Sri Gnyana Saraswati Astakam / శ్రీ జ్ఞ్యానసరస్వతీ అష్టకం




జ్ఞ్యాన సరస్వతి అష్టకం
చరణం 1
పిలుపు పిలుపున తేనే లొలుకగా రమ్ము రమ్మని పిలిచెదన్
పిలిచి నా హృదయాబ్జమను పీఠంబునన్ నిను నిలిపెదన్ || పిలిపు ||
నిల్పి శుద్దోదకమునన్ నీ పదములుంచి కడిగెదన్ || 2 ||
కడిగి అర్ఘ్యము నిత్తు కైగొనుమమ్మ జ్ఞ్యానసరస్వతి (నే) || 2 ||

చరణం 2
కేశవా! నారాయణ! మాధవా! గోవిందా! యని
ఆచమన మార్పింతు గైకొను, ముమ్మార్లు ప్రీతితో || కేశవా  ||
శుద్ధ గందోదకము నిచ్చెద, స్నానమాడుము గుర్మీతో || 2||
అమ్మ! చదువుల కొమ్మ! మెలిడు మమ్మ! జ్ఞ్యానసరస్వతి (మా) || 2||

చరణం 3
శ్వేత వస్త్రములిత్తు నా తాపమును మాన్పుము కరుణతో
గంధమిచ్చెద గొనుము నా భావ బంధమూడ్పుము నిష్ఠతో || శ్వేత ||
హర కేయూరిదికముల సొమ్ములుంచి మురిసెడన్ || 2||
మనసు దోచిన యట్టి బంగారు బొమ్మ ! జ్ఞ్యాన సరస్వతి  (నా ) || 2||

చరణం 4
పేరు పేరున నీకు తగు వే...వేల నామము లెంచుచున్
తల్లి కల్పగవల్లి! తల్లుల తల్లి! నేలజాబిల్లివై !   || పేరు ||
మల్లె మొల్ల గులాబీ జాజుల, పూల నిచ్చెద నందుకో || 2||
మదిని ముద మొందించుటకు రావమ్మా జ్ఞ్యాన సరస్వతి (నా ) || 2||

చరణం 5
దూప దీపములొసగెదన్ పాపాంధకారము జీల్చుమా!
నయము మీరుగా దయతో గైకొను పెద్ద మనస్సుతో || దూప ||
శాఖ పాకములాది వంటకంబులన్ నీకొసగెదన్ || 2||
అరుదెంచి నీవు ఆరగింపుము దివ్య జ్ఞ్యానసరస్వతి (నీవరుదెంచి )  || 2||

చరణం 6
పచ్చ వర్ణములైన తమ్ముల పాకులన్ మరి పోకలున్
మంచి మౌక్తిక చూర్ణమున్ ఘనసారమున్ జాపత్రులన్ || పచ్చ||  
జాజి కాయలు ఏలకులు గల మేటి తాంబూలంబునన్   || 2||
చుట్టి ఇచ్చెదనమ్మ గైకొనుమమ్మ జ్ఞ్యానసరస్వతి (నే)  || 2||

చరణం 7
అక్షయంబగు దక్షిణల్ నీకర్పింతుము ఆర్తితో
మనసనే మంత్రపుష్పము సమర్పింతుము భక్స్తితో || అక్షయంబగు ||
వీక్షణంబును చూపి నన్ను వేగనుగ్రహింపుమా !    || 2||
లక్ష్మి మెచ్చిన కోడలు  మాయమ్మ! జ్ఞ్యానసరస్వతి (శ్రీ )   || 2||

చరణం 8
అంగనలు గుమిగూడి బంగరు పళ్ళెరంబున గప్రముల్
ఎలిమి వెలిగించి పాటలు పడుచున్ నిను వేడుచున్ || అంగనలు || 
దివ్య హారతి కాంతులలో నీ శోభలు వెదజల్లగా    || 2||
పసుపు కుంకుమ ప్రభలు గల్గిన యట్టి జ్ఞ్యానసరస్వతి (ఆ)   || 2||

అమ్మా! జ్ఞ్యానసరస్వతి ! …….మాయమ్మా! జ్ఞ్యానసరస్వతి !
రావమ్మా జ్ఞ్యానసరస్వతి ! మమ్మేలు జ్ఞ్యానసరస్వతి ! 
మమ్మేలు జ్ఞ్యానసరస్వతి !మమ్మేలు జ్ఞ్యానసరస్వతి !

Comments

Popular posts from this blog

Ananda Nilayam/ ఆనంద నిలయం /आनंद निलयम

బీజాక్షర సంకేతములు/ Meaning of Bheejaksharas