షట్చక్రాలు
షట్చక్రాలు శరీరంలోని షట్చక్రాలు….వాటి వివరాలు.. మూలధారం గుదస్థానం, స్వాధిష్ఠానం తు మేహనం నాభిస్తు మణి పూరా ఖ్యం హృదయాబ్జ మనాహతం తాలుమూలం విశుద్ధా ఖ్యం ఆజ్ఞా ఖ్యం నిటలాంబుజం సహస్రారం బ్రహ్మరంధ్ర ఇత్యగమ విదో విదుః వీటిని ఊర్థ్వలోక సప్తకమంటారు. సహస్రారం – సత్యలోకం – ప్రమాతస్థానం ఆజ్ఞాచక్ర – తపోలోకం – జీవాత్మస్థానం విశుద్ధ చక్రం- జనలోకం – ఆకాశభూతస్థానం అనాహతం – మహర్లోకం – వాయుభూతస్థానం మణిపూరకం – సువర్లోకం – అగ్నిభూతస్థానం స్వాధిష్ఠానం – భువర్లోకం – జలభూతస్థానం ఆధారము – భూలోకం – పృథ్వీభూతస్థానం మూలాధారచక్రం : మలరంధ్రానికి సుమారురెండంగుళాల పై భాగంలో ఉంటుంది. దీని రంగు ఎఱ్ఱగా (రక్తస్వర్ణం) ఉంటుంది. నాలుగురేకులుగల తామరపూవాకారంలో ఉంటుంది. దీనికి అధిపతి గణపతి; వాహనం – ఏనుగు. బీజాక్షరాలు వం – శం – షం అనేవి. స్వాధిష్ఠాన చక్రం : ఇది జననేంద్రియం వెనుక భాగాన, వెన్నెముకలో ఉంటుంది. అధినేత బ్రహ్మతత్త్వం. జల