సర్వాభరణ భూషితా
51 సర్వాభరణ భూషితా –
అన్ని రకాల ఆభరణాల చేతఅలంకరించబడిన తల్లికి నమస్కారము.
Sarvabharana Bhooshita
She who wears all the trinkets.Salutations to the mother
1. సర్వాభరణభూషితా
శరీరాన్ని అలంకరించుకోవటం కోసం ధరించేవి ఆభరణాలు. దేవి సర్వాభరణ
భూషిత. తల మీద పెట్టుకునే చూడామణి దగ్గరనుండి కాలిమట్టైల దాకా 44 రకాల
ఆభరణాలున్నాయని కాలికాపురాణంలోను, పరశురాముడి కల్పసూత్రాలలోను,
దత్తాత్రేయసంహితలోను వివరించబడింది. ఆ ఆభరణాలు వివరాలు.
నవమణిమకుటము
తిలకము
వాళలీయుగళము
మణిమండలయుగళము
నాసాభరణము
అధరయావకము
మాంగల్యము
కనకచింతాకము
పదకము
మహాపదకము
ముక్తావళి
ఏకావళి
ఛన్నవీరము
కేయూరయుగళచతుష్టమము
వలయావలి
ఊర్మికావళి
కాంచీదామము
కటిసూత్రము
సౌభాగ్యాభరణము (నల్లపూసలు)
పాదకటకము
రత్ననూపురము
పాదాంగుళీయకము
పాశము
అంకుశము
పుండ్రేక్షుచాపము
పుష్పబాణము
మాణిక్యపాదుకలు
కంఠాభరణము (కంటె)
సీమంతాభరణము (పాపిటబిళ్ళ)
కాళ్ళకుపట్టాలు
గొలుసులు
పాంజేబులు
కడియాలు
అందెలు
చూడామడి
పసుపు
రవిక
పూలు
చెవికమ్మలు
తాంబూలము
ఫలము
ఆభరణము అనే పదానికి అంతటా భరించేది అనే అర్ధం కూడా ఉంది. దీనినిబట్టి
చరాచరజగత్తునూ దేవి భరిస్తోందని గ్రహించాలి.
మంత్రశాస్త్ర విశేషాలే పరమేశ్వరికి ఆభరణాలు. సప్తకోటి మంత్రాలు దేవికి
ఆభరణాలుగా చెప్పబడ్డాయి.
ప్రపంచంలో అనేకజాతుల వారున్నారు. వీరంతా అనేక ఆచారాలు పాటిస్తున్నారు.
వివిధరకాలయిన ఆభరణాలు ధరిస్తున్నారు. బంగారము, వెండి, రాగి, దంతము మొదలగు
వాటితో చేసిన ఆభరణాలను వీరు ధరిస్తారు. విశాలమైన విశ్వంలోని సమిష్టి జీవరూపమే
దేవి. కాబట్టి వీరందరూ ధరించే ఆభరణాలను దేవి ధరిస్తుంది. అందుచేతనే ఆమె
సర్వాభరణభూషిత అని చెప్పబడింది.
శ్రీచక్రంలో 44 కోణాలున్నాయి. అవి :
త్రికోణం - 3, అష్టకోణం - 8, అంతరశారం - 10, బహిర్దశారం - 10,
చతుర్దశారం - 14, బిందువు - 1 వెరసి 46 కోణాలు. కాని శ్రీచక్రాన్ని గీసి లెక్కపెట్టినట్లైతే
త్రికోణంలోని రెండుకోణాలు అష్టకోణంలో కలిసిపోతాయి. అందుచేత 46-2 = 44
కోణాలు మాత్రమే ఉంటాయి. కాబట్టే దేవి 44 రకాల ఆభరణాలు ధరిస్తుంది.
దుర్వాసుడు శ్రీదేవీ మహిమస్తుతిలోని 34వ శ్లోకంలో ఆమె యొక్క ఆభరణాలను
ముక్తారత్నవిచిత్రకాంతిలలితై స్తేబాహువల్లీ రహం
కేయూరాంగద బాహు దండ వలయై ర్హస్తాంగుళీ భూషణైః
సంసక్తాః కలయామి హీరమణిమన్ముక్తావళీ కీలిత
గ్రీవా పట్టవిభూషణేన సుభగం కంఠం చ కంబుశ్రియమ్ ॥
38వ శ్లోకంలో చేతివ్రేళ్ళకు, చేతులకు, ఉన్న ఆభరణాలను, మెడలోని
ముత్యపుదండలను వర్ణించాడు.
లేఖాలభ్య విచిత్ర రతృఖచితం హైమం కిరీటోత్తమం
ముక్తా కాంచన కింకిణీగణ మహాహీర ప్రబంధోజ్ఞలమ్ ।
చంచచ్చంద్రకలాకలాపలలితం దేవద్రుపుష్పార్చితం
మాలై ! రంబ విలంబితం సుశిఖరం బిభ్రచ్చిర స్తే భజే ॥
శంకరభగవత్సాదులవారు తమ సౌందర్య లహరిలోని 42వ శ్లోకం దగ్గర నుంచి
దేవి అంగాంగాలను, వివిధ ఆభరణాలను వరించారు.
దేవీభాగవతంలోని 12వ స్కంధంలో పరమేశ్వరి ఆభరణాలను వర్ణిస్తూ
నవరత్న గణాకీర్ణ కాంచీదామ విరాజితా !
తప్త కాంచన సన్నద్ధ వైడూర్యాంగద భూషణా !!
కనల్లీ చక్రతాటంక విటంక వదనాంబుజా !
