Posts

Showing posts from 2021

How Karma impacts our Lives

*మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ - ఎలా పెట్టుకు పోతాయో ఒకసారి పరిశీలి ద్దాం - రండి*    🙏జై శ్రీమన్నారాయణ👏 *ఈరోజు చాలామందిమి, పూజలు చేసాము, వ్రతాలు నోమాము, దానాలు చేసాము, ధర్మాలు ఆచరించాము, అని విర్ర వీగుతుంటాము, కానీ అవి ఎంతవరకు మనలను - భగ్వద్ సన్నిధికి చేర్చుతాయని ఆలోచించము కదూ. అలాంటి ఒక సంఘటన మహాభారతం లో చోటు చేసుకుంది. అదేమిటో ఒకసారి పరిశీలిద్దామా?*  *కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు.  తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు. కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్లి బోరున విల పిస్తాడు. చిన్న* *పిల్లాడిలా ఏడుస్తున్న అతన్ని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు.* *ధృతరాష్ట్రుడి దు:ఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు.*  *అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడ వైన నువ్వు ఎందుకు మిన్నకుండి పోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకు వందమంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశా...

Bhagawadgeeta quiz

*భగవద్గీత పైన అందరికి ఉండవల్సిన అవగాహన కోసం...హిందూ ధర్మం పాటించే ప్రతీ ఒక్కరికీ షేర్ చేయండి* *1.* భగవద్గీతను లిఖించినదెవరు? =విఘ్నేశ్వరుడు. *2.* భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము? = భీష్మ పర్వము. *3.* గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును? =మార్గశిర మాసము. *4.* గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును? =హేమంత ఋతువు. *5.* ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను? = వసంత ఋతువు. *6.* భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను? =శ్రీకృష్ణుడు అర్జునునికి. *7.* భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను? =కురుక్షేత్ర సంగ్రామము. *8.* భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యెను? =కౌరవ పాండవులకు. *9.* పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధిగా వుండెను? =అర్జునుడు. *10.* వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను? =సామవేదము. *11.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి? =పాంచజన్యము. *12.* భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు? =పద్దెనిమిది (18) *13.* “నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది” అని చెప్పిన స్వాతంత్ర్...

మంత్రమాతృకాపుష్పమాలాస్తవః

మంత్రమాతృకాపుష్పమాలాస్తవః ********************                                                       కల్లోలోల్లసితామృతాబ్ధిలహరీమధ్యే విరాజన్మణి- ద్వీపే కల్పకవాటికాపరివృతే కా...

రామాయణం‌108_ప్రశ్నలు_జవాబులతో/ Ramayana questions

రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి.. 1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు? = వాల్మీకి. 2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు? = నారదుడు. 3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు? = తమసా నది. 4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి? =24,000. 5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు? =కుశలవులు. 6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? =సరయూ నది. 7. అయోధ్య ఏ దేశానికి రాజధాని? =కోసల రాజ్యం. 8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు? =సుమంత్రుడు. 9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి? =కౌసల్య, సుమిత్ర, కైకేయి. 10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు? =పుత్రకామేష్ఠి. 11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను? = కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు. 12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవ్వరు? =జాంబవంతుడు. 13. వాలి ఎవరి అంశతో జన్మించెను? = ...

Midnight Birthday celebration ?

మీరు మీ పుట్టినరోజుని అర్ధరాత్రి 12 గంట లకు జరుపుకుంటున్నారా ??? అయితే తస్మాత్ జాగ్రత్త! ఈ మధ్యకాలం లో సమాజం లో ఓ "వింత పోకడ /సాధనను" మనం గమనిస్తున్నాము.  అదే మిటంటే అర్ధరాత్రి 12 గంటలకు పుట్టినరోజు వేడుకలు, కానీ ఇది ఎంత తప్పో మీకు తెలుసా ? హైందవ గ్రంధాల ప్రకారము ఇది తప్పు! అవును ఈ విధంగాఅర్ధరాత్రి వేడుక ఎంత  తప్పో మీకు తెలియజేసే ప్రయత్నము చేస్తాను  ఈ మధ్య కాలములో నేటి సమాజములో ఎవరిదైనా  పుట్టినరోజు కానీ, పెళ్లిరోజు కానీ మరే ఇతర వేడుకైన గాని రాత్రి 12 గంటలకు జరుపుకోవడం ఫాషన్ గా మారిపోయింది. జనాలు కూడా ఈ విధంగా రాత్రి వేడుకలో కేకులు కోస్తూ సంబరాలు జరుపు కోవడంలో ఆనందాన్ని వెతుకుతున్నారు.  కానీ హైందవ గ్రంధాలూ రాత్రి 12 గంటల సమయమును "నిషిద్ధ " కాలంగా అభివర్ణించాయి.  అవును మధ్య రాత్రి 12 గంటల నుంచి జాము 3 గంటల వరకు హైందవ శాస్త్ర ప్రకారము "నిషిద్ధ గడియలు".  అనగా అర్ధ రాత్రి 12 గంటలు సమయములో జరిగే సంబరాలు మనము నిషిద్ధ కాలములో జరుపుకొంటున్నాము.  కానీ హైందవ గ్రంథల ప్రకారము ఈ నిషిద్ధ సమయములో మానవ నేత్రాలకు కనబడిని ఎన్నో దుష్ట శక్తులు, దెయ్యాలు, రక్త పిశాచాల...

