Devi Stuti/ దేవీ స్తుతి - Entachakkati Danavamma / ఎంత చక్కటి దానవమ్మా ...





ఎంత చక్కటి దానవమ్మా ఓయమ్మా!!!



పల్లవి

ఎంత చక్కటి దానవమ్మా ఓయమ్మా ఎంతచక్కటి దానవమ్మా ||2 ||

పరవళ్లు త్రొక్కునీ అందము చూడ...రెండుకళ్ళూ చలవమ్మా ఓయమ్మా!

రెండుకళ్ళూ చలవమ్మా!  రెండుకళ్ళూ చలవమ్మా



చరణం 1

ఎంత సుకుమారి వమ్మా ఓయమ్మా ఎంత సుకుమారివో... ||2 ||

నీ సుకుమార సౌందర్యము చూడ  రెండుకళ్ళూ చలవమ్మా ఓయమ్మా !

రెండుకళ్ళూ చలవమ్మా రెండుకళ్ళూ చలవమ్మా



చరణం 2

ఎంత లావణ్య వతివమ్మ ఓయమ్మా ! ఎంత లావణ్య వతివో ... ||2 ||

నీ సుకుమార లావణ్యమూ చూడ, రెండుకళ్ళూ చలవమ్మా ఓయమ్మా !

రెండుకళ్ళూ చలవమ్మా! రెండుకళ్ళూ చలవమ్మా!



చరణం 3

హంసనడకల  దానవమ్మా ఓయమ్మా హంసనడకల  దానవమ్మా  ||2 ||

వయ్యారి నడకతో నడుచు నిను చూడ, రెండుకళ్ళూ చలవమ్మా ఓయమ్మా !

రెండుకళ్ళూ చలవమ్మా! రెండుకళ్ళూ చలవమ్మా!



చరణం 4

ముద్దు మోముల ముగ్దవే ఒయ్యమ్మా ! ముద్దు మోముల ముగ్దవే

మనసారా నీ ముద్దు మోమును చూడ, రెండుకళ్ళూ  చావమ్మా ఓయమ్మా

రెండుకళ్ళూ  చావమ్మా! రెండుకళ్ళూ



చరణం 5

మంచిగా ముస్తాబైతివమ్మ ఓయమ్మా! మహా మంచిగా ముస్తాబైతివమ్మ

ఇంపైన నగలతో ముస్తాబైన నిను చూడ, రెండుకళ్ళూ చాలవమ్మ ఒయ్యమ్మా!

రెండుకళ్ళూ చాలవమ్మ!  రెండుకళ్ళూ చాలవమ్మ!



చరణం 6

శివునితో కులుకుచున్నవమ్ ఓయమ్మా! శివునితో కులుకుచున్నావమ్మా !

ముదమున శివునితో కులుకు నిను చూడ, రెండుకళ్ళూ చాలవమ్మ ఒయ్యమ్మా!

రెండుకళ్ళూ చాలవమ్మ!  రెండుకళ్ళూ చాలవమ్మ!



చరణం 7

నామనసు దోచితివమ్మ ఒయ్యమ్మా! నా మనసు దోఁచితివమ్మా!

ఆనందముగా  నీతో విహరింప రెండుకళ్ళూ చాలవమ్మ ఒయ్యమ్మా!

రెండుకళ్ళూ చాలవమ్మ!  రెండుకళ్ళూ చాలవమ్మ!



చరణం 8

హృదయం హరించితివమ్మ ఒయ్యమ్మా! హృదయం హరించితి వమ్మా

హృదయ గుహలో నున్న నినుచూడ , రెండుకళ్ళూ చాలవమ్మ ఒయ్యమ్మా!

రెండుకళ్ళూ చాలవమ్మ!  రెండుకళ్ళూ చాలవమ్మ!



చరణం 9

నీ కరుణలో కరిగితినమ్మా ఓయమ్మా ! కరుణలో కరిగితినమ్మ!

నీ నీలాల కళ్ళలో కరుణను చూడ, రెండుకళ్ళూ చాలవమ్మ ఒయ్యమ్మా!

రెండుకళ్ళూ చాలవమ్మ!  రెండుకళ్ళూ చాలవమ్మ!



చరణం 10

నిను చూడలేని కళ్లేందుకమ్మా! నేని చూడలేని కళ్లేందుకు !

కనులార నిను కంచ లేని కళ్ళకు చూపున్న లేన్నట్టే నమ్మ! ఒయ్యమ్మా!

చూపున్న లేన్నట్టే నమ్మ! చూపున్న లేన్నట్టే నమ్మ!                          || ఎంత చక్కటి దానవమ్మా||

Comments

Popular posts from this blog

Ananda Nilayam/ ఆనంద నిలయం /आनंद निलयम

బీజాక్షర సంకేతములు/ Meaning of Bheejaksharas