లలాటకాంతివిభవ విజితార్థ సుధాకరా ॥!
బింబకాంతి తిరస్కోరి రదచ్చద విరాజితా !
లసత్కుంకుమకస్తూరీ తిలకోద్భాసితాననా ॥
దివ్యచూడామణి స్సారచంచచ్చంద్రకసూర్యకా ॥
ఉద్యత్కాంతిసమస్వచ్చనాసాభరణభాసురా ||
చింతాకాలంబిత స్వచ్ళ ముక్తా గుచ్ళ విరాజితా !
ప్రాటీరపంకకర్పూరకుంకుమాలంకృత స్తనీ ॥
విచిత్రవివిధాకల్పా కంబుసంకాశకంధరా !
దాడిమీ ఫలబీజాభ దంతపంక్తి విరాజితా ॥
అనర్హ్ర చరత్వఘటిత మకుటాంచితమస్తకా !
మత్తాలి మాలావిలస దలకాధ్య ముఖాంబుజా ॥
కలంక కార్యనిర్ముక్త శరశ్చంద్ర నిభాననా !
జాహ్నవీ సలిలావర్త శోభినాభీ విభూషితా ॥
ఆ పరమేశ్వరి నవరత్నములు పొదగబడిన మొలనూలితోను, వైడూర్యములు పొదిగిన
మేలిమి బంగారు కడియములతోను, శ్రీచక్రాకారముగల తాటంకములతోను, కస్తూరి
కాతిలకముతోను, సూర్యచంద్రులకాంతులను మించిన కాంతిగల దివ్యచూడామణితోను,
శుక్రనక్షత్రములా ప్రకాశించే నాసాభరణముతోను, మంచి ముత్యములు గుత్తులుగా
వ్రేలాడుచున్న చింతాకుపతకముతోను, వెలలేని రత్నాలు పొదిగిన బంగారుకిరీటముతోను
విరాజిల్లుతున్నది. అంటూ 18 నుంచి 88వ శ్లోకం దాకా దేవి ఆభరణాలను వర్ణించారు.
సప్తశతిలోని ద్వితీయాధ్యాయంలో మహిషాసుర సంహారం కోసం దేవతలందరి
తేజస్సుతోను ఆ పరమేవ్వరి ఆవిర్భవించింది అని చెబుతూ దేవతలందరూ తమ వద్దనున్న
ప్రశస్తమైన ఆభరణాలను ఆమెకు అందించారు అని చెప్పారు.
క్షీరోద శ్చామలం హార మజరే చ తథాంబరే
చూడామణిం తథా దివ్యం కుండలే కటకాని చ ॥
అర్ధచంద్రం తథా శుభ్రం కేయూరాన్ సర్వబాహుషు
నూపురౌ విమలౌ తద్వ డ్రైవేయక మనుత్తమమ్ ॥
అంగుళీయకరత్నాని సమస్తా స్వంగుళీషు చ
విశ్వకర్మా దదౌ తస్మై పరశుం చాతి నిర్మలమ్ ॥
అ స్రాణ్యనేకరూపాణి తథాల భేద్యం చ దంశనమ్ 1
ఆమ్లానపంకజాం మాలాం శిర స్యురసి చాపరామ్ ॥
అదద జ్ఞలధి స్తస్యై పంకజం చాతిశోభనమ్ ।
హిమవాన్ వాహనం సింహం రత్నాని వివిధాని చ ॥
దదా వశూన్యం సురయా పానపాత్రం ధనాధిపః
శేష శ్చ సర్వనాగేశో మహామణివిభూషితమ్ ॥
నాగహారం దదౌ తస్యె ధత్తే యః పృథివీ మిమామ్
అన్వై రపి సురై ర్దేవీ భూషణై రాయుధై స్తథా ॥
పాలసముద్రము ఒక నిర్మలమైన ముత్యాలహారము, ఎన్నటికీ మాసిపోని, చిరిగిపోని
రెండు చీరలు, దివ్యమైన శిరోరత్నము, కమ్మలు, కటకములు (గాజులు) అర్ధచంద్రా
భరణము, భుజకీర్తులు, మంజీరములు, ఉత్తమమైన కంఠాభరణము, అన్నివేళ్ళకు మంచి
శ్రేష్టమైన ఉంగరాలు ఇచ్చాడు. విశ్వకర్మ మంచిగండ్రగొడ్డలి, అస్త్రములు, అభేద్యమైన
కవచము ఇచ్చాడు. సముద్రుడు ఎప్పటికీ వాడిపోని రెండు తామరపూలమాలలు ఒకటి
మెడను ధరించటానికి, రెండవది తలను ధరించటానికి, చేతులతో పట్టుకోటానికి ప్రశస్తమైన
పద్మము ఇచ్చాడు. హిమవంతుడు సింహవాహనము అనేక రత్నలు ఇచ్చాడు. కుబేరుడు
పానపాత్రను, ఆదిశేషుడు రత్నలంకృతమైన నాగహారము ఇచ్చాడు. ఈ రకంగా
దేవతలంతా ఆమెకు సమస్త ఆభరణాలు సమర్పించారు.
ఈ రకంగా దేవి సమస్త ఆభరణాలను ధరించి ఉంటుంది. కాబట్టే ఆమె సర్వాభరణ
భూషితా అనబడుతోంది.
శ్రీమాత్రే నమః
వెంకటేశ్వర ప్రసాదు
🌺🌺🕉🕉🙏🙏🕉🕉🌺🌺V pp
Comments
Post a Comment