VINAYKA CHARITRA /వినాయక చరితము
వినాయక చరితము
రచన, సంగీతం ..........శ్రీవాణి గోరంట్ల
పల్లవి:
వినాయక చరితము వినరండి విగ్నములన్ని తొలగునండి
భాద్రపద చవితిన గణాధ్యక్షుడు విజయాన్ని చేకూర్చునండి ||
వినాయక ||
అనుపల్లవి :
మూషిక వహుని
మోదక హస్తుని మనసారా పూజించండి
సర్వదోషములు హరియించి సిద్ధిని బుద్దిని ఇచ్చునండి
||వినాయక ||
చరణం 1
గజాసురుండు తపమొనరించి విరూపాక్షుని వరమడిగె
తన ఉదరమున నివసించమని వామదేవుని ఆర్తితోవేడే
పతిజాడ తెలియక పార్వతీదేవి పరి పరి విధముల వెదుకసాగే
సోదరుడైన సాధువల్లభుని
పతిని కనుగొని తెమ్మని పంపే ||వినాయక ||
చరణం 2
మహాదేవుని జాడ కనుగొని దేవగణముతో మహావిష్ణువు
వ్యోమకేశుని విడిపించుటకు గజాసుర పురమునకు చేరే
గంగిరెద్దుగా నందిని చేసి అద్భుతముగ ఆటాడించే
విషయము కనుగొని గజాసురుండు రాజమందిరము
కాహ్వానించే ||వినాయక ||
చరణం 3
ఆటపాటలతో నటనాట్యముతో
గజాసురున్ని మెప్పించి
ఏమివరములు కావలెననగా ఉదరమునున్న
ఉమాపతినడిగే
వారమడిగినది హరియని ఎరిగి గజాసురుండు నమస్కరించే
దయతో విష్ణువు ప్రమదగణముతో నిజరూపమున దర్శనమిచ్చే
||వినాయక ||
చరణం 4
తన శిరంబును లోక పూజ్యము జేయుమని ప్రాదింప
ఆలెనగునని వరమును ఇచ్చి శివుని విముక్తుడ చేసేనాయ
దుష్టులకిట్టి వరంబు కూడదని హరి కేశవుని మందలింప
గజాసురుని శిరము గైకొని కేదారుడు కైలాసం
బెగె ||వినాయక ||
చరణం 5
నీరజాక్షీ
నలుగు నిడుకొని అభ్యంగ స్నానము చేయుముందు
నలుగు పిండితో బాలుని చేసి ప్రీతిగా ప్రాణము పొసేనట్టమ్మా
లోనికెవ్వరు జొరబడకుండా బాలుని ద్వారము నందున నిలిపే
తల్లిమాట జవదాటని బాలుడు శివుని ద్వారమున నిరోదించెనట ||వినాయక ||
చరణం 6
నన్నుఆపుటకు నీవెవ్వడవని బాలుని శిరస్సు ఖండించి
లోనికిజొచ్చి
అలీతో కుడి మహదానందం శివుఁదొందే
మాటలమధ్యన బాలుని విషయము
తెలిసిన పార్వతి దుఃఖించే
గజాసురుని శిరస్సును జేర్చి ఈశ్వరుడే బాలుని బ్రతికించే
||వినాయక
||
చరణం 7
దేవతలు కైలాసంబేగి విఘ్నములకు అధిపతిని కోరగా
జేష్టుడ
నేనని గణపతి పలుక
, బలిష్టుడ నేనని స్కందుడు పలికే
మున్ముందెవ్వరు మూడులోకాల పుణ్యనదుల స్నానముచేసొత్తురో
వారికీ గణాధిపత్యమిత్తునని మహేశ్వరుడు ప్రీతిగ పలికే ||వినాయక ||
వారికీ గణాధిపత్యమిత్తునని మహేశ్వరుడు ప్రీతిగ పలికే ||వినాయక ||
చరణం 8
సుబ్రహ్మణ్యుడు
శిఖివాహనుడై రివ్వున ఆకాశమునకు ఎగిరే
తరుణోపాయము సూచించమనీ వినాయకుడు తండ్రివేడే
నారాయణ మంత్ర
జపముతో ముమ్మార్లు తల్లితండ్రికి
ప్రదక్షిణము చేసినంతనే నదీ
స్నాన ఫలము దక్కుననే ||వినాయక ||
