Midnight Birthday celebration ?
మీరు మీ పుట్టినరోజుని అర్ధరాత్రి 12 గంట లకు జరుపుకుంటున్నారా ???
అయితే తస్మాత్ జాగ్రత్త!
ఈ మధ్యకాలం లో సమాజం లో ఓ "వింత పోకడ /సాధనను" మనం గమనిస్తున్నాము. అదే మిటంటే అర్ధరాత్రి 12 గంటలకు పుట్టినరోజు వేడుకలు, కానీ ఇది ఎంత తప్పో మీకు తెలుసా ?
హైందవ గ్రంధాల ప్రకారము ఇది తప్పు!
అవును ఈ విధంగాఅర్ధరాత్రి వేడుక ఎంత తప్పో మీకు తెలియజేసే ప్రయత్నము చేస్తాను
ఈ మధ్య కాలములో నేటి సమాజములో ఎవరిదైనా పుట్టినరోజు కానీ, పెళ్లిరోజు కానీ మరే ఇతర వేడుకైన గాని రాత్రి 12 గంటలకు జరుపుకోవడం ఫాషన్ గా మారిపోయింది. జనాలు కూడా ఈ విధంగా రాత్రి వేడుకలో కేకులు కోస్తూ సంబరాలు జరుపు కోవడంలో ఆనందాన్ని వెతుకుతున్నారు.
కానీ హైందవ గ్రంధాలూ రాత్రి 12 గంటల సమయమును "నిషిద్ధ " కాలంగా అభివర్ణించాయి.
అవును మధ్య రాత్రి 12 గంటల నుంచి జాము 3 గంటల వరకు హైందవ శాస్త్ర ప్రకారము "నిషిద్ధ గడియలు".
అనగా అర్ధ రాత్రి 12 గంటలు సమయములో జరిగే సంబరాలు మనము నిషిద్ధ కాలములో జరుపుకొంటున్నాము. కానీ హైందవ గ్రంథల ప్రకారము ఈ నిషిద్ధ సమయములో మానవ నేత్రాలకు కనబడిని ఎన్నో దుష్ట శక్తులు, దెయ్యాలు, రక్త పిశాచాలు సంచరిస్తుంటాయి . ఈ నిషిద్ధ సమయములో వాటి శక్తులు కూడా పెరుగుతాయి.
మనము జీవించే ఈ భూమండలంలో అలంటి శక్తులు చాలానే ఉన్నాయి. అవి మన కంటికి కనబడవు, కానీ వాటి వలన మానవ జీవితాలకు ఎన్నో భయానక మరియు చెడు ఫలితములు గోచరిస్తాయి. వీటి చెడు ప్రభావములచే మానవ జీవితం అపసవ్య మార్గములో పయనించును.
ఈ నిషిద్ధ కాలములో జరుపు కొనే వేడుకల వలన ఈ దుష్టశక్తులు మన ఆయువుని హరిస్తాయి. అంతేగాక వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారి, దురదృష్టం ఇంటి తలుపు తడుతుంది. కేవలం ఒక సంవత్సరంలో 4 పండుగలు అవి దీపావళి, నవరాత్రులు, జన్మాష్టమి మరియు శివరాత్రి రోజులలో మాత్రమే ఈ నిషిద్ధ కాలము పుణ్య ఫలితాలను ఇస్తుంది, అది ఎందు చేతనంటే ఈ సమయాలలో నిషిద్ధ కాలము, మహా నిషిద్ధ కాలంగా గోచరించబడుతుంది .
పైన తెలిపిన నాలుగు పండుగలు మినహా అన్ని రోజులు నిషిద్ధ కాలములే .
హైందవ గ్రంధాల ప్రకారము సూర్యోదయము తోనే రోజు మొదలవుతుంది. అంతే గాక ఎందరో ఋషులు మరియు మునులు / సన్యాసులు ప్రకారం సూర్యోదయం పుణ్యకాలం.
ఈ సమయములో వాతావరణం చాల శుద్ధిగా, ప్రతికూలతలు లేనిదియై ఉండును . హైందవ సంప్రదాయం ప్రకారం సూర్యోదయం తర్వాత మాత్రమే పుట్టినరోజు వేడుక జరుపుకోవాలి. ఎందుకంటే మధ్య రాత్రి లో "రజో" మరియు "తమో" గుణాలు వాతావర్ణములో మెండుగా ఉండి, ఆ సమయంలో తెలియజేయు అభినందనలు శుభ ఫలములు ఇవ్వకపోగా వ్యతిరేక ఫలితములు ఇచ్చును. ఏదిఏమైనా హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం కేకులు కోయడం మన సంప్రదాయం కాదు.
మన హిందూ ధర్మం ఏంటో శాస్త్రీయతతో కూడుకున్నది.
కావున హిందూ ధర్మాలలో పొందుపరిచిన మార్గాలనే మనము ఎంచుకొందాం/ఆచరణలో పెడదాం.
ఈ వ్యాసాన్ని/ సారాన్ని ప్రతి హైందవునితో పంచుకోగలరు.
Comments
Post a Comment