Posts

చూడామణి నామక సూర్యగ్రహణం* తేదీ : 21-06-2020 ఉదయం 11:58

*చూడామణి నామక సూర్యగ్రహణం*   తేదీ : 21-06-2020  ఉదయం 11:58  శ్రీశార్వరినామ సంవత్సరం జ్యేష్ఠ అమావాస్య ఆదివారం .మృగశిర -4 , ఆరుద్ర -1 పాదాలు మిథున రాశి లో రాహుగ్రస్త అంగుళ్యాకారంలో సూర్య గ్రహణం సంభవిస్తోంది . ఈ గ్రహణం భారతదేశముతో పాటు ఆసియా , ఉత్తర ఆస్ట్రేలియా , పాకిస్తాన్ , శ్రీలంక , ఆఫ్రికా మొదలగు ప్రాంతములయందు కూడా కనిపించును . చాలా ప్రాంతములలో పాక్షికముగా కనిపించును , డెహ్రాడూన్ ( ఉత్తరాఖండ్ ) లో సంపూర్ణంగా కనిపించును . *మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రముల వారు , మిథునరాశి వారు ఈ గ్రహణం అసలు చూడరాదు.* *తెలంగాణ రాష్ట్రానికి* గ్రహణ ఆరంభకాలం : ఉ . 10.14 గ్రహణ మధ్యకాలం : ఉ . 11.55  గ్రహణ అంత్యకాలం : మ . 1.44  గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 30 నిమిషాలు *ఆంధ్ర రాష్ట్రానికి* గ్రహణ ఆరంభకాలం : ఉ . 10.23  గ్రహణ మధ్యకాలం : మ .12.05 గ్రహణ అంత్యకాలం : మ . 1.51 గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 28 నిమిషాలు *గ్రహణ నియమాలు*   గ్రహణం రోజు అనగా 21-06-2020 ఆదివారం నాడు  ఉదయం 6 గంటల వరకు సామాన్య మానవులు అందరూ అన్నపానాదులు ముగించాలి. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం  ఉదయం 8 గంటల వర

అన్నము గురించి సంపూర్ణ వివరణ -

అన్నము గురించి సంపూర్ణ వివరణ -  * అన్నం అగ్నిదీపనం చేయును .  * మలమూత్ర విసర్జనకారిగా ఉండును.  * చక్కగా వండి గంజివార్చిన అన్నం శరీరం నందు వేడిని కలిగించును. శరీరముకు హితము చేయును . మంచి పథ్యముగా ఉండును.  * బియ్యము కడగక గంజివార్చబడని అత్తెసరు అన్నం పైత్యమును చేయును . శుక్రమును వృద్ధిచేయును . కఫానికి కారణంగా ఉండును.   * బియ్యమును వేసి పాకము చెయ్యబడిన అన్నం రుచికరంగా ఉండి కఫాన్ని హరించును . తేలికగా ఉండును.   * పప్పు , మాంసాదులు వేసి వండిన అన్నము గురుత్వము చేయును . శుక్రమును వృద్ధిపరచును. కఫమును పుట్టించును .  * బెల్లము మొదలగు మధురరసములతో కలిసి మధురాన్నం గురుత్వం చేయును . శుక్రాన్ని వృద్దిపరచును. వాతజ్వరమును హరించును .   * మెంతి,మజ్జిగతో చేర్చిబడిన అన్నం గ్రహణి, మూలరోగం , అలసట పొగొట్టును.మరియు జీర్ణకారి.   * అతివేడి అన్నం బలమును పొగొట్టును. సమశీతోష్ణ స్థితిలో ఉన్న అన్నం తినుట మంచిది .  * రెండుమూడు రోజులు నుంచి ఉన్న అన్నం పాచి అన్నం రోగాలను పుట్టించును .  * వరి అన్నం రుచి పుట్టించును . సర్వరోగ హరమైనది . నేత్రాలకు హితము చేయును . జఠరాగ్నిని పెంచును. హృదయమునకు మేలుచేయును. శుక్రవృద్ధి , శరీర ధార