చరణం 9
శివపార్వతుల ప్రదక్షిణంబు ఏకదంతుడు సలుపుచునుండ
ప్రతినదివద్ద
వినాయకుడు షణ్ముఖునకు ఎదురగునట్లుండే
అన్నప్రతిభను తెలియక నేను తలబడితినని క్షమించమనుచు
విగ్నాధిపత్యము అన్న కొసగమని స్కందుడు తండ్రికి విన్నవించే ||వినాయక ||
చరణం 10
విఘ్నాధి పత్యము స్వీకరించి కుడుములు వుండ్రాలు ఆరగించి
రెండు చేతుల నింపుకొని గణపతి కైలాసమునకు జేరి
తల్లితండ్రులకు ప్రణమిల్లబోవఁ
చేతులు భూమికి అనవైతివి
మిక్కిలి శ్రమతో నమస్కరింపగ పాదములు ఆకాశము చూసే
||వినాయక ||
చరణం 11
పకపకమనుచు చంద్రుడు నవ్వగ
రాచ దృష్టితో ఉదరము
పగిలే
కుడుములు ఉండ్రాళ్ళు చెల్లా చెదురై విగ్నేశ్వరుడు విఘతుండాయే
ప్రాణంవీడిన బిడ్డను చూసి
పార్వతి దేవీ శపియించె
'చంద్ర దర్శనము చేసిన వారు నీలాపనిందల పాలాయెదరని ||వినాయక ||
చరణం 12
విషయము తెలియని సప్తఋషి పత్నులు ఆ సాయంత్రము
చంద్రుని చూసి
ఇంద్రుని కూడిన అభియోగముతో పతులచే
నీలాపనిందలు పొందే
ఆ ఋషి పత్నులు గౌరినిచేరి తరుణోపాయము తెలుపుమనగా
భాద్రపద శుద్ధ చవితిన మాత్రము
చంద్ర దర్శనము కూడదనే
||వినాయక
||
చరణం 13
ద్వాపరయుగమున ద్వారకలోన భాద్రపద శుద్ధ చవితినాడు
చంద్ర
దర్శనము కూడదని కృష్ణుడు పురమున చాటించె
పాలుపితుకుతు క్షీరములోన చంద్రబింబమును కృష్ణుడు చూసే
రాబొవునిందా
యేమియగునో ని కృష్ణుడు యోచించసాగె
||వినాయక ||
చరణం 14
సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు శమంతక మణిని ధరియించి
వేటాడుటకు అడవికి పొగ సింహము వానిని పట్టి
వధించే
మణిని జూచి మాంసమనుకొని సింహము నోటా కరుచుకోగా
భల్లూక రాజ్యం వానితో తలబడి మణిని చేజిక్కించుకొనే ||వినాయక ||
చరణం 15
కృష్ణుడు మణిని అపహరించెనని సత్రాజిత్తు పురమున చాటింప
చవితి చంద్రుని దర్శ ఫలితమే ఈ నీలాపనిందని కృష్ణుడు తలచే
అడవికిబోయి విషయము కనుగొని భల్లూకమునోడించినంతనే
మణి సహితముగా జాంబవతిని,
కృష్ణుడి కతను సమర్పించే
||వినాయక ||
చరణం 16
సత్రాజిత్తుకు ఆ
మణి నొసగి యావత్ వృత్తాంతము తెలినంతనే
మణి సహితముగా సత్యభామను సత్రాజిత్తు కృష్ణునికర్పించే
అక్షతలు చేపట్టుకొని శమంతకోపాఖ్యానము విని
,
ఆ అక్షతలు శిరమున దాల్చిన నీలాపనిందలే ఉండవులే
||వినాయక
||
చరణం 17
వినాయక చరితము వినిన వారికీ గణాధ్యక్షుని కృపవల్ల
విగ్నములు
వీడి , కార్యసిద్ధి కలిగి
, విజయము చేకురునండి
ధర్మమూ వీడక
, స్వార్ధము వీడి ప్రేమను పంచి తృప్తిగ ఉడిన
సిద్ధిని బుద్దిని ప్రసాదించి వినాయకుడే మిము కాపాడునండి
||వినాయక ||
Comments
Post a Comment