తిరువెంబావై/ Tiruvembavai
🙏🏻విష్ణువును మేల్కొల్పుతూ 🙏🏻తిరుప్పావై🙏🏻 - 🔱శివుని🔱 మేల్కొల్పుతూ ‘🙏🏻తిరువెంబావై🙏🏻 సూర్యుడు ధనూరాశిలోనుండి మకరరాశిలోనికి ప్రవేశం చేసిన వరకు గల ముప్ఫది రోజుల కాలాన్ని ధనుర్మాసంగా వ్యవహరిస్తారు. రెండు సంక్రమణాల మధ్య కాలం ఎంతో పవిత్రమైనది. మార్గశిర పుష్యమాసాలలో వ్యాపించి ఉంటుంది. శివకేశవులను ఉషఃకాలం కీర్తించే సమయం. హిందూ మతంలో ప్రధాన శాఖలు శైవము, వైష్ణవము. శైవములో శివుడు, వైష్ణవంలో విష్ణువు ప్రధాన దైవాలు. ఆయా ఆలయాల్లో ఉషఃకాలంలో శివుని మేల్కొల్పుతూ ‘తిరువెంబావై’, *విష్ణువును మేల్కొల్పుతూ ‘తిరుప్పావై’ గానం చేస్తారు. వీటిని పాశురాలుగా పేర్కొంటారు*. ముప్ఫది రోజులు రోజుకొక పాశురం గానం చేయబడ్డ తిరువెంబావై, తిరుప్పావై తమిళ వాఙ్మయంలో అత్యంత ప్రసిద్ధిని పొందాయి. భక్త్భివనమే ప్రధానంగా వున్న వీటిని పావై పాటలుగా వ్యవహరిస్తారు. *‘*తిరువెంబావై’ తిరువాచకమనే అత్యంత భక్తిప్రధానమైన తమిళ గ్రంథంలో అగ్రస్థానమలంకరించింది*.* అలానే తిరుప్పావై ద్రవిడ వేదంగా ప్రాముఖ్యత పొందిన నాలాయిరంలో హృదయ స్థానమలంకరించింది. ఉత్కృష్టమైన విష్ణ్భుక్తిని తిరుప్పావై ప్రసాదించింది. గోదాదేవి హృదయం ఆవిష్కరించినది. అదేవిధంగ