శ్రీ సూర్య భగవాన్
ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నసూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని8 నిమిషాలుగా అంచనా కట్టారు. హనుమంతుడు బాల్యంలో సూర్యుణ్ణి పండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట. హనుమ వెళ్లిన దూరాన్ని ‘యుగ సహస్ర యోజన పరాభాను’ అని తులసీదాస్ హనుమాన్ చాలీసాలో చెబుతారు.
దీన్ని లెక్క కడితే..
యుగం.. 12000 ఏళ్లు,
సహస్రం అంటే .. 1000,
యోజనం అంటే . 8 మైళ్లు,
మైలు అంటే ... 1.6 కిలోమీటర్లు
వెరసి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు.
సూర్యకాంతి
సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే, ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.
ఆ ఏడు గుర్రాల పేర్లు
1. గాయత్రి
2. త్రిష్ణుప్పు
3. అనుష్టుప్పు
4. జగతి
5. పంక్తి
6. బృహతి
7. ఉష్ణిక్కు
1. గాయత్రి
2. త్రిష్ణుప్పు
3. అనుష్టుప్పు
4. జగతి
5. పంక్తి
6. బృహతి
7. ఉష్ణిక్కు
వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.
పగలు రాత్రి
సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు, రాత్రికి ప్రతీక.
ఋతువులు
చక్రాలకున్న ఆరు ఆకులు ఋతువులకు ప్రతీక.
ధర్మం
ధ్వజం ధర్మానికి ప్రతీక.
Comments
Post a Comment