా త్మక నిత్యయ మానస పూజ!!! భగవంతుని మనము పంచ పూజ (5 ఉపచారాలు ) షోడశోపచార పూజ (16 ఉపచారాలు ) చతుష్షష్టి పూజ (64 ఉపచారాలు ) అని పలువిధములైన ఉపచారాలతో పూజిస్తత ఉంటాము . భగవంతునికి నిత్యమూ జరిగే ఉపచారాలు ధ్యానం , ఆవాహనము , ఆసనము , పాద్యము , అర్ఘ్యం , ఆచమనీయము , పంచామృత స్నానం , శుద్దోదకస్నానం , వస్త్రం , యజ్ఞోపవీతము , ఆభరణములు , గంధము , పుష్పములు , అంగపూజ , స్తోత్రం ( అష్టోత్తరం  /  సహస్రనామావళి ), ధూపము , దీపము , నైవేద్యము , తాంబూలం , నీరాజనం , ఛత్రం , చామరం , నృత్యం , గీతం , వాయిద్యములు , మంత్రపుష్పం , ప్రదక్షిణం,  మొదలగునవి. శ్రీ   మంత్ర మాతృకా   పుష్పమాల స్తవం ద్వారా   శ్రీ శంకర   భగవత్పాదులవారు   నిత్యము అమ్మవారిని మానసికంగా   ఎలా షోడశ ఉపచారాలతో పూజించవచ్చో మనకు తెలియ   జెప్పారు.  శ్రీ   మంత్ర మాతృకా   పుష్పమాలలో 17 శ్లోకాలు ఉనాాయి . అందులో 16 శ్లోకాలు   16 ఉపచారాలకునూ ,

॥ శ్రీకామాక్షీస్తోత్రమ్ ౨ ॥

॥ శ్రీకామాక్షీస్తోత్రమ్ ౨ ॥    కాఞ్చీనూపురరత్నకఙ్కణలసత్కేయూరహారోజ్జ్వలాం కాశ్మీరారుణకఞ్చుకాఞ్చితకుచాం కస్తూరికాచర్చితామ్ । కల్హారాఞ్చితకల్పకోజ్జ్వలముఖీం కారుణ్యకల్లోలినీం కామాక్షీం కలయామి కల్పలతికాం కాఞ్చీపురీదేవతామ్ ॥ ౧ ॥ కామారాతిమనఃప్రియాం కమలభూసేవ్యాం రమారాధితాం కన్దర్పాధికదర్పదానవిలసత్సౌన్దర్యదీపాఙ్కురామ్ । కీరాలాపవినోదినీం భగవతీం కామ్యప్రదానవ్రతాం కామాక్షీం కలయామి కల్పలతికాం కాఞ్చీపురీదేవతామ్ ॥ ౨ ॥ కాదమ్బప్రమదాం విలాసగమనాం కల్యాణకాఞ్చీరవాం కల్యాణాచలపాదపద్మయుగలాం కాన్త్యా స్ఫురన్తీం శుభామ్ । కల్యాణాచలకార్ముకప్రియతమాం కాదమ్బమాలాశ్రియం కామాక్షీం కలయామి కల్పలతికాం కాఞ్చీపురీదేవతామ్ ॥ ౩ ॥ గన్ధర్వామరసిద్ధచారణవధూధ్యేయాం పతాకాఞ్చితాం గౌరీం కుఙ్కుమపఙ్కపఙ్కితకుచద్వన్ద్వాభిరామాం శుభామ్ । గమ్భీరస్మితవిభ్రమాఙ్కితముఖీం గఙ్గాధరాలిఙ్గితాం కామాక్షీం కలయామి కల్పలతికాం కాఞ్చీపురీదేవతామ్ ॥ ౪ ॥ విష్ణుబ్రహ్మముఖామరేన్ద్రవిలసత్కోటీరపీఠస్థలాం లాక్షారఞ్జితపాదపద్మయుగలాం రాకేన్దుబిమ్బాననామ్ । వేదాన్తాగమవేద్యచిన్త్యచర

ప్రదక్షిణ ప్రాముఖ్యత

శ్రీ రమణ మహర్షి 'ప్రదక్షిణం' అన్న పదాన్ని విశ్లేషించారు. 'ప్ర' అనే అక్షరం సమస్త పాపాల వినాశనానికి సూచకం. 'ద' అంటే కోరికలన్నీ తీరడమని భావం. 'క్షి' అన్న వర్ణం రాబోయే జన్మల క్షయాన్ని సూచిస్తుంది. 'న' అంటే అజ్ఞానం నుండి విముక్తి ప్రాప్తి అని చెప్పారు. ఏవైనా గ్రహాచారాలు బాగలేకపోయినా, అరిష్టాలేర్పడినా ఆలయాల్లో నియమిత సంఖ్యలతో ప్రదక్షిణ చేస్తే వాటి పరిహారం జరుగుతుందని హిందూ ధర్మ శాస్త్రాలు సూచిస్తాయి. ఆలయంలో ఉన్న దైవం విశ్వశక్తి కేంద్రబిందువునకు ప్రతీక. ఆయన చుట్టూ ఉన్న ఆలయం అనంత విశ్వానికి సంకేతం. ప్రపంచంలో జరిగే పరిణామాలే ప్రదక్షిణలు. జీవితం అంటే ఒక చుట్టు (ఆవృతం). జననం నుంచి మరణం వరకు ఈ విశ్వంలో మన జీవితమే ఒక ప్రదక్షిణ. ఇలా ఎన్నో జన్మల్లో సంపాదించుకున్న కర్మల ఫలితాన్నే ఈ జన్మలో అనుభవిస్తాం. ప్రదక్షిణ పేరుతో పరమాత్ముని చుట్టూ తిరగడం వలన జన్మల చుట్లలో చేసిన కర్మల దుష్ఫలితాలను తొలగిమ్చుకోగలం. అంతే కాదు. అత్యధిక ప్రదక్షిణలు చేయడం వలన రానున్న జన్మల చుట్లను కూడా అధిగమించవచ్చు. కర్మక్షయమే ప్రదక్షిణలో పరమార్థం. మన మనోవాక్కాయ కర్మలు పరమేశ్వరుని చుట్టూ ప

శివునికి అభిషేకం ఎలా చేస్తే ఏ ఫలితం

🌺 ఓం నమశివాయ 🌺                1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. 2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. 3 .ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును 4 .పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు  లభించును. 5 .ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును 6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును. 7 .మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును  8 .మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును. 9 .తేనెతో అభిషేకించిన తేజోవృద్ది  కలుగును. 10.పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును. 11.కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును. 12 .రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును. 13 .భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును. 14 .గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర  ప్రాప్తి కలుగును. 15 .బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును. 16 .నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును 17 .అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న      లింగార్చనకు        ప్ర

శివరాత్రికి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి?

సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన #మహర్షులు. శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు. 1.ఉపవాసం శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. #శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. ఉపవాసం ఉండే ముందు ర