వేణిదానం-ప్రయాగ
వేణి అంటే జడ అని అర్ధం.అలాగే నాడీ కూడా వేణి అంటారు. మన దేహము లో ఇడా, పింగళ, సుషుమ్నా అనే నాడులు మూడు పెనవేసికొని వెన్నెముక మొదలు వెనుక నుండి మాడు మీదుగా నుదుటవరకూ వ్యాపించి అక్కడ సంగమం చెందుతాయి.దానికి ప్రతీకగా ఆడవాళ్లు జడ మూడు పాయలు తీసి అల్లుతారు. ఇప్పుడు ఆడవాళ్ళ విధానం వేరు లెండి. వరాహవేణీదానం ఇదేమిటీ అనుకుంటున్నారా! అవును ప్రపంచంలో,రెండేరెండు దానాలు తీసుకోటానికి ఎవ్వరూ ముందుకు రారు. దానిలో మొదటిది "వేణిదానం" రెండవది మహిషిదానం.
తీర్ధరాజ్ గా పిలువబడే అలహాబాద్ లోని ప్రయాగ త్రివేణీ సంగమం దీనికివేదికగా,గంగా యమున సరస్వతి నదులపవిత్రసంగమం లో ఈ వేణీదానాన్ని నిర్వహిస్తారు.
జీవితకాలంలో మహిళలకు సంబధించిన రుతుదోషాలు,రుతుకాలంలో వంటచేయటం, అలాగే భర్త సముఖం లో లేనప్పుడు అలంకరించుకోవటం,ప్రసవ సమయలో గర్భదోషాలు,భర్తను దూషించినా,
తాడనం(దండించటం) స్త్రీలకు సంబంధించి ఏదోషనివృత్తికైనా ఈ వేణీదానపూజ చేస్తారు.
భార్య భర్తలు నూతనవస్త్రాలు ధరించి,విఘ్నేశ్వర పూజ,వేణీదానపూజ నిర్వహించి,భార్యను భర్త ఒడిలో కూర్చుండపెట్టుకోని,జడవేసి కత్తెర తో జడలోని చివరికొసలను కత్తిరించి,ఆ కొసలను త్రివేణి సంగమంలో నదీదేవతలకు దానం చేయాలి. మామూలుగా కేశాలను నీటిలో వేస్తే మునగవు. కానీ ఈ క్షేత్రం లో కేశాలను మునగటం గమనించవచ్చు.
జీవితం లో ఎన్నిసార్లు ప్రయాగ వెళ్ళినా,ఈ
కార్యక్రమం ఒకసారే చేయాలి.
మనపాపాలు మనకేశాలను అంటిపెట్టుకోని వుంటాయి. అందుకే తిరుపతి వెళ్ళినా,గయ,ప్రయాగ క్షేత్రాలకు వెళ్ళినా ముండనం చేయించమంటారు.తల్లిదండ్రులు గతించినా, ముండనం చేయించుకోవటం తప్పనిసరి.
ముండనం ప్రయాగలో, దండనం కాశీక్షేత్రం లో, పిండనం గయాక్షేత్రం లో తప్పనిసరి.
పాండవులనాటి అశ్వత్థవృక్షంఈ క్షేత్రం లో చూడవచ్చు. ఆ వృక్షం వేర్లు గయలో,కాండం కాశీలో, చెట్లకొమ్మలు ప్రయాగ లో చూడవచ్చు. ఇక్కడ పితృకార్యక్రమం తప్పనిసరి.
Comments
Post a Comment