VINAYKA CHARITRA /వినాయక చరితము
వినాయక చరితము రచన, సంగీతం ..........శ్రీవాణి గోరంట్ల పల్లవి : వినాయక చరితము వినరండి విగ్నములన్ని తొలగునండి భాద్రపద చవితిన గణాధ్యక్షుడు విజయాన్ని చేకూర్చునండి || వినాయక || అనుపల్లవి : మూషిక వహుని మోదక హస్తుని మనసారా పూజించండి సర్వదోషములు హరియించి సిద్ధిని బుద్దిని ఇచ్చునండి || వినాయక || చరణం 1 గజాసురుండు తపమొనరించి విరూపాక్షుని వరమడిగె తన ఉదరమున నివసించమని వామదేవుని ఆర్తితోవేడే పతిజాడ తెలియక పార్వతీదేవి పరి పరి విధముల వెదుకసాగే సోదరుడైన సాధువల్లభుని పతిని కనుగొని తెమ్మని పంపే || వినాయక || చరణం 2 మహాదేవుని జాడ కనుగొని దేవగణముతో మహావిష్ణువు వ్యోమకేశుని విడిపించుటకు గజాసుర పురమునకు చేరే గంగిరెద్దుగా నందిని చేసి అద్భుతముగ ఆటాడించే విషయము కనుగొని గజాసురుండు రాజమందిరము కాహ్వానించే || వినాయక || చరణం 3 ఆటప