సాష్టాంగ నమస్కారము

సాష్టాంగ నమస్కారము అంటే ఏమిటి ? చేయడం ఎలా?

సాష్టాంగ నమస్కారము అంటే ఎనిమిది అంగాలతో చేయదగిన నమస్కారము అని పేరును బట్టి స్పష్టంగా అర్థం అవుతూనే ఉన్నది.  అయితే ఏమిటి ఆ ఎనిమిది అంగాలు ?
ఈ శ్లోకం హృదయస్థం చేస్తే ఆ అంగాలన్నీస్పష్టంగా గుర్తు ఉంటాయి. –
> > ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా
పద్భ్యాం కరాభ్యాం జానుభ్యాం ప్రణామో^ ష్టాంగ ఈరితః <<
౧) ఉరస్సుతో నమస్కారం – అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి.
౨) శిరస్సుతో నమస్కారం – అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు
తాకాలి.
౩) దృష్టితో – అనగా నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ మూర్తికి నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.
౪) మనస్సుతో నమస్కారం – అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మనసా నమ్మి చేయాలి.
౫) వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం – నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్టదైవాన్ని మాటతో స్మరించాలి.
అంటే – ఓం నమశ్శివాయ అనో లేక ఓం నమో నారాయణాయ అనో
ఓం నమో మేరీతనయాయ అనో లేక ఓం నమో మహమ్మదాయ అనో
మాట పలుకుతూ నమస్కరించాలి.
౬) పద్భ్యాం నమస్కారం  – అంటే – నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.
౭) కరాభ్యాం నమస్కారం అంటే – నమస్కారం చేసేటపుడు  రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.
౮) జానుభ్యాం నమస్కారం అంటే – నమస్కారం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

Comments

Popular posts from this blog

Ananda Nilayam/ ఆనంద నిలయం /आनंद निलयम

బీజాక్షర సంకేతములు/ Meaning of Bheejaksharas