చూడామణి నామక సూర్యగ్రహణం* తేదీ : 21-06-2020 ఉదయం 11:58
*చూడామణి నామక సూర్యగ్రహణం* తేదీ : 21-06-2020 ఉదయం 11:58 శ్రీశార్వరినామ సంవత్సరం జ