Posts

శ్రీ రామానుజాచార్యుల పవిత్ర శరీరం

Image
1000 సంవత్సరాలుగా భద్రపరచబడిన  శ్రీ రామానుజాచార్యుల పవిత్ర శరీరం... వేదానికి సరైన అర్ధం చెప్పి, విశిష్టద్వైత గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు శ్రీ రామానుజాచార్యులు. ఆయన పరమపథం చెంది వెయ్యేళ్లు అయినా ఇప్పటికీ ఆ శరీరం భద్రపరిచి ఉండడం విశేషం. శ్రీ రామానుజచార్యులు     భారతదేశంలో హిందూ మతానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైనది. ప్రతి రాష్ట్రంలోనూ అబ్బురపరిచే ప్రఖ్యాత దేవాలయాలు మనకు కనిపిస్తాయి. వాటిలో తమిళనాడులోని తిరుచ్చునాపల్లికి ఆనుకుని ఉభయ కావేరీ నదుల మధ్య ఉన్న శ్రీరంగం పట్టణం కూడా ఒకటి. ప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటైన శ్రీరంగం ఆలయంలో విష్ణు మూర్తి స్వయంభువుగా అవతరించినట్లు చెబుతారు. ఏడు ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది శ్రీ రామానుజాచార్యుల వారి శరీరం. శ్రీరామానుజాచార్యులు పరమపదించి వెయ్యేళ్లకు పైగా గడిచినా ఆయన శరీరాన్ని నేటికీ ఇక్కడ భద్రపరిచి ఉంచడం విశేషం. అయితే చాలా మంది భక్తులకు దీని గురించి తెలియకపోవడం విచారకరం. కొందరు శ్రీరంగంలోని 4వ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయాన్ని...

సర్వాభరణ భూషితా

51 సర్వాభరణ భూషితా –  అన్ని రకాల ఆభరణాల  చేతఅలంకరించబడిన తల్లికి   నమస్కారము. Sarvabharana Bhooshita   She who wears all the trinkets.Salutations  to  the  mother  1. సర్వాభరణభూషితా శరీరాన్ని అలంకరించుకోవటం కోసం ధరించేవి ఆభరణాలు. దేవి సర్వాభరణ భూషిత. తల మీద పెట్టుకునే చూడామణి దగ్గరనుండి కాలిమట్టైల దాకా 44 రకాల ఆభరణాలున్నాయని కాలికాపురాణంలోను, పరశురాముడి కల్పసూత్రాలలోను, దత్తాత్రేయసంహితలోను వివరించబడింది. ఆ ఆభరణాలు వివరాలు. నవమణిమకుటము తిలకము వాళలీయుగళము మణిమండలయుగళము నాసాభరణము అధరయావకము మాంగల్యము  కనకచింతాకము పదకము మహాపదకము ముక్తావళి  ఏకావళి  ఛన్నవీరము కేయూరయుగళచతుష్టమము వలయావలి ఊర్మికావళి కాంచీదామము కటిసూత్రము సౌభాగ్యాభరణము (నల్లపూసలు) పాదకటకము రత్ననూపురము పాదాంగుళీయకము పాశము అంకుశము పుండ్రేక్షుచాపము పుష్పబాణము మాణిక్యపాదుకలు కంఠాభరణము (కంటె) సీమంతాభరణము (పాపిటబిళ్ళ) కాళ్ళకుపట్టాలు గొలుసులు పాంజేబులు కడియాలు అందెలు చూడామడి పసుపు రవిక పూలు చెవికమ్మలు తాంబూలము ఫలము ఆభరణము అనే పదానికి అంతటా భరించేది అనే అర్ధం కూడా ఉంది. దీనినిబట్...

అరుదైన సమాచారం.

