గోవింద గోవిందా
*వారి వెనుకే మనం కూడా నడుస్తున్నాం* పూర్వం తిరుమలలో వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళాలంటే...చింతచెట్టు, సంపెంగచెట్ల మార్గం అని పెద్ద పెద్ద మానులతోఉన్న ఓ మార్గం గుండా వెళ్ళేవారట. పంచవన్నెల చిలకల్ని అక్కడ పంజరాల్లో పెట్టి ఉంచేవారట. ‘కోనేటిరాయుడు లోపల ఉన్నాడు, వెళ్ళి దర్శించుకోండి, కానుకలు సమర్పించుకోండి, మీ కోరికలు తీర్చుకోండి’ అని అవి అరుస్తుండేవట. అవి విన్నారు అన్నమాచార్యులవారు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చి కోనేటి దగ్గర కూర్చున్నారు.గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు కొద్దిసేపు గుడిమెట్ల మీద తప్పనిసరిగా కూర్చోవాలంటారు. ఎందుకంటే.. మీరు లోపల దర్శనం చేసుకున్న మూర్తిని మళ్ళీ ఒకసారి మనసులోకి ప్రతిబింబింప చేసుకుని, ధారణ చేసుకోవాలి. అన్నమాచార్యుల వారికి కూడా అలా స్వామివారి సౌందర్యం జ్ఞాపకానికొచ్చింది. చిలకపలుకులు గుర్తుకొచ్చాయి. ఆ క్షణాల్లో చేసిన కీర్తనే...‘‘కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు...’’. అన్నమయ్య ఆ కొండమీదే ఉండిపోయాడు. తల్లిదండ్రులు పిల్లవాడిమీది బెంగతో ఉపవాసాలు చేస్తూ వెతుక్కుంటూ బయల్దేరారు. అక్కడ ప్రవర చెబుతున్న అన్నమాచార్యులును చూసి ఘన విష