శ్రీ భువనేశ్వరీ మహా విద్య

శ్రీ భువనేశ్వరీ మహా విద్య దశ మహా విద్యలలో 4వ మహా విద్య శ్రీ భువనేశ్వరీ దేవి. భువనేశ్వరి అంటే ఈ చతుర్ధశ భువనాలకీ అధీశ్వరి. పద్నాలుగు భువనాల్లోని చరాచర జీవరాసులన్నీ ఈ దేవి ఆధీనంలోనే ఉంటాయి. ఈ మహా విద్య పరమశాంతి రూపిణీ. మూల ప్రకృతి రెండో నామాన్ని భువనేశీ అంటారు. భువనేశీ అనగా భువనేశ్వరీ. ఈ సృష్టిలోని అన్ని రూపాలూ మూల ప్రకృతి శ్రీ భువనేశీదేవివే. నిత్య జీవితములో పరిపూర్ణమైన శాంతిని కోరుకునే వారు శ్రీ భువనేశ్వరీ దేవిని ఉపాసించాలి. శ్రీ భువనేశ్వరీ దేవికి రాత్రి సిద్ధరాత్రి కాగా, త్రయంబకుడు శివుడుగా, పరమేశ్వరుడు భైరవుడుగా, త్రైలోక్యమోహిని యక్షిణిగా ఉంటారు.  ఆకాశానికి ఆధిదేవత భువనేశ్వరి అని తంత్ర గ్రంథృ఼లు వర్ణిస్తాయి. భువనేశ్వరీ దేవి నాదశరీరం హ్రీంకారం. అందుకే హ్రీం కారాన్ని శక్తి బీజంగా, భువనేశ్వరీ బీజంగా పరిగణిస్తారు. దీనినే తాంత్రిక ప్రణవం (ఓం) అని, హృల్లేఖ అని కూడా అంటారు. ఈ దేవిని మహా మాయగా, ఈమె బీజం హ్రీం కారాన్ని మాయాబీజంగా సంభావిస్తారు. భువనం అంటే లోకం. ఈ లోకానికి సృష్టికర్త భువనేశ్వరి. ఈ సృష్టి మొత్తం భువనేశ్వరీ అవతారమే. ఈమెనే అదితి అని కూడా అంటారు. అ+దితి అంటే ఖండం కానిదని అర్థం. ఈ అద

కలి దోష నివారణ శ్రీలలితా సహస్ర నామ స్తోత్ర పారాయణం

🙏కలి దోష నివారణ.🙏 లలితా సహస్ర నామ స్తోత్ర పారాయణం. శ్రీవిద్యాం  జగతాం  ధాత్రీం  సర్గ స్థితి లయేశ్వరీమ్, నమామి  లలితాం  నిత్యాం మహా త్రిపుర సుందరీమ్. శ్రీవిద్య అనబడే బాలా, నవాక్షరి, పంచదశి, షోడశీ మంత్ర రూపిణిగా వుండేది, ఈరేడు లోకాల నన్నింటిని ధరించి వుండేది, సృష్టి స్థితి లయాలనే త్రికార్యములను నిర్వర్తించేది, నిత్యా అనే కళా స్వరూపిణిగా విలసిల్లుతున్నది..త్రిపుర సుందరి రూపిణీ అయిన లలితాదేవి. బ్రహ్మాండ పురాణమున శ్రీవిష్ణు స్వరూపులైన హయగ్రీవులు లలితా దేవి యొక్క చరిత్రను అద్భుతముగా చెప్పి వున్నారు. శ్రీదేవి పుట్టుక, శ్రీపుర వర్ణన, శ్రీవిద్యా మంత్రముల విశిష్టత, అంతర్యాగ, బహిర్యాగ క్రమము, జప లక్షణము, హోమ ద్రవ్యములు, శ్రీచక్రము, శ్రీ విద్య, గురు శిష్యుల సంబంధము పలు స్తోత్రములు చెప్పివున్నారు. లలితా దేవి యొక్క సహస్రనామములు వినడానికి నాకు యోగ్యత లేదా మరి ఎందువలన నాకు సెలవియ్యలేదు, అని ఎన్నో సంవత్సరముల నుంచి ప్రాధేయపడుచున్న  తపోధనుడైన అగస్త్యుడిని చూచి హయగ్రీవులు ఇలా అన్నారు.. లోపాముద్రకు పతివైన ఓ అగస్త్యా... లలితా సహస్రనామములు అతి రహస్యాలు. (అంటే ఆషామాషిగా చెప్పబడేవి కావు), అతి శక్తిమంతమైనవి,