ఈ మెసేజ్ మళ్ళా దొరకదు.. అరుదైన సమాచారం. ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం కూడా మరోసారి మననం చేసుకుందాం.  దిక్కులు  (1) తూర్పు,  (2) దక్షిణం,  (3) పడమర, (4) ఉత్తరం మూలలు  (1) ఆగ్నేయం,  (2) నైరుతి, (3) వాయువ్యం,  (4) ఈశాన్యం  వేదాలు (1) ఋగ్వే దం, (2) యజుర్వేదం, (3) సామవేదం, (4) అదర్వణ వేదం  పురుషార్ధాలు (1) ధర్మ, (2) అర్థ, (3) కామ, (4) మోక్షా  పంచభూతాలు  (1) గాలి,  (2) నీరు, (3) భూమి, (4) ఆకాశం, (5) అగ్ని.   పంచేంద్రియాలు  (1) కన్ను,  (2) ముక్కు,  (3) చెవి,  (4) నాలుక, (5) చర్మం.  లలిత కళలు  (1) కవిత్వం, (2) చిత్రలేఖనం, (3) నాట్యం, (4) సంగీతం, (5) శిల్పం.   పంచగంగలు  (1) గంగ, (2)  కృష్ణ, (3) గోదావరి, (4) కావేరి,  (5) తుంగభద్ర.   దేవతావృక్షాలు  (1) మందారం,  (2) పారిజాతం, (3) కల్పవృక్షం,  (4) సంతానం, (5) హరిచందనం.   పంచోపచారాలు  (1) స్నానం, (2) పూజ,  (3) నైవేద్యం, (4) ప్రదక్షిణం, (5) నమస్కారం.    పంచామృతాలు  (1) ఆ...

మానస సరోవరం సమగ్ర వివరం/ Manas Sarovar

మానసరోవరం (లేక మానస సరోవరము, లేక మానస్) అనేది చైనా (China) కు చెందిన టిబెట్  (Tibet) ప్రాంతంలో గల మంచినీటి సరస్సు (Fresh water lake). ఇది లాసా (Lhasa) నగరానికి 940 కిలోమీటర్ల దూరంలో భారత దేశానికి, నేపాల్కు  చేరువలో ఉంది. చైనాలో ఈ సరస్సును మపం యుం (Mapam Yum), మపం యు ట్సొ (Mapam Yu Tso) అనే పేర్లతో పిలుస్తారు. *భౌగోళిక స్వరూపం* మానసరోవరానికి పశ్చిమాన రాక్షస్తల్ అనే ఉప్పు నీటి సరస్సు, ఉత్తరాన హిందువులు శివుని నివాస స్థలంగా భావించే కైలాస పర్వతం ఉన్నాయి. ఈ మంచినీటి సరస్సు సముద్రమట్టానికి 4,590 మీటర్ల ఎత్తులో ఉంది. 88 మీటర్ల చుట్టుకొలత, 300 అడుగులు లోతు, 320 చరదరపు కిలోమీటర్ల ఉపరితలము కలిగియున్న మానస సరోవరం గంగా చు (Ganga Chu) చానల్ ద్వారా రాక్షస్తల్ సరస్సుకి అనుసంధానమైయున్నది. ఈ ప్రాంతంలో ఎండాకాలం మే నెల నుండి ఆగస్టు నెల వరకూ ఉంటుంది. ఎండాకాలం (Summer) లో గరిష్ఠ ఉష్ణోగ్రత 15 డిగ్రీలు ఉంటుంది. ఋతుపవనాలు (Monsoons) సెప్టెంబరు నెల నుండి నవంబరు నెల వరకూ ఉంటాయి. చలికాలం (Winter) లో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల నుండి -15 డిగ్రీల మధ్య ఉంటుంది. అతి శీతలమైన ఈ సరస్సు ప్రాంతంలో ఎక్కడ చూచినా కొండలు,...