రామదాసు కీర్తన Ramadas keerthan Mangalam

*రామదాసు కీర్తన* పల్లవి రామచంద్రాయ జనక రాజ జామనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం చరణములు కోసలేశాయ మంద హాస దాస పోషణాయ వాసవాది వినుత సద్వరద/(రాయ) మంగళం చారు కుంకుమోపేత/ (మేఘరూపాయ) చందనాదిచర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం లలిత రత్నమండ లాయ/(కుండలాయ) తులసివన మాలికాయ జలద సదృశ దేహాయ చారు మంగళం దేవకీ పుత్రాయ దేవ దేవోత్తమాయ చాప జాత గురు వరాయ భవ్య మంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్ర వదనాయ అండజ వాహనాయ అతుల మంగళం విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ సుముఖచిత్తకామితాయ శుభద మంగళం రామదాసాయ మృదుల హృదయ కమల వాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం రామచంద్రాయ జనక రాజ జామనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం  సర్వమంగళ... మహిత మంగళం...

స్మశాన నారాయణస్వామి ఆలయం, ఆలంపుర్/ Smashana Narayana Swami, Alampur

స్మశాన నారాయణస్వామి ఆలయం, ఆలంపుర్ పితృ దోషము నుండి బయటపడే సులువైన పరిష్కారం.. #పితృదోషం మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించటానికి మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో ... అలాగే...  తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి. మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది. అలాగే అదే పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే అది తెలుసు కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా గాని వారు చేసిన పాప కర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు.. మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ముఖ్యమైనది ఒక్కటే. అదే #పితృదోషం ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం. అందుకే ఈ పోస్టు పెడుతున్నాను. పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది. ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు. వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే. పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని చర్చించుకు...

నవగ్రహాలు-పూజాఫలం / Navagraha Puja phalam

*నవగ్రహాలు-పూజాఫలం*   నవగ్రహాల్లో అగ్రజుడు సూర్యుడు బుద్ధిని వికసింపజేస్తాడు. మనస్సును స్థిరపరుస్తాడు. ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. ఇక కుజుడికి మనస్తాపం కలిగించే లక్షణాలున్నాయి. ఈయన్ని ప్రార్థిస్తే మనస్తాపానికి గల కారకాలను దూరం చేస్తాడు. ప్రశాంతతను ఇస్తాడు. రాహువు కంటి బలాన్ని తగ్గిస్తాడు. శరీరంలోని మాంసంలో దోషాన్ని ఏర్పరుస్తాడు. ఈయన్ని పూజిస్తే కంటికి బలాన్ని కలుగజేస్తాడు. శరీర మాంసంలోని దోషాలను నివృత్తి చేస్తాడు.    గురువును ఆరాధిస్తే.. బృహస్పతిగా పిలువబడే ఆయనను ప్రార్థిస్తే.. వృత్తి, ఉద్యోగాల్లో నైపుణ్యతను ప్రసాదిస్తాడు. మెదడును చురుకుగా ఉంచుతాడు. ఇక శనిగ్రహం గురించి తెలుసుకుందాం.. శని ఉత్తముడు. ఆయన జీవితంలో మనకు ఎన్నో పాఠాలను నేర్పుతాడు. ఆయన్ని పూజిస్తే.. ఇలా చేయొద్దు.. ఇలా చేయమని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. సరైన మార్గాన్ని అనుసరించమంటాడు. ఆ మార్గాన్ని చూపెడతాడు.  బుధ గ్రహం బుద్ధిమంతుడు. మనం చేస్తున్న ఉద్యోగంలో కొత్త మెలకువలను నేర్పించగలే సమర్థుడు. ఇతనిని పూజిస్తే మాట్లాడటంలో నైపుణ్యాన్ని, వ్యాపారంలో అభివృద్ధిని చేకూరుస్తాడు. ధనార్జనకు శక్తిమంతుడు. కేతువును పూజిస...

నవగ్రహ దోష నివారణ / Navagraha Dosha Nivarana

*నవగ్రహ దోష నివారణకు తీసుకోవాలసిన ఆహారం-దానం చేయాల్సిన వస్తువులు* నవగ్రహ దోషాలు ఉన్నప్పుడు ఆయా గ్రహాలకు సంబందించిన ఆహార పదార్ధాలను తినటం వలన గ్రహాలకు సంబందించిన దోషాలు నివారించవచ్చును. తరువాత పూజా సంబందిత కార్యక్రమాలు, దాన ధర్మాలు చేయటం ద్వారా దోషాలను నివారించవచ్చును. జాతకంలో గ్రహాలు శత్రు క్షేత్రాలలో ఉన్న, నీచలో ఉన్న, అస్తంగత్వ ప్రభావంలో ఉన్న, పాపార్గళంలో ఉన్న, గ్రహం ఉన్న రాశిలో తక్కువ అష్టకవర్గు బిందువులు ఉన్న, గ్రహాలకు సంబందించిన దశాంతర్ధశల యందు, గోచార నందు ఆయా గ్రహాలకు సంబందించిన ఆహార పదార్ధాలు తినటం ద్వారా అవి మన శరీరానికి పట్టి ఆయా గ్రహాలు ఇచ్చు దోష ఫలితాలను నివారించవచ్చును. గ్రహాలకు సంబందించిన ఆహార పదార్ధాలను మన శరీరానికి తీసుకున్న తరువాత పూజా పూజలు, వ్రతాలు, యఙ్ఞాలు, దాన ధర్మాలు మొదలగు కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చును. రవిగ్రహ దోషం ఉన్నవారు తండ్రికి సహాయపడటం, గోధుమ గడ్డి, చెరుకు రసం, గోధుమ పిండి, నెయ్యి, ఎర్ర వస్త్రాలు, ఎర్ర చీమలకు గోధుమ పిండి వెయ్యటం, కోతులకు ఆహారం పెట్టటం, ఎర్ర చందనం చెక్క లేదా పొడి, ఎర్ర పుష్పాలు, ఎర్ర వర్ణం కలిగిన ఆవులు, గోధుమరొట్టె, ఆరెంజ్ వస్త్రాలు, రాగి,...