పితృ దోషం నుండి విముక్తి పొందడానికి స్మశాన నారాయణుడి ఆలయమును దర్శించండి

*మేము తెలిసి కానీ, తెలియక గానీ ఏ తప్పు చేయలేదు. అయిని బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే ఆవేదన పడేవారు... ముఖ్యంగా తెలుసుకోవలసినది...* *మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించటానికి మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో అలాగే..* *...తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి.* *మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది.* *పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే...వారు చేసిన పాప కర్మల ఫలితములను వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు....* అదే.... *" పితృ దోషం "* *పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది. ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు.* *వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే.* *పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు* *చిన్న వారు అకాలమరణం పొందడం* *శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రి పాలవడం.* *అప్పులపాలు అవ్వడం లేనిపోని అపనిందల పాలు అవ్వడం మన ప్రమేయం లేకుండా ప్రమాదాలకు గురయ్యే జీవితాంతం కర్మలన

Gnana Saraswati Ashtakam / జ్ఞాన సరస్వతి అష్టకం

Image
Dear Friends, I tried my best to give you a wonderful composition on Goddess Saraswathi sung by Shobika Murukesan (Play back Singer) and amazing music given by Shivan (Music Director, Tamil Film Industry). Both of them added life to the song. I tried to produce an action video with some interesting effects to ensure you get the feel of the song. Please do watch this video and share your valuable feedback in the COMMENTS section. So that I can improve on the quality for my upcoming videos.  If you like the song, music and the video, please SUBSCRIBE to my channel and SHARE it with your near and dear. Thank you very much for your valuable time. జ్ఞాన సరస్వతి అష్టకం చరణం 1 పిలుపు  పిలుపున  తేనే  లొలుకగా  రమ్ము  రమ్మని  పిలిచెదన్   పిలిచి  నా  హృదయాబ్జమను  పీఠంబునన్  నిను  నిలిపెదన్  నిలిపి  శుద్దోదకమునన్   నీ  పదము  లుంచి  కడిగెదన్  ( 2 ) కడిగి  అర్గ్యము  నిత్తు  కైగొను మమ్మ  జ్ఞాన   సరస్వతి  (నే ) ( 2 )  || పిలుపు || చరణం 2 కేశవా నారాయణ  మాధవ  గోవిందాయని   ఆచమన  మర్పింతు  కైగొను  ముమ్మా

By medicines by Generics(ingredients) not by Brand

V.V.IMP message from Supreme Court.  This is definitely going to save ur money..    Dear All, This is to inform you that medicines are prescribed (by doctors) by brand name & not by the generics (Ingredients). Hence we end up paying more money for the same medicine. Follow these few steps to know more & start saving on your medical bills. 1. Simply go to www.Manddo.com (Medicines and Doctors online) go to medicines secton 2. Search the medicine name 3. Type the medicine name which you are using (e. g. Lyrica 75mg (Pfizer company) 4. It will show u medicine company, prices and Ingredients 5. Now main point CLICK ON 'SUBSTITUTE' 6. Don't be surprised to see that same drug is available at very low cost also. And that to,.. by other reputed manufacturer. e. g. Lyrica by pfizer is for Rs. 768.56 for 14 tab (54.89 per tab). Whereas same drug by Cipla (Prebaxe) is available ONLY @ Rs. 59.00 for 10 tab (5.9 per tab)  Please don't delete   without forwarding. Forward to

హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం

హనుమంతునికి - ప్రదక్షిణాలు*👍💐 హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. 'ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా' అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ, భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు, అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు, పసుపుకొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం 'శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్' శ్లో|| ఆంజనేయం మహావీరం-బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం శ్లో|| మర్కటే శ మహొ త్సాహ- సర్వశోక వినాశన శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో|| అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధ మండలం కాని

ఆహారవైద్యం

ఇవి మీకు తెలుసా ? • అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి . • కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది . • నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది . • గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది . • అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి . ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది . • జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి . • బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది . • సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది . • మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది . • బీట్ రూట్ .. బీపీని క్రమబద్దీకరిస్తుంది . • మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది . • దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది . • ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది . • అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది . మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది . • కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి . • మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు . • ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్ .. ఆస్టియో పొరా

విశ్వనాథ,అన్నపూర్ణ మందిర ప్రదక్షిణం

పూర్వం హిమాలయ పర్వతాల్లో ఒక చక్రవాకపక్షి ఉండేది. అది ప్రతిరోజూ ఉదయాన్నే ఆహారం కోసం తన నివాసాన్ని వదిలి ఆకాశమార్గాన అలా అలా పయనిస్తూ ఎన్నెన్నో దేశాలను దాటుకుంటూ కాశీ నగరానికి వచ్చి చేరేది. అంత దూరం ప్రయాణించి మిట్టమధ్యాహ్న సమయానికి ఆ చక్రవాక పక్షి కాశీలోని అన్నపూర్ణాదేవి మందిరానికి చేరేసరికి దానికి ఆకలి వేస్తుండేది. ఆ ఆకలి తీర్చుకోవటం కోసం అన్నపూర్ణాదేవి మందిరం చుట్టూ పడిఉన్న మెతుకులను ఏరుకొని తింటూ పొట్ట నింపుకొనేది. ఇలా మెతుకులను ఏరి తినేందుకు దానికి తెలియకుండానే అది గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేది. అలా చాలాకాలం గడిచింది. కాలాంతరంలో ఆ చక్రవాక పక్షి ఆయువు తీరి మరణించింది. ఇతర పక్షులలాగా మరణానంతరం కూడా నరకయాతనలేవీ పడకుండా నేరుగా స్వర్గానికి చేరుకుంది. రెండు కల్పాలపాటు స్వర్గంలో ఆ పక్షి భోగాలను అనుభవించింది. ఆ తర్వాత భూలోకంలో ఓ రాజుగారి ఇంట మగశిశువుగా ఆ చక్రవాక పక్షి జన్మించింది. పెద్దలు ఆ శిశువుకు బృహద్రథుడు అని పేరు పెట్టారు. పెరిగి పెద్దయిన రాకుమారుడికి పెద్ద రాజు రాజ్యాభిషేకం కూడా చేశాడు. బృహద్రథుడికి త్రికాలజ్ఞత ఉండేది. భూత, భవిష్యత్తు వర్తమానాలు ఆయన కళ్లెదుట ఎప్పుడూ కనిపిస్తుండేవి. బృ