నేను నేనని (నేను... నాది..) Nenu Nenani ( I

Image

Corona Suchanalu

కుటుంబ సభ్యులందరూ దయచేసి గమనించండి 1 ఖాళీ కడుపుతో ఉండకూడదు 2 ఈ సమయం లోఉపవాసం ఉండరాదు 3. సూర్యరశ్మిలో రోజుకు 3 గంటలు ఉండాలి 4 ఎసి వాడకండి 5 వేడినీరు తాగండి, గొంతు తడిగా ఉంచండి ముక్కులో 6 ఆవ నూనె చుక్కలు వేసుకోవాలి 7 గుగ్గిలం హారతి కర్పూరం ఇంట్లో వెలిగించాలి మీరు సురక్షితంగా ఇంట్లో ఉండండి 8. ప్రతి కూరగాయలో సగం టీస్పూన్ శొంఠి అల్లం పోయాలి. 9. రాత్రి పెరుగు తినకూడదు 10. పిల్లలకు మరియు మీకు రాత్రి ఒక టీ స్పూన్ పసుపును కలిపి పాలు త్రాగాలి. 11. వీలైతే చవాన్‌ప్రష్ ఒక చెంచా తినండి 12. ఇంట్లో కర్పూరం మరియు లవంగాలు ఆవు పిడకతో దుపం వేయండి 13 ఉదయం టీలో లవంగాన్ని వేసుకొని తాగండి 14 పండ్లలో ఎక్కువ నారింజ మాత్రమే తినండి 15 ఉసిరి ఏదైనా రూపంలో,ఊరగాయ,లేదా జామ్, పౌడర్ మొదలైన విదంగా తినాలి. మీరు కరోనాను ఓడించాలనుకుంటే, దయచేసి ఇవన్నీ చేయండి. మీ అందరికి చేతులు జోడించి ప్రార్థిస్తున్న, మొదట, మీకు తెలిసిన వారికి ఈ సమాచారాన్ని పంపండి. పాలలో పసుపు మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

నక్షత్ర గాయత్రి

ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి ని రోజుకు 9 సార్లు పఠించాలి 1.అశ్విని ఓం శ్వేతవర్ణై విద్మహే సుధాకరాయై ధిమహి తన్నో అశ్వినేన ప్రచోదయాత్  2.భరణి ఓం కృష్ణవర్ణై విద్మహే దండధరాయై ధిమహి తన్నో భరణి:ప్రచోదయాత్ 3.కృత్తికా ఓం వణ్ణిదేహాయై విద్మహే మహాతపాయై ధీమహి తన్నో కృత్తికా ప్రచోదయాత్ 4.రోహిణి ప్రజావిరుధ్ధై చ విద్మహే విశ్వరూపాయై ధీమహి తన్నో రోహిణి ప్రచోదయాత్ 5.మృగశిరా ఓం శశిశేఖరాయ విద్మహే మహారాజాయ ధిమహి తన్నో మృగశిర:ప్రచోదయాత్ 6.ఆర్ద్రా ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే పశుం తనాయ ధిమహి తన్నో ఆర్ద్రా:ప్రచోదయాత్ 7.పునర్వసు ఓం ప్రజా వరుధ్ధై చ విద్మహే అదితి పుత్రాయ ధిమహి తన్నో పునర్వసు ప్రచోదయాత్ 8.పుష్య ఓం బ్రహ్మవర్చసాయ విద్మహే మహాదిశాయాయ ధిమహి తన్నో పుష్య:ప్రచోదయాత్ 9.ఆశ్లేష ఓం సర్పరాజాయ విద్మహే మహారోచకాయ ధిమహి తన్నో ఆశ్లేష: ప్రచోదయాత్ 10.మఖ ఓం మహా అనగాయ విద్మహే పిత్రియాదేవాయ ధిమహి తన్నో మఖ: ప్రచోదయాత్ 11.పుబ్బ ఓం అరియంనాయ విద్మహే పశుదేహాయ ధిమహి తన్నో పూర్వఫల్గుణి ప్రచోదయాత్ 12.ఉత్తరా మహాబకాయై విద్మహే మహాశ్రేష్ఠాయై ధీమహి తన్నో ఉత్తర ఫల్గుణి ప్రచోదయాత్ 13.హస్త ఓం ప్రయచ్చతాయై విద్మహే ప్రకృప్రణీతాయై ధీమహ...

