రామదాసు కీర్తన Ramadas keerthan Mangalam
*రామదాసు కీర్తన*
పల్లవి
రామచంద్రాయ జనక రాజ జామనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం
చరణములు
కోసలేశాయ మంద హాస దాస పోషణాయ
వాసవాది వినుత సద్వరద/(రాయ) మంగళం
చారు కుంకుమోపేత/ (మేఘరూపాయ) చందనాదిచర్చితాయ
హారకటక శోభితాయ భూరి మంగళం
లలిత రత్నమండ లాయ/(కుండలాయ) తులసివన మాలికాయ
జలద సదృశ దేహాయ చారు మంగళం
దేవకీ పుత్రాయ దేవ దేవోత్తమాయ
చాప జాత గురు వరాయ భవ్య మంగళం
పుండరీకాక్షాయ పూర్ణచంద్ర వదనాయ
అండజ వాహనాయ అతుల మంగళం
విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ
సుముఖచిత్తకామితాయ శుభద మంగళం
రామదాసాయ మృదుల హృదయ కమల వాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం
రామచంద్రాయ జనక రాజ జామనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం
సర్వమంగళ...
మహిత మంగళం...
Comments
Post a Comment