భగవంతుని పూజ
భగవంతుని పూజ భగవంతుని మెప్పిస్తే మన కష్టాలన్నీ దూరమవుతాయని మన శాస్త్రాలు , పురాణాలూ చెబుతున్నాయి !!! భగవంతుని ( ఏ దేవతా స్వరూపమైనా ) భక్తి పూర్వకంగా స్తోత్రాలు పఠించి నా , సంకీర్తనలు పాడి నా , దేవాలయాలలో సేవా కార్యక్రమాలలో పాల్గొన్నా , బ్రహ్మోత్స వాలలో నృత్యం చేసిన , ఆపదలో ఉన్నవారిని ఆదుకున్న , ధాన ధర్మాదులు చేసిన , పదిమందికి ఉపయోగపడే ఎలాంటి ధార్మిక మార్గములో నడచిన ..... భగవంతు డు మెచ్చి ఆపదలనుడి రక్షిణించి, మనకు మేలు చేస్తాడు అని మనందరి నమ్మకము , కదా? నిజంగా భగవంతుడు మనల్ని రక్షిస్తాడా? అది సాధ్యమా? అది ఎలా సాధ్యపడుతుందో నేను తెలుకున్న విషయాన్ని మీకు తెలియ చేస్తున్నాను ! భగవంతుని పేరిట ఎలాంటి పని చేసినా భయముతో కూడిన భక్తి ఉంటుంది . ఎందుకంటే పొరపాట్లు ఎమన్నా జరిగితే పరిణామము ( రిసల్ట్ ) మనము అనుభవించాల్సి ఉంటుంది, కదా? కాబట్టి మనన్సును , మాటను , అదుపులో పెట్టి , చేసే పనిని జాగ్రత్తగా చేస్తూ ఉంటాము . ఎప్పుడైతే మనన్సును , మాటను అదుపులో పెడతామో అప్పుడే బుద్ది సక్రమముగా పనిచేస్తుంది .