రామాయణం - ప్రశ్నలు

రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి.. మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు కూడా పంపండి..🏹 1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు? = వాల్మీకి. 2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు? = నారదుడు. 3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు? = తమసా నది. 4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి? =24,000. 5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు? =కుశలవులు. 6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? =సరయూ నది. 7. అయోధ్య ఏ దేశానికి రాజధాని? =కోసల రాజ్యం. 8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు? =సుమంత్రుడు. 9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి? =కౌసల్య, సుమిత్ర, కైకేయి. 10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు? =పుత్రకామేష్ఠి. 11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను? = కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు. 12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వానరుడెవరు? ...

సుఖ జీవితానికి సూత్రాలు Secreats of Happy and Healthy Life

1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు.  2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.  3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి.  4. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి 5. భోజనానంతరం ఎంగిలి ఆకులు ఎత్తే వాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు. 6. తల్లిదండ్రులకు నిత్యపాద నమస్కారం చేయడానికి మించిన ధర్మం, నిత్యాన్నదానం చేయడం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలో లేవు.  7. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు.  8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది.  9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌర...

వర్ణమాలతో పెళ్లి ఆహ్వానం

 *అ* - *అరుదైన* అమ్మాయి  *ఆ* - *ఆకతాయి* అబ్బాయి  *ఇ* - *ఇద్దరికి*   *ఈ* - *ఈడు* జోడి కుదిరి  *ఉ* - ఉంగరాలను తొడిగి  *ఊ* - ఊరంతా ఊరేగించారు  *ఋ* - *ఋణాల* కోసం   *ఎ* - *ఎ* వరెవరినో అడుగుతూ ఉంటే  *ఏ* - *ఏనుగు* లాంటి కుభేరుడితో అడిగి  *ఐ* - *ఐశ్వర్యం* అనే కట్నం ఇచ్చి  *ఒ* - *ఒకరికి* ఒకరు వియ్యంకులవారు  *ఓ* - *ఓర్పుతో* ఒప్పందం చేసుకొని  *ఔ* - *ఔదార్యాని* ఇరు కుటుంబాలకు  *అం* - *అందించాలని* కోరుకుంటూ  *అ* : - *అ* : అంటూ  *క* - *కలపతో* తయారయిన పత్రికలపై  కలంతో రాసిచ్చి  *ఖ* - *ఖడ్గలతో* నరికిన పందిరి ఆకులను  *గ* - *గడప* ముందుకు తీసుకొచ్చి  *ఘ* - *ఘనమైన* ఏర్పాట్లు చేయించి  *చ* - *చాపుల* (బట్టలు)నింటిని కొని  *ఛ* - *ఛత్రం* (గొడుగు) పట్టి గండదీపాని  *జ* - జరిపిస్తూ  *ఝ* - *ఝాము* రాత్రి దాక  *ట* - *ట* పకాయలను కాలుస్తూ  *ఠ* - *ఠీవిగా* (వైభవంగా)  *డ* - *డ* ప్పులతో  *ఢ* - *ఢం* ఢం అని శబ్దాలతో సాగుతుంది  *ణ* - కంక *ణా* లు చేతికి కట్టుకొని  *త* -...

Bathing time for success ,good health, prosperity, and good relationship

*MUNI BATH and DEV BATH* Bathing Between 4 am to 6 am Brings happiness, peace, wealth, and good health in your life.  *MANAV BATH* Bathing Between 6 am to 8 am Brings success in your work, good luck, mutual relationship, good health and wealth. *RAAKSHAS BATH* Bathing After 8 am leads to  arguments at home and also at work, depression, loss in income and bad health.  So for successful life, have a bath before 8 am.

