Posts
SHIRIDI SAI BHAJAN|SUNDERA VADANA SAIEESHA|DEVOTIONAL|SRIVANI GORANTLA|
- Get link
- X
- Other Apps
KOEL SONG|GUNNAMAMIDI KOMMA UYALA|SONG OF NATURE|SRIVANI GORANTLA|T PADM...
- Get link
- X
- Other Apps
SAI BHAJAN|SAI NAM|SAI NAMAMMRUTAM|DIVYA NAMAM|DEVOTIONAL|SAI BHAJAN|SRI...
- Get link
- X
- Other Apps
SAI MAHIMA|MAMA HRUDAYAVASI SAI|SAI BHAJAN|SAI GEET|SRIVANI GORANTLA|DEV...
- Get link
- X
- Other Apps
Bhagyanagaram Temples
- Get link
- X
- Other Apps
అడపాదడపా తిరుపతి, కాశీ, అరుణాచలం వంటి తీర్థయాత్రలు చేసే మనం, మన ఊళ్ళోనే మన భాగ్యనగరంలోనే గొప్ప ప్రాచీన దేవాలయాలూ, ఎంతో ప్రాశస్థ్యాన్ని కలిగి పురాణ కథలతో కూడుకున్న ఆలాయాలున్నాయంటే ఒకింత ఆశ్చర్యం వేస్తుంది. హైదరాబాద్ లో మనకి తెలిసిన ఆలయాల వెనుక మనకి తెలియని కథలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని కథలు.. 1) కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయస్వామి వారి ఆలయం. 1143 వ సంవత్సరంలో రెండవ ప్రతాపరుద్రుడనే కాకతీయ రాజు ఓ పులి గాండ్రింపు విని వేటాడుతూ ఈ ప్రాంతంలో కి రాగా, ఓ చెట్ల పొదల్లోంచి 'రాం' 'రాం' అని వినపడిందట. సైనికుల సహాయంతో అక్కడ వెతకగా హనుమత్ రూపం చెక్కబడిన రాయి కనబడిందిట. ఆయన యధాశక్తి పూజాదికాలు కావించి తన కోటకు మరలి వెళ్ళాడు. ఓ రాత్రి ఆంజనేయస్వామి కలలో కనపడి తనకి ఆలయం కట్టించాల్సిందిగా ఆదేశిస్తే ఆయన ఇక్క పెద్ద ఆలయం కట్టించినట్టు చరిత్రకారులు చెప్తారు. 17వ శతాబ్ధంలో ఔరంగజేబు దుర్మార్గంగా ఎన్నో దేవాలయాలు ధ్వంసం చేయించాడు. ఈ ఆలయ ప్రాంతానికి వచ్చిన అతని సైనికులు గుడి కూలగొట్టడానికి పూనుకోగా చెవులు చిల్లులు పడేంత పెద్ద ధ్వని వినపడిందట. ఆ వింతవిని ఔరంగజేబే స్వయంగా ఇక్కడికి రాగా "నా గుడి
Pitru Dosha Pariharam పితృ దోషము నుండి బయటపడే సులువైన పరిష్కారం
- Get link
- X
- Other Apps
*పితృ దోషము నుండి బయటపడే సులువైన పరిష్కారం* పితృ దోషం' ... మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించటానికి మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో ... అలాగే... తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి. మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది. అలాగే అదే పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే అది తెలుసు కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా గాని వారు చేసిన పాప కర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు - మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ముఖ్యమైనది ఒక్కటే. అదే " పితృ దోషం " ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం. అందుకే ఈ పోస్టు పెడుతున్నాను. పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది. ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు. వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే. పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని చర్చించుకుందాము... చిన్న
Bride in cane Basket - బుట్టలో పెళ్లికూతురును ఎందుకు కూర్చోబెడతారు..? మేనమామనే ఎందుకు తీసుకొస్తారు..?*
- Get link
- X
- Other Apps
*బుట్టలో పెళ్లికూతురును ఎందుకు కూర్చోబెడతారు..? మేనమామనే ఎందుకు తీసుకొస్తారు..?* పెళ్లిలో కన్యను గంపలో తెచ్చే ఆచారము కొంత మందికి ఉంటుంది. ఇలా ఎందుకు తేవాలి దీని వెనుక ఉన్న కారణం ఏమిటి ? పెళ్లిలో కన్యను గంపలో మేనమామ ఎందుకు తేవాలి, తెస్తారు? ముందుగా అమ్మాయితో గౌరీ పూజ చేయించి ఆ తరువాత వెదురుతో చేసిన బుట్టలో కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమని మేనమామలు కలిసి ఆ అమ్మాయిని వివాహ వేదిక మీదకి తీసుకొని వస్తారు . బుట్టలో ఎందుకు కూర్చుంటోంది అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది. అవతలి వారి వద్ద భార్యా స్థానాన్ని పొందుతోంది. పత్నీ స్థానాన్ని పొందుతోంది. సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు. సహధర్మచారిణి. ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు. అనగా దైవ రుణం పిత్రు రుణం ఋషి ఋణం తీరవు. అసలు ఆయనకి అభ్యున్నతి లేదు. ఆయనకు ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యం కాదు. ఆయన అభ్యున్నతి అంతా ఎవరిమీద ఆధారపడింది అంటే ఆమె మీదే ఆధారపడింది. ఆయన ఒక యజ్ఞం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆయన కన్యాదానం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆమె లేనినాడు ఆయన ఏమీ చేసుకోలేడు. మరి లక్ష్మియే కదా జీవుడికి! పైగా ఇల్లాలు కాగా
How Karma impacts our Lives
- Get link
- X
- Other Apps
*మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ - ఎలా పెట్టుకు పోతాయో ఒకసారి పరిశీలి ద్దాం - రండి* 🙏జై శ్రీమన్నారాయణ👏 *ఈరోజు చాలామందిమి, పూజలు చేసాము, వ్రతాలు నోమాము, దానాలు చేసాము, ధర్మాలు ఆచరించాము, అని విర్ర వీగుతుంటాము, కానీ అవి ఎంతవరకు మనలను - భగ్వద్ సన్నిధికి చేర్చుతాయని ఆలోచించము కదూ. అలాంటి ఒక సంఘటన మహాభారతం లో చోటు చేసుకుంది. అదేమిటో ఒకసారి పరిశీలిద్దామా?* *కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు. కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్లి బోరున విల పిస్తాడు. చిన్న* *పిల్లాడిలా ఏడుస్తున్న అతన్ని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు.* *ధృతరాష్ట్రుడి దు:ఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు.* *అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడ వైన నువ్వు ఎందుకు మిన్నకుండి పోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకు వందమంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు’ అని నిలదీస్తాడు.* *అ
Bhagawadgeeta quiz
- Get link
- X
- Other Apps
*భగవద్గీత పైన అందరికి ఉండవల్సిన అవగాహన కోసం...హిందూ ధర్మం పాటించే ప్రతీ ఒక్కరికీ షేర్ చేయండి* *1.* భగవద్గీతను లిఖించినదెవరు? =విఘ్నేశ్వరుడు. *2.* భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము? = భీష్మ పర్వము. *3.* గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును? =మార్గశిర మాసము. *4.* గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును? =హేమంత ఋతువు. *5.* ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను? = వసంత ఋతువు. *6.* భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను? =శ్రీకృష్ణుడు అర్జునునికి. *7.* భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను? =కురుక్షేత్ర సంగ్రామము. *8.* భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యెను? =కౌరవ పాండవులకు. *9.* పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధిగా వుండెను? =అర్జునుడు. *10.* వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను? =సామవేదము. *11.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి? =పాంచజన్యము. *12.* భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు? =పద్దెనిమిది (18) *13.* “నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది” అని చెప్పిన స్వాతంత్ర్
మంత్రమాతృకాపుష్పమాలాస్తవః
- Get link
- X
- Other Apps
మంత్రమాతృకాపుష్పమాలాస్తవః ******************** కల్లోలోల్లసితామృతాబ్ధిలహరీమధ్యే విరాజన్మణి- ద్వీపే కల్పకవాటికాపరివృతే కాదంబవాట్యుజ్జ్వలే | రత్నస్తంభసహస్రనిర్మితసభామధ్యే విమానోత్తమే చింతారత్నవినిర్మితం జనని తే సింహాసనం భావయే || ౧ || ఏణాంకానలభానుమండలలసచ్ఛ్రీచక్రమధ్యే స్థితాం బాలార్కద్యుతిభాసురాం కరతలైః పాశాంకుశౌ బిభ్రతీమ్ | చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతంసమకుటాం చారుస్మితాం భావయే || ౨ || ఈశానాదిపదం శివైకఫలదం రత్నాసనం తే శుభం పాద్యం కుంకుమచందనాదిభరితైరర్ఘ్యం సరత్నాక్షతైః | శుద్ధైరాచమనీయకం తవ జలైర్భక్త్యా మయా కల్పితం కారుణ్యామృతవారిధే తదఖిలం సంతుష్టయే కల్పతామ్ || ౩ || లక్ష్యే యోగిజనస్య రక్షితజగజ్జాలే విశాలేక్షణే ప్రాలేయాంబుపటీరకుంకుమలసత్కర్పూరమిశ్రోదకైః | గోక్షీరైరపి నారికేలసలిలైః శుద్ధోదకైర్మంత్రితైః స్నానం దేవి ధియా మయైతదఖిలం సంతుష్టయే కల్పతామ్ || ౪ || హ్రీంకారాంకితమంత్రలక్షితతనో హేమాచలాత్సంచితై రత్నైరుజ్జ్వలముత్తరీయసహితం కౌసుంభవర్ణాంశుకమ్ | ముక్తాసంతతియజ్ఞసూత్రమమలం సౌవర్ణతంతూద్భవం
రామాయణం108_ప్రశ్నలు_జవాబులతో/ Ramayana questions
- Get link
- X
- Other Apps
రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి.. 1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు? = వాల్మీకి. 2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు? = నారదుడు. 3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు? = తమసా నది. 4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి? =24,000. 5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు? =కుశలవులు. 6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? =సరయూ నది. 7. అయోధ్య ఏ దేశానికి రాజధాని? =కోసల రాజ్యం. 8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు? =సుమంత్రుడు. 9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి? =కౌసల్య, సుమిత్ర, కైకేయి. 10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు? =పుత్రకామేష్ఠి. 11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను? = కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు. 12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవ్వరు? =జాంబవంతుడు. 13. వాలి ఎవరి అంశతో జన్మించెను? =
Midnight Birthday celebration ?
