శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ గారు
*ఈరోజు స్వర్గీయ శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ గారు జన్మించిన రోజు* { వారిని గూర్చి ఒక భక్తురాలి వర్ణణ} రచయిత : శ్రీమతి లలితా శ్రీ బ్రహ్మ శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు ప్రముఖ శ్రీవిద్యా ఉపాసకులు. వారి స్వగ్రామం గుంటూరు జిల్లాలోని చందవోలు(చందొలు). శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మరియు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గార్ల ప్రవచనాలలో వారి గురించి విని వారు నివసించిన ఇంటిని దర్శించాలనే కోరిక బలంగా కలిగింది. ఇన్నాళ్ళకి అమ్మ వారి అనుగ్రహంగా ఆ అవకాశం దొరికింది. కాకినాడ నుండి బెంగుళూరు వెళుతుండగా దారిలో ఉన్న క్షేత్రాలు దర్శించుకుంటూ మోపిదేవి అనే సుబ్రహ్మణ్య క్షేత్రం నుంచి చందవోలు గ్రామం చేరుకున్నాం. ఊరి మొదట్లోనే ఉన్న చందవోలు అనే బోర్డు ప్రక్కనే వారు నివసించిన ఇల్లు ఉంది. ఇంటి ప్రక్కనే వారి పేరు మీద ఉన్న వేద పాఠశాల కూడా ఉంది. ఊరిలోని వారికి చందోలు శాస్త్రి గారుగా వారు సుపరిచితులు. ఇంట్లోకి వెళుతూనే అమ్మవారి స్వరూపమైన ఒక నిండు ముత్తైదువ ఎదురొచ్చారు. వారు శ్రీ శాస్త్రి గారి కోడలు. మేము శాస్త్రి గారి ఇల్లు చూద్దామని వచ్చామన