నవగ్రహాల అనుగ్రహాన్ని కలిగించే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం

శ్రీ ఆంజనేయస్వామి వారిని పూజిస్తే సకల దేవతలని పూజించిన ఫలితం వస్తుందని పరాశర సంహిత'లో ఉంది. నవగ్రహాల అనుగ్రహం త్వరగా పొందాలంటే వాల్మీకి రామాయణం లోని ఈ 9 శ్లోకాలు నిత్యం పారాయణ చేయడం మంచిది. నవగ్రహాలు అత్యంత కరుణా స్వరూపులు. మనం పూర్వజన్మలలో చేసిన పుణ్యపాపాల బట్టి ఫలితాలని ఇస్తారు.  కానీ భక్తితో వారిని ఇటువంటి స్తోత్రాలతో స్తుతిస్తే శుభఫలితాల్ని అనుగ్రహిస్తారు.  శ్రీ ఆంజనేయ నవరత్నమాలా శ్లోకాల పారాయణం వల్ల విద్యార్థులకు మేధస్సు, ఉద్యోగస్తులు, వ్యాపారులకు అభివృద్ధి, స్త్రీలకు వివాహం, సత్సంతానము మరియు వృద్దులకు ఆరోగ్యం కలుగుతుంది. నిత్యం లేదా శనివారం అయినా వీటిని పారాయణ చేయడం వలన శుభఫలితాలని పొందవచ్చు. వాల్మీకి రామాయణమునకు సుందరకాండ తలమానికము.సుందరకాండ సారమైన 9 శ్లోకములతో ఏర్పడినదే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం.  రత్నములవంటి తొమ్మిది శ్లోకములను ఒక మాలగా కూర్చి శ్రీ ఆంజనేయస్వామి వారికి సమర్పించబడినది. ఈ తొమ్మిది శ్లోకములు తొమ్మిది గ్రహములకు చెందునని చెప్పబడినది.  ఇవి శ్రీ ఆంజనేయస్వామి వారి వైభవము, స్వామి వారికి నవ గ్రహములతో గల సంబంధము తెలియబర్చును. ఈ స్తోత్రం పారాయణ చేస...

శ్యామశాస్త్రిగారు/Sri Syamasastry

కర్ణాటక సంగీత మూర్తిత్రయం గురించి మీరువినే ఉంటారు..వారే...శ్యామశాస్త్రి,త్యాగరాజు,దీక్షితులు-వీరి ముగ్గురిలోశ్యామశాస్త్రిగారి రచనలు బహు కొద్దిగా సుమారు 300 వరకూ మాత్రమే ఉన్నాయి.వాటిలోనూ ప్రస్తుతం అందరికీ తెలిసినవి వందలోపే ఉంటాయి.సంఖ్యాపరంగా తక్కువ రచనలుచేసినా,మిగిలిన ఇరువురితో సమాన స్థానం శ్యామశాస్త్రిగారికి దక్కటం విశేషం.     తంజావూరులో వంశపారంపర్యంగా తమకు లభించిన బంగారుకామాక్షి ఆలయ అర్చకత్వ విధులు నిర్వర్తిస్తూ,పరమభక్తులైన శ్యామశాస్త్రిగారు,నిత్యం అమ్మవారితో జరిపిన సంభాషణే కృతులుగా మనకు లభించాయి.వర్ణాలు,స్వరజతులు కూడా శ్యామశాస్త్రిగారు చేశారు.భాషాపరంగా చాలా సరళంగా ఉన్నా,సంగీతపరంగా ఎంతో ఘనమైనవి వారి రచనలు.ముఖ్యంగా లయ జ్ఞానంలో అసామాన్యులు వారు.     వారి జీవితంలో జరిగిన ఒక ఘట్టం వివరిస్తాను...         అది తంజావూరు రాజాస్థానం.శరభోజి మహారాజుగారు కొలువుతీరి ఉన్నారు.సభలోకి ఒక సంగీత విద్వాంసుడు ప్రవేశించాడు.ఆయన ఆంధ్రదేశం నుండివచ్చిన 'భూలోక చాపచుట్టె'గా ప్రసిద్ధులైన బొబ్బిలి కేశవయ్యగారు.ఆయన లోకమంతా చుట్టబెడుతూ,తన సంగీత విద్వత్తుతో అనేక రాజాస్థానాలలోని వి...

