కావేరీ నది పుట్టుక..లలితాసహస్రనామావళి ఆవిర్భావ ఘట్టం
కావేరీ నది పుట్టుక..లలితాసహస్రనామావళి
ఆవిర్భావ ఘట్టం..!!💐శ్రీ💐
ఓం నమః శివాయ..!!🙏
శ్రీమాత్రేనమః.🙏
కావేరీ నది..దివ్యమైన పాపహరిణీ లలితాసహస్రనామావళి నరులకు చేరేందుకు
దోహదమైన కధావిశేషాలు..💐
మొదటగా కావేరీనది ఎలా పుట్టిందో తెలుసుకొందాము :
పూర్వం ప్రజారంజకంగా పరిపాలిస్తున్న
కావేరుడనే మహారాజుకి ముక్తిపై మనసు మళ్ళి బ్రహ్మగిరి ప్రాంతంలో కఠోరతపమాచరించసాగాడు.
తపస్సుకుమెచ్చి బ్రహ్మదేవుడు వచ్చి నీకు ముక్తికి సమయమింకా ఆసన్నమవ్వలేదు,
నీద్వారా సాగాల్సిన మహత్కార్యాలింకా ఉన్నాయి,
నీకొక పుణ్యవతి అయిన పుత్రిక జన్మిస్తుంది,
ఆమెద్వారా లోకహితమైన కార్యాలు నెరవేరబోతున్నాయని వరమిచ్చి అంతర్ధానమయ్యారు.
బ్రహ్మదేవుని ఆదేశానుసారం తిరిగి రాజ్యపాలనలో నిమగ్నమవ్వగానే బ్రహ్మదేవుని వరానుసారం కొంతకాలానికి ఒక సుందరమైన బాలిక జన్మించగా పండితుల ఆశీర్వాదాలతో లోపాముద్ర గా నామకరణం చేసాడు.
(ఈమెప్రస్థావన ఋగ్వేదంలోకూడాయున్నదట.
వరప్రద, కౌశీతకి అనే పేర్లుకూడా ఈమెకుకలవు)
లోపాముద్ర బాల్యం నుంచీ క్షత్రియ పౌరషంతో.పాటు భక్తిప్రపత్తులతో పెరగసాగింది.
యుక్తవయస్సు వచ్చేసరికి అగస్త్యునితో కళ్యాణం జరుపబడినది.
ఐతే వివాహానంతరం అప్పటివరకూ ధనకనకవస్తు,మందీమార్బలాల మధ్య పెరిగిన లోపాముద్ర త్వరితగతిన ఆశ్రమవాతావరణానికీ నారచీరలకూ కందమూలాలకూ అలవాటుపడకపోవుటచే అగస్త్యుడు
తన తపోబలంతో ఆమెలోని క్షాత్రాన్ని వేరుచేసి నీటిరూపంలో ఒక కమండలంలో బంధించి
శిష్యులను పిలిచి వారితో..
ఈకమండలంలోని నీరు ఎక్కడా వంపకుండా
కేవలం సముద్రంలో వదిలిరమ్మని పంపుతాడు.
అంతట ఆశిష్యులు నడుచుకొంటూ తలకావేరీ (ప్రస్తుతం కర్నాటకలోయున్నది) ప్రాంతమొచ్చేసరికి పొరపాటున కమండలం చేజారి అందులోని జలరూపంలో ఉన్న లోపాముద్రయొక్క క్షాత్రం ఉప్పొంగి అంతకంతకూ పెరిగి నురగలు కక్కుకొంటూ పల్లమును వెతుక్కొంటూ బిరబిరాప్రవహిస్తూ అనేక బీడుభూములను సస్యశ్యామలంచేస్తూ సముద్రంలో కలిసే కావేరీనదిగా రూపుచెందినది.
ఇకచేసేదేమీలేక జరిగినది గురువుగారికి విన్నవించుకున్నారు శిష్యులు.
