Posts

Showing posts from February, 2018

సత్యం(నిజం)మే గొప్ప సంపద!!!

ప్రపంచంలో మనకు అబద్ధమే రాజ్యమేలుతున్నట్లు అనిపిస్తుంది కానీ, చివరికి నిలిచేది సత్యమే, సందేహం లేదు. ఉపనిషత్తులలోని ఈ కథ, సత్యం ఎంత గొప్ప సంపదో వివరిస్తున్నది.  అన్ని  విషయాల్లోనూ నిజం చెప్పగల్గటం అన్నది నిజంగానే గొప్ప సంపద. సత్యాన్ని జీవితంలోకి ఆహ్వానించి, అడుగడుగునా నిజాన్నే ఆయుధంగా మలచుకోవాలని నేర్పిన గాంధీజీని ఓసారి తలచుకొని, ఆ స్ఫూర్తితో మన జీవితాల్లో నిజం పాలు ఇంకొంత పెంచుకుందాం. నిజం చెబుదాం; వాస్తవంగా బ్రతుకుదాం. #సత్యవ్రతుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి. అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు. ఆయన ఆమెను ఆపి, గౌరవంగా "ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?" అని అడిగాడు. "రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్...

శ్రీ సూర్య భగవాన్

ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల  కిలోమీటర్ల దూరంలో ఉన్నసూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని8 నిమిషాలుగా అంచనా కట్టారు.  హనుమంతుడు బాల్యంలో  సూర్యుణ్ణి పండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట. హనుమ వెళ్లిన దూరాన్ని ‘యుగ సహస్ర యోజన పరాభాను’ అని తులసీదాస్‌ హనుమాన్‌ చాలీసాలో చెబుతారు. దీన్ని లెక్క కడితే..  యుగం.. 12000 ఏళ్లు,  సహస్రం అంటే .. 1000,  యోజనం అంటే . 8 మైళ్లు,  మైలు అంటే ... 1.6 కిలోమీటర్లు  వెరసి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు.  సూర్యకాంతి సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే, ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.  ఆ ఏడు గుర్రాల పేర్లు       1. గాయత్రి       2. త్రిష్ణుప్పు       3. అనుష్టుప్పు       4. జగతి       5. పంక్తి       6. బృహతి       7. ఉష్ణ...

సూర్యుడు నెలకొక్క ప్రాధాన్యతను వహిస్తాడు, తెలుసా?

ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం 12 మంది సూర్యులు.          1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు ధాత           2. వైశాఖంలో అర్యముడు          3. జ్యేష్టం- మిత్రుడు          4. ఆషాఢం- వరుణుడు          5. శ్రావణంలో ఇంద్రుడు          6. భాద్రపదం- వివస్వంతుడు          7. ఆశ్వయుజం- త్వష్ణ          8. కార్తీకం- విష్ణువు          9. మార్గశిరం- అంశుమంతుడు        10. పుష్యం- భగుడు        11. మాఘం- పూషుడు        12. ఫాల్గుణం- పర్జజన్యుడు ఆ నెలల్లో *సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు* వచ్చాయని చెబుతారు. సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు.

తిరుమల: వయోవృద్ధులకు(సీనియర్ సిటిజన్స్) శ్రీ వేంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం.

వయోవృద్ధులకు(Senior Citizens) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం  రెండు సమయాలున్నాయి:         1. ఉదయం 10 AM తరువాత         2. సాయంత్రం 3కు. అంతే. ఫోటోతో వున్న  వయసు నిర్ధారణ పత్రాలు(Photo Identity, (Adhaar Card, PAN Card, Passport, etc. )  *S 1 counter వద్ద చూపించాల్సి వుంటుంది* S1 Counter ఎక్కడ ఆలయానికి కుడివైపు బ్రిడ్జి కింద  గోడ పక్కనే. మెట్లు ఎక్కాల్సిన పనిలేదు. మంచి సీట్లు ఏర్పాటు చేయబడి వుంటాయి. సాంబారన్నం, పెరుగన్నం, వేడి పాలు ఉచితంగా ఇస్తారు. వారికి ₹20/-లకు రెండు లడ్డు టోకెన్లు ఇస్తారు. తరువాత  ₹25/- లకు ఒక లడ్డు చొప్పున ఎన్నైనా టోకెన్లు ఇస్తారు.  బ్యాటరీ కారు కౌంటరు నుండి గుడి-గుడి నుండి కౌంటరుకు బ్యాటరీ కారులో ఉచిత ప్రయాణం. వీరి దర్శనం కొరకు *మిగతా అన్ని క్యు లు నిలిపివేయబడతాయి* *ఎటువంటి వత్తిళ్ళు-తోపులాటలు వుండవు* *30 నిమిషాలలో దర్శనం పూర్తి అవుతుంది*