Ananda Nilayam/ ఆనంద నిలయం /आनंद निलयम




అమ్మా నీ పాదము

అమ్మా నీ పాదము ఆనంద నిలయము
అది తెలిసిన వారిదే జన్మ ధన్యము || అమ్మా నీ...||

బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మణి నీ పాదము,
రమావాణీ  సేవించిన రమ్యమైన పాదము 
కైలాస గిరియందు కదలాడే పాదము
అలమేరు నిలయాన్ని అలరించే పాదము || అమ్మా నీ...||

వేదన పొందిన జీవుల దరిచేర్చే పాదము
చీకటి బ్రతుకుల వెలుగులు విరజిమ్మే పాదము
భవ బంధములు బాపే బంగారు పాదము
అనురాగ పాశముతో బంధించే పాదము || అమ్మా నీ ...||

వేదశాస్త్ర పురాణాలు విహరించే పాదము
శివ తాండవ జాతిగతులను నర్తించే పాదము
యొగింద్రుల జపతపముల ధ్యానమే నీ పాదము
భక్త జనుల అర్చనలతో శోభిల్లే పాదము  || అమ్మా నీ ...||

లోభిని త్యాగిని చేసే లోకమాత పాదము
ముఢుని జ్ఞ్యానిగా మార్చే ముచ్చటైన పాదము
అజ్ఞ్యాన తిమిరమును తొలిగించే పాదము
సుజ్ఞ్యాన దీపమును వెలిగించే పాదము || అమ్మా నీ ...||

కోటిజన్మ పుణ్యఫలము కోమలి నీ పాదము
అల్పతపనులకుఅదియే అందరాని పాదము
వశిన్యాది దేవతలు వర్ణించిన పాదము
శరణన్న వారికీ శరణమే నీ పాదము || అమ్మా నీ ...||

నా జీవన గమ్యము నా భాగ్యము నీ పాదము
నా గానము నా ప్రాణము సర్వము నీ పాదము
చివరకు నీ చేరేది శ్రీ మాత పాదము
తానే నేనై వెలసిన దివ్యమైన ధామము  || అమ్మా నీ ...||

Comments

Post a Comment

Popular posts from this blog

బీజాక్షర సంకేతములు/ Meaning of Bheejaksharas