Bride in cane Basket - బుట్టలో పెళ్లికూతురును ఎందుకు కూర్చోబెడతారు..? మేనమామనే ఎందుకు తీసుకొస్తారు..?*
*బుట్టలో పెళ్లికూతురును ఎందుకు కూర్చోబెడతారు..? మేనమామనే ఎందుకు తీసుకొస్తారు..?* పెళ్లిలో కన్యను గంపలో తెచ్చే ఆచారము కొంత మందికి ఉంటుంది. ఇలా ఎందుకు తేవాలి దీని వెనుక ఉన్న కారణం ఏమిటి ? పెళ్లిలో కన్యను గంపలో మేనమామ ఎందుకు తేవాలి, తెస్తారు? ముందుగా అమ్మాయితో గౌరీ పూజ చేయించి ఆ తరువాత వెదురుతో చేసిన బుట్టలో కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమని మేనమామలు కలిసి ఆ అమ్మాయిని వివాహ వేదిక మీదకి తీసుకొని వస్తారు . బుట్టలో ఎందుకు కూర్చుంటోంది అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది. అవతలి వారి వద్ద భార్యా స్థానాన్ని పొందుతోంది. పత్నీ స్థానాన్ని పొందుతోంది. సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు. సహధర్మచారిణి. ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు. అనగా దైవ రుణం పిత్రు రుణం ఋషి ఋణం తీరవు. అసలు ఆయనకి అభ్యున్నతి లేదు. ఆయనకు ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యం కాదు. ఆయన అభ్యున్నతి అంతా ఎవరిమీద ఆధారపడింది అంటే ఆమె మీదే ఆధారపడింది. ఆయన ఒక యజ్ఞం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆయన కన్యాదానం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆమె లేనినాడు ఆయన ఏమీ చేసుకోలేడు. మరి లక్ష్మియే కదా జీవుడికి! పైగా ఇల్లాలు కాగా