శ్రీ రామానుజాచార్యుల పవిత్ర శరీరం

Image
1000 సంవత్సరాలుగా భద్రపరచబడిన  శ్రీ రామానుజాచార్యుల పవిత్ర శరీరం... వేదానికి సరైన అర్ధం చెప్పి, విశిష్టద్వైత గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు శ్రీ రామానుజాచార్యులు. ఆయన పరమపథం చెంది వెయ్యేళ్లు అయినా ఇప్పటికీ ఆ శరీరం భద్రపరిచి ఉండడం విశేషం. శ్రీ రామానుజచార్యులు     భారతదేశంలో హిందూ మతానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైనది. ప్రతి రాష్ట్రంలోనూ అబ్బురపరిచే ప్రఖ్యాత దేవాలయాలు మనకు కనిపిస్తాయి. వాటిలో తమిళనాడులోని తిరుచ్చునాపల్లికి ఆనుకుని ఉభయ కావేరీ నదుల మధ్య ఉన్న శ్రీరంగం పట్టణం కూడా ఒకటి. ప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటైన శ్రీరంగం ఆలయంలో విష్ణు మూర్తి స్వయంభువుగా అవతరించినట్లు చెబుతారు. ఏడు ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది శ్రీ రామానుజాచార్యుల వారి శరీరం. శ్రీరామానుజాచార్యులు పరమపదించి వెయ్యేళ్లకు పైగా గడిచినా ఆయన శరీరాన్ని నేటికీ ఇక్కడ భద్రపరిచి ఉంచడం విశేషం. అయితే చాలా మంది భక్తులకు దీని గురించి తెలియకపోవడం విచారకరం. కొందరు శ్రీరంగంలోని 4వ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినా.

సర్వాభరణ భూషితా

51 సర్వాభరణ భూషితా –  అన్ని రకాల ఆభరణాల  చేతఅలంకరించబడిన తల్లికి   నమస్కారము. Sarvabharana Bhooshita   She who wears all the trinkets.Salutations  to  the  mother  1. సర్వాభరణభూషితా శరీరాన్ని అలంకరించుకోవటం కోసం ధరించేవి ఆభరణాలు. దేవి సర్వాభరణ భూషిత. తల మీద పెట్టుకునే చూడామణి దగ్గరనుండి కాలిమట్టైల దాకా 44 రకాల ఆభరణాలున్నాయని కాలికాపురాణంలోను, పరశురాముడి కల్పసూత్రాలలోను, దత్తాత్రేయసంహితలోను వివరించబడింది. ఆ ఆభరణాలు వివరాలు. నవమణిమకుటము తిలకము వాళలీయుగళము మణిమండలయుగళము నాసాభరణము అధరయావకము మాంగల్యము  కనకచింతాకము పదకము మహాపదకము ముక్తావళి  ఏకావళి  ఛన్నవీరము కేయూరయుగళచతుష్టమము వలయావలి ఊర్మికావళి కాంచీదామము కటిసూత్రము సౌభాగ్యాభరణము (నల్లపూసలు) పాదకటకము రత్ననూపురము పాదాంగుళీయకము పాశము అంకుశము పుండ్రేక్షుచాపము పుష్పబాణము మాణిక్యపాదుకలు కంఠాభరణము (కంటె) సీమంతాభరణము (పాపిటబిళ్ళ) కాళ్ళకుపట్టాలు గొలుసులు పాంజేబులు కడియాలు అందెలు చూడామడి పసుపు రవిక పూలు చెవికమ్మలు తాంబూలము ఫలము ఆభరణము అనే పదానికి అంతటా భరించేది అనే అర్ధం కూడా ఉంది. దీనినిబట్టి చరాచరజగత్తునూ దేవి భరిస్తోందని గ్రహించాలి. మంత్రశాస్త్ర

అరుదైన సమాచారం.