- Get link
- X
- Other Apps
మీరు మీ పుట్టినరోజుని అర్ధరాత్రి 12 గంట లకు జరుపుకుంటున్నారా ??? అయితే తస్మాత్ జాగ్రత్త! ఈ మధ్యకాలం లో సమాజం లో ఓ "వింత పోకడ /సాధనను" మనం గమనిస్తున్నాము. అదే మిటంటే అర్ధరాత్రి 12 గంటలకు పుట్టినరోజు వేడుకలు, కానీ ఇది ఎంత తప్పో మీకు తెలుసా ? హైందవ గ్రంధాల ప్రకారము ఇది తప్పు! అవును ఈ విధంగాఅర్ధరాత్రి వేడుక ఎంత తప్పో మీకు తెలియజేసే ప్రయత్నము చేస్తాను ఈ మధ్య కాలములో నేటి సమాజములో ఎవరిదైనా పుట్టినరోజు కానీ, పెళ్లిరోజు కానీ మరే ఇతర వేడుకైన గాని రాత్రి 12 గంటలకు జరుపుకోవడం ఫాషన్ గా మారిపోయింది. జనాలు కూడా ఈ విధంగా రాత్రి వేడుకలో కేకులు కోస్తూ సంబరాలు జరుపు కోవడంలో ఆనందాన్ని వెతుకుతున్నారు. కానీ హైందవ గ్రంధాలూ రాత్రి 12 గంటల సమయమును "నిషిద్ధ " కాలంగా అభివర్ణించాయి. అవును మధ్య రాత్రి 12 గంటల నుంచి జాము 3 గంటల వరకు హైందవ శాస్త్ర ప్రకారము "నిషిద్ధ గడియలు". అనగా అర్ధ రాత్రి 12 గంటలు సమయములో జరిగే సంబరాలు మనము నిషిద్ధ కాలములో జరుపుకొంటున్నాము. కానీ హైందవ గ్రంథల ప్రకారము ఈ నిషిద్ధ సమయములో మానవ నేత్రాలకు కనబడిని ఎన్నో దుష్ట శక్తులు, దెయ్యాలు, రక్త పిశాచాలు సంచరిస్
రామదాసు కీర్తన Ramadas keerthan Mangalam
- Get link
- X
- Other Apps
*రామదాసు కీర్తన* పల్లవి రామచంద్రాయ జనక రాజ జామనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం చరణములు కోసలేశాయ మంద హాస దాస పోషణాయ వాసవాది వినుత సద్వరద/(రాయ) మంగళం చారు కుంకుమోపేత/ (మేఘరూపాయ) చందనాదిచర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం లలిత రత్నమండ లాయ/(కుండలాయ) తులసివన మాలికాయ జలద సదృశ దేహాయ చారు మంగళం దేవకీ పుత్రాయ దేవ దేవోత్తమాయ చాప జాత గురు వరాయ భవ్య మంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్ర వదనాయ అండజ వాహనాయ అతుల మంగళం విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ సుముఖచిత్తకామితాయ శుభద మంగళం రామదాసాయ మృదుల హృదయ కమల వాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం రామచంద్రాయ జనక రాజ జామనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం సర్వమంగళ... మహిత మంగళం...
స్మశాన నారాయణస్వామి ఆలయం, ఆలంపుర్/ Smashana Narayana Swami, Alampur
- Get link
- X
- Other Apps
స్మశాన నారాయణస్వామి ఆలయం, ఆలంపుర్ పితృ దోషము నుండి బయటపడే సులువైన పరిష్కారం.. #పితృదోషం మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించటానికి మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో ... అలాగే... తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి. మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది. అలాగే అదే పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే అది తెలుసు కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా గాని వారు చేసిన పాప కర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు.. మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ముఖ్యమైనది ఒక్కటే. అదే #పితృదోషం ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం. అందుకే ఈ పోస్టు పెడుతున్నాను. పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది. ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు. వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే. పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని చర్చించుకుందామ