కాశీకంటే పురాతనమైన పుణ్యక్షేత్రం వృద్ధాచలక్షేత్రం

తమిళనాడులోని ఓ పుణ్యక్షేత్రం కాశీ క్షేత్రం కంటే పురాతనమైనది. అందువల్లే ఇక్కడ స్వామివారిని పూజిస్తే కాశీలో విశ్వనాధుడిని సేవించిన దానికంటే ఎక్కువ పుణ్యం వస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడ పుట్టినా, చనిపోయినా అప్పటి వరకూ చేసిన తప్పులు సమిసిపోయి తప్పక కైలాసానికి వెళ్తామని  ప్రతీతి. అందుకే కాశీలో జీవిత చరమాంకం గడపడానికి వీలుకుదరని వారు ఇక్కడికి వచ్చి దైవ సన్నిదిలో తమ శేష జీవితాన్ని ముగిస్తారు. ఈ నేపథ్యంలో ఆ దేవాలయానికి సంబంధించిన కథనం. వృద్దాచలాన్ని వృద్ధ కాశి అని కూడా పిలుస్తారు. ఇందుకు కారణం లేకపోలేదు. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం వృద్ధ కాశి అని పిలువబడే ఈ విరుదాచలంలో మరణిస్తే కాశీలో మరణించిన వారికంటే ఎక్కువ పుణ్యమే లభిస్తుందని చెబుతారు. మహిళలు తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని ఈ దేవతను పూజిస్తారు కాశీలో చెప్పినట్టే ఇక్కడ కూడా చనిపోతున్నవారి శిరస్సును తన ఒడిలో ఉంచుకొని ఇక్కడ కొలువై ఉన్న వృధ్ధాంబిక తన చీర కొంగుతో విసురుతూ ఉండగా వారి చెవిలో పరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశించి వారికి మోక్షం ప్రసాదిస్తాడని చెబుతారు. అదే విధంగా పరమశివుడు నటర...

భీష్మాష్టమి

మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమి అంటారు. ఈ రోజునే భీష్మ పితామహుడు మోక్షప్రాప్తిని పొందిన పర్వదినము . భీష్మాష్టమి రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. నలభై ఆరు రోజుల పాటు అంపశయ్య మీద ఉన్న కురువృద్ధుడు ఈ రోజున తన ఇష్టం ప్రకారం ప్రాణాలను వదిలాడు.  మాఘ మాసే సితాష్టమ్యాం   సతిలం భీష్మ తర్పణం ! శ్రాద్ధం యే మానవాః కుర్యుస్తేస్యు స్సంతతి భాగినః !!  ఏతజ్జీవ పిత్రుకేన అపి   కార్యం !  సాధారణంగా తండ్రి బతికి ఉన్నవారు తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కారు. కానీ భీష్మ తర్పణం విషయంలో ఆ నియమాన్ని పాటించరు. నరకచతుర్దశి, దీపావళి సమయంలో యమ తర్పణం ఎలాగైతే  తండ్రి జీవించి వున్నవాళ్ళు కూడా చేస్తారో. అదే విధిన భీష్మ తర్పణం కూడా నిర్వహించాలి. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం అని పద్మ పురాణం చెబుతుంది.  అంతటి ప్రత్యేక స్థానం భీష్ముడికి ఉంది. *భీష్మతర్పణ విధి* భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా సత్యధర్మములకు కట్టుబడి జీవించి చివర శ్రీకృష్ణుని సన్నిధిలో ముక్తినిబడసినవాడు, మూడు దోసిళ్ళ అర్ఘ్యం భీష్మ ప్రీతికి కింద ఇచ్చిన శ్లోకములను చెప్పి ఇవ్వవలస...