ఈ మెసేజ్ మళ్ళా దొరకదు.. అరుదైన సమాచారం. ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం కూడా మరోసారి మననం చేసుకుందాం.  దిక్కులు  (1) తూర్పు,  (2) దక్షిణం,  (3) పడమర, (4) ఉత్తరం మూలలు  (1) ఆగ్నేయం,  (2) నైరుతి, (3) వాయువ్యం,  (4) ఈశాన్యం  వేదాలు (1) ఋగ్వే దం, (2) యజుర్వేదం, (3) సామవేదం, (4) అదర్వణ వేదం  పురుషార్ధాలు (1) ధర్మ, (2) అర్థ, (3) కామ, (4) మోక్షా  పంచభూతాలు  (1) గాలి,  (2) నీరు, (3) భూమి, (4) ఆకాశం, (5) అగ్ని.   పంచేంద్రియాలు  (1) కన్ను,  (2) ముక్కు,  (3) చెవి,  (4) నాలుక, (5) చర్మం.  లలిత కళలు  (1) కవిత్వం, (2) చిత్రలేఖనం, (3) నాట్యం, (4) సంగీతం, (5) శిల్పం.   పంచగంగలు  (1) గంగ, (2)  కృష్ణ, (3) గోదావరి, (4) కావేరి,  (5) తుంగభద్ర.   దేవతావృక్షాలు  (1) మందారం,  (2) పారిజాతం, (3) కల్పవృక్షం,  (4) సంతానం, (5) హరిచందనం.   పంచోపచారాలు  (1) స్నానం, (2) పూజ,  (3) నైవేద్యం, (4) ప్రదక్షిణం, (5) నమస్కారం.    పంచామృతాలు  (1) ఆవుపాలు, (2) పెరుగు, (3) నెయ్యి, (4) చక్కెర,  (5) తేనె.  పంచలోహాలు  (1) బంగారం,  (2) వెండి,  (3) రాగి, (4) సీసం, (5) తగరం.  పంచారామాలు  (1) అమరావతి,  (2) భీమవరం,  (3

మానస సరోవరం సమగ్ర వివరం/ Manas Sarovar

మానసరోవరం (లేక మానస సరోవరము, లేక మానస్) అనేది చైనా (China) కు చెందిన టిబెట్  (Tibet) ప్రాంతంలో గల మంచినీటి సరస్సు (Fresh water lake). ఇది లాసా (Lhasa) నగరానికి 940 కిలోమీటర్ల దూరంలో భారత దేశానికి, నేపాల్కు  చేరువలో ఉంది. చైనాలో ఈ సరస్సును మపం యుం (Mapam Yum), మపం యు ట్సొ (Mapam Yu Tso) అనే పేర్లతో పిలుస్తారు. *భౌగోళిక స్వరూపం* మానసరోవరానికి పశ్చిమాన రాక్షస్తల్ అనే ఉప్పు నీటి సరస్సు, ఉత్తరాన హిందువులు శివుని నివాస స్థలంగా భావించే కైలాస పర్వతం ఉన్నాయి. ఈ మంచినీటి సరస్సు సముద్రమట్టానికి 4,590 మీటర్ల ఎత్తులో ఉంది. 88 మీటర్ల చుట్టుకొలత, 300 అడుగులు లోతు, 320 చరదరపు కిలోమీటర్ల ఉపరితలము కలిగియున్న మానస సరోవరం గంగా చు (Ganga Chu) చానల్ ద్వారా రాక్షస్తల్ సరస్సుకి అనుసంధానమైయున్నది. ఈ ప్రాంతంలో ఎండాకాలం మే నెల నుండి ఆగస్టు నెల వరకూ ఉంటుంది. ఎండాకాలం (Summer) లో గరిష్ఠ ఉష్ణోగ్రత 15 డిగ్రీలు ఉంటుంది. ఋతుపవనాలు (Monsoons) సెప్టెంబరు నెల నుండి నవంబరు నెల వరకూ ఉంటాయి. చలికాలం (Winter) లో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల నుండి -15 డిగ్రీల మధ్య ఉంటుంది. అతి శీతలమైన ఈ సరస్సు ప్రాంతంలో ఎక్కడ చూచినా కొండలు, బండ రాళ్

నేను నేనని (నేను... నాది..) Nenu Nenani ( I

Image