లలితాసహస్రనామం ఆవిర్భావం,
మానవులకు అందిన మహత్తరఘట్టం :💐
ఇప్పుడు పరిపూర్ణ ఋషిపత్నిగా ఉన్న లోపాముద్ర ముందరే చెప్పుకున్నట్టు తనలోని భక్తిప్రపత్తులను
ఇంకా పెంచుకొని లలితామాతను ఆరాధిస్తూ అనతికాలంలోనే లలితాదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన భక్తురాలిగా మారిపోయింది.
ఒకనాడు విశ్వకళ్యాణార్ధం వసిన్యాదివాగ్దేవతలను పిలిచి నిర్ణీతసమయంలో అమ్మవారు తనపై సహస్రనామం వ్రాయించమని ఆజ్ఞాపించి చదివించుకొని అత్యంత సంతుష్టురాలయ్యింది మాత.
ఇక భూలోకమందున్న సర్వమానవులనూ పునీతుల్ని చేసే ఉద్దేశ్యంతో ఒకనాడు తన ప్రియభక్తురాలు లోపాముద్రకు కలలో కనిపించి,
నీపతిని వచ్చి హయగ్రీవునివద్దయున్న లలితాసహస్రాన్ని భూలోకవాసులకు బోధించమని ఆజ్ఞాపించగా ఆవిషయం తన పతిదేవుడైన అగస్త్యునికి లోపాముద్ర చెప్పగా హయగ్రీవుని కలిసి లలితాసహస్రాన్ని తీసుకురావడానికేగెను అగస్త్యమహాముని.
అంతమహిమాన్విత సహస్రనామాలను
అంతసులువుగా ఇస్తాడా హయగ్రీవుడు?
ససేమిరా అనటంమొదలుపెట్టాడు..
అటుపిమ్మట అగస్త్యుడు హయగ్రీవుని
ఇలా బ్రతిమాలాడాడు..
(లలితాసహస్రనామమందు వివరించిన పూర్వపీఠికాతాత్పర్యం)
మహాత్పూర్వకమైన మేధావివి అన్ని శాస్త్రములయందునూ పండితుడవు అయిన
ఓ హయగ్రీవ! ఆద్యంతమూ ఆశ్చర్యాన్ని కలిగించే
శ్రీ లలితా దేవి యొక్క అద్భుత గాధను ప్రవచించి యున్నావు.
ఆ ప్రవచనములో ఓం ప్రధమముగా అమ్మవారు ఆవిర్భావించడం ఆమె యొక్క జగత్రయ సామ్రాజ్య పట్టాభిషేకము భండాసురాది రాక్షసుల సంహారం కూడా నీచేత విస్తారంగా చెప్పబడి ఉన్నాయి.
సకల ఐశ్వర్య సంపన్నము అయ్యిన శ్రీపురం శ్రీమత్పంచదశాక్షరి మంత్రం మహిమ కూడా
ఎంతగానో అభివర్ణించావు.
న్యాస ఖండములో దేవి యొక్క షోడాన్యాసాదులను కీర్తించావు.
అలాగే అంతర్యాగ, బహిర్యాగ, క్రమాదులు .......
మహా యాగ క్రమ విధి విధానాలను కూడా
పూజా ఖండములో తెలిపావు.
పురశ్చరణ ఖండములో జప లక్షణాన్ని వివరించినావు.
హోమ ఖండములో హోమానికి అవసరమైన సాధన సంపత్తుల గురించి ద్రవ్య బేధాలని గురించి
ఆయా వస్తు రచనా విధుల గురించి తెలిపినావు.
రహస్య ఖండములో శ్రీచక్రమునకి శ్రీ విద్యకి శ్రీదేవికి
గురు శిష్యులకి గల అన్యోన్యతాదాత్మాన్ని సెలవిచ్చావు. స్తోత్ర ఖండములో అనేక స్తోత్రాలు చెప్పబడ్డాయి.
ఆ స్తోత్రాలలో మంత్రిణీ దేవి అయిన శ్యామలాంబ
దండినీ దేవి అయిన వారాహి సహస్ర నామాలనీ బోధించావే కానీ లలితా దేవి సహస్ర నామాలని వివరించలేదు.
