Posts

Showing posts from June, 2020

Sri Lalitha Ashtakam/ శ్రీ లలిత అష్టకం /श्री ललिता अष्टकम

Image

Sri Lalitha Ashtakam/ శ్రీ లలిత అష్టకం /श्री ललिता अष्टकम

Image

*నేటి మన పెళ్ళిళ్లలో చేస్తున్న పొరపాట్లు*

15000 మంది దంపతుల పై గడచిన 20సంవత్సరాల నుంచి పరిశోధన చేస్తున్న ఒక పండితుల గోష్టి నుంచి  ఒక పండితుడు షేర్  చేసి వారు చేసిన కృషియే ఈ  అక్షర రూపం  1. మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం.. పెళ్ళి ముహూర్తం పెట్టేది ఎందుకు ఆ ముహూర్తానికి వధూవరులు ఒక్కటి అయితే సంతోషంగా వుంటారు అని  ముహూర్తానికి పెళ్ళి జరగక పోతే ఎలాగయినా చేసుకోవచ్చు కదా హంగు ఆర్భాటాలకు పోకుండా ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం, చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవటం.. భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం..! 2. జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో ఒకరు చూపులు నిలపకపోవటం.. - ఫలితం: దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించటం..! (వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం) (పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం ఆచరించాకే మిగతావి) 3. ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం.. ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం...! 4. తలంబ్రాల కు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం.. ఫలితం: దీనివలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బందులు ...! 5. బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి రావటం వధూవరులని ఆశీర్వదించటం...

పురందర దాసు కీర్తన

పురందర దాసు (1484 – 1564) ప్రప్రధమ కర్ణాటక సంగీత విద్వాంసులు,వాగ్గేయకారుడు, మరియు కర్ణాటక సంగీత పితామహులు. వీరు రచించిన కీర్తనలుఎక్కువగా కన్నడంలో, కొన్ని సంస్కృతంలో ఉన్నాయి.         అన్ని కీర్తనలు విష్ణుమూర్తికి అంకితమిస్తూ 'పురందర విఠలా' తోనే అంతం చేశారు. సింధుభైరవి రాగం లొ చెయ్యబడినది. వేంకటాచల నిలయం వైకుంఠ పురవాసం ||  పంకజ నేత్రం పరమ పవిత్రం  శంఖ చక్రధర చిన్మయ రూపం ..♫ అంబుజొద్భవ వినుతం అగణిత గుణ నామం తుంబురు నారద గాన విలొలం వేంకటాచల నిలయం వైకుంఠ పురవాసం ..♪ మకర కుండల ధరా మదన గోపాలం  భక్తపోషక శ్రీ పురంధర విఠలమ్  వేంకటాచల నిలయం వైకుంఠ పురవాసం  పంకజ నేత్రం పరమ పవిత్రం  శంఖ చక్రధర చిన్మయ రూపం  వేంకటాచల నిలయం వైకుంఠ పురవాసం  by Sriranjani Santhanagopalan Music 

సుందరకాండ మన సమస్యలకి పరిష్కారం

మన సమస్యలకి  సుందరకాండ అతిశక్తివంతమైన  తాంత్రిక పరిష్కారాలు...........!! సుందరకాండ అద్భుతమైన పారాయణం, ఎన్నో సమస్యలకు సుందరకాండ లోని వివిధ సర్గలు పారాయణ చేసి ఎంతో మంది పరిష్కారం పొందారు..  ఈ రోజుల్లో అందరికి వివిధ కారణాల వల్ల నిత్యం కాండం మొత్తం పారాయణ చేయలేరు, అయితే అందులో ఏ సమస్యకు ఏది పరిహారామో వివరంగా ఉంది. పారాయణ నియమాలతో ఉంటుంది.  ఇక్కడ ఇచ్చిన వివరాలు ఒకసారి పరిశీలించండి.  1. ఆపదలు తొలగటానికి , సంపదలు కలగటానికి ----------------------------------- శ్లోకం : ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదామ్  *లోకాభిరామం శ్రీరామం, భూయో భూయో నమామ్యహమ్ || 21 దినములు , 108 సార్లు , శక్తి  కొలది తమలపాకులు, అరటిపళ్ళు నివేదన చేయాలి.  2. విద్యాప్రాప్తికి ---------------------- ఒకసారి పరిపూర్ణంగా పారాయణ చేయవలెను . 3 రోజులు ద్రాక్ష , అరటిపళ్ళు నివేదన  3. భూతబాధ  నివారణకు -------------------------------- 3 వ సర్గ వచనము రోజుకు 108 సార్లు 30 దినములు పారాయణ చేయవలెను . 1 కొబ్బరికాయ , అరటిపళ్ళు నివేదన 4. సర్వ కార్య సిద్దికి ------------------------ 64 వ సర్గ నిష్ఠతో 11...

స, రి, గ, మ, ప, ద, ని, స* తోసరస్వతీ దేవి ప్రశంస

స, రి, గ, మ, ప, ద, ని, స* తో సరస్వతీ దేవి ప్రశంస *స* ద సత్కళా క్షీరజల విభాగ క్రియా నిపుణ హంసీ తురంగిత విలా *స* *రి* పు వదజ్ఞాన పరిభ్రాంతి హారి పుస్తక హస్త వారిజాత సుకుమా *రి* *గ* గనాపగా సమాన గంభీరగాన భాక్కమ్ర వీణా గీతికి తరం *గ* *మ* ధు మాధురీ మంజ మంజుల గేయ సమ్యక్పరిగణన సదక్ష దా *మ* *ప* రభృత కిశోర పంచమ స్వర కలాం *ప* *ద* రహసన మథురారవింద మకరం *ద*  *ని* రుపమాన ఘృణా వరణీయ జన *ని*  *స* రస శారదా యందు మన్మత్ ప్రశం *స* (ఏ శతాబ్దంలోనో పేరుకూడా చెప్పుకోని మహాకవి సరస్వతీ దేవిని స్తుతిస్తూ వ్రాసిన పద్యం ఇది)