కరుణామయ ఓ హయగ్రీవ ఆ విషయమై నాకు
సందేహం కలుగుతుంది.
అమ్మవారి సహస్ర నామాలపట్ల మీరు పరాకు చిత్తగించారా?
లేక గురుతుండీ నాయందు ఉపెక్షించారా?
పోనీ ఆ సహస్ర నామాలని వినేంత యోగ్యత నాకు లేదా? ఏ కారణము చేత ఆ స్తోత్రాన్ని నాకు ఉపదేశించలేదో తెలపండి.
సూతుడు వ్యాఖ్యానిస్తున్నాడు :
ఉపరివిధముగా అగస్త్యునిచే ప్రార్ధింపబడినవాడై హయగ్రీవుడు సంతోషముతో ఇలా పలికినాడు :
లోపాముద్ర యనబడే మహా ఇల్లాలికి మనోహరుడవైన
ఓ అగస్త్యా , శ్రద్దగా విను సహస్ర నామాలని ముందుగ ఎందుకు చెప్పలేదో తెలుపుదును.
ఆలలిత సహస్ర నామాలు అత్యంత రహస్యమైనవి.
కనుక ముందుగ వాటిని నీకు తెలుపలేదు.
కానీ భక్తితో అడిగినావు కనుక నీకు ఉపదేశిస్తాను స్వీకరించు.
భక్తుడు, శిష్యుడు అయిన వానికి గురువు ఎంతటి రహస్యాన్నైనా సరే బోధించవలసినదే.
ఇప్పుడు నీకు అందించ బోతున్నాను.
భక్తీ లేని వానికి చెప్పవద్దు.
గురువు ఎంత బోధించినా తనకేమి
అర్ధం కావటము లేదనే వానికి,
గురువు వద్ద విద్య నేర్చి బాహ్య ప్రసంగంలో
గురువుని పరిహసించె దుష్టులకి,
గురువు దైవం అన్న విశ్వాసము లేనివానికి
ఏనాడూ దీనినీ బోధించరాదు.
ముఖ్యముగా లలితా సహస్ర నామాలని
అమ్మ వారి యందు భక్తిగల వారికి,
ఉపాసకులకి, ఆచారవంతులకి, మాత్రమే ఉపదేశించాలి.
అసంఖ్యాకమైన దేవి సహస్ర నామాలలో
బాల,బగళ, శ్యామలాది దశ విధ సహస్ర నామాలు మాత్రం తత్కాలం లోనే ఫలిస్తాయని ప్రసిద్ది.
వాటిలో ఈ లలితా సహస్ర నామాలు
అత్యంత శ్రేష్టమైనవి.
ఏ విధముగానయితే మంత్రాలన్నిటిలోను
శ్రీవిద్య మంత్రమే గొప్పదో పురములన్నిఒటిలోను శ్రిపురమే గొప్పది.
శ్రీవిధ్యావుపాసకులన్దరిలోనూ శివుడే ఎలా గొప్పవాడో ఆవిధముగానే సహస్రనామాలన్నింటిలొనూ
శ్రీ లలితా సహస్ర నామములే అత్యంత ఉత్క్రుష్టమైనవి
లలిత సహస్ర నామాలని పఠనము చేయగానే
అమ్మవారు ఏంతో సంతోషిస్తారు.
నిత్యమూ పఠనము చేయుట సర్వ శుభకరము.
ఎవరయితే శ్రీ చక్రమందు లలితాంబను మారేడు దళాలతోగాని ,పద్మాలతో,తులసీదళాలతో
సహస్ర నామయుక్తముగా పూజిస్తారో వారిని
లలితాదేవి తక్షణమే అనుగ్రహిస్తారు.
ముందుగ శ్రీచక్రాన్ని ఆరాధించి పంచదశాక్షరి మంత్రం జపించి తదనంతరం సహస్ర నామాలని
పఠనము చేయాలి.
శక్తి లేని వారు కేవలము సహస్ర నామాలని
పారాయణం చేస్తే చాలు.
భక్తుడైన వాడు పూజవల్ల గానీ,
యధావిధి జపం వల్లగానీ,
ఏ సత్పలితాన్ని పొందుతున్నాడో
ఆ సహస్రనామం పారాయణం వలన కూడా
అదే సత్ఫలితాన్ని పొందుతాడు.
ఎలా అయితే నిత్యం త్రికాల సంధ్య వందనాదులని ఆచరిస్తున్నామో శ్రీచక్రార్చన శ్రీ విద్యా జపము
అమ్మవారి సహస్రనామ పఠనము కూడా
అలాగే ఆచరించాలి.
కనీసము సహస్ర నామములని అయినా
విడవకుండా జపించాలి.
భక్తులు ఆచరించే జప,పూజా,న్యాసాదికాలవల్ల అభ్యుదయమే జరిగినప్పటికీ కూడా నిజమైన భక్తులు లలితా సహస్ర నామాన్ని తప్పక జపించి తీరాలి.
అందుకు కారణము చెబుతాను విను.
భక్తుల శ్రేయస్సును తలపోసి ఒకప్పుడు లలితా దేవి....
వశిన్యాది వాగ్దేవతలని పిలిపించి ఓ వాగ్దేవతలార నామాటని ఆలకించండి....
నా అనుగ్రహము వలన మీరు సమస్త
వాగ్విధ్యా సంపత్తులనూ పొందివున్నారు.
అలాగే భక్తులని కూడా విద్యా సంపత్తులు సిద్దిమ్పచేయడములో మిమ్మల్ని నియమిస్తున్నాను.
మీరందరూ శ్రీచక్రము యొక్క రహస్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నవారు
నా నామ పారాయణ జప కారణముగా నాపట్ల
ఒక స్తోత్రాన్ని వివరించ వలసినదిగా అదేశిస్తున్నాను.
అలా బ్రతిమాలించుకొని,
లలితాసహస్రనామానికున్న నియమనిబంధనలు వివరిస్తూ జాగ్రత్తలుచెప్పి శ్రీలలితాసహస్రనామాన్ని అగస్త్యునికి అందజేసాడు హయగ్రీవుడు.
అమితానందంతో భువికేగి మానవులకు అత్యంతమహిమాన్వితమైన, పవిత్రమైన శ్రీలలితాసహస్రనామావళిని వినే, చదివే,
భాగ్యాన్ని కలుగజేసి,
చదివినవారు పాపవిముక్తులై, పునీతులై,
పుణ్యాత్ములై ఐహికసుఖాలను , పరదేవతానుగ్రహాన్ని పొందే మహత్తరమైన అవకాశాన్ని కల్పించారు అగస్త్యమహామునివారు,
తమ ధర్మపత్ని లోపాముద్ర భక్తిప్రపత్తులవలన..!
కలియుగంలో శ్రీలలితాసహస్రనామావళిని ఆడ,మగ,వృద్ధ,చిన్న,పెద్ద,నపుంసక,వ్యాధిగ్రస్థ,
వికలాంగులనే తేడా ఏమీలేదు.
అందరూ చదవవచ్చు.
చదవాలనే కోరిక కలగడమే అమ్మవారియొక్క ప్రేరణ.
అంటే అమ్మవారి దయలేకుంటే
అసలు లలితాసహస్రం చదివే లేదా వినే
అదృష్టం కూడా ఎవరికీ కలుగదు.
ఇక నిత్యం పఠించేవారెంత అదృష్టవంతులో.కదా.. శ్రీమాత్రేనమః..!!🙏
స్వస్తి..!!💐
ఓం నమః శివాయ..!!🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః..!!🙏
శ్రీరామ జయరామ జయ జయరామ..!!🙏
సర్వే జనా సుఖినోభవంతు..!!🙏
💐శ్రీ మాత్రే నమః💐
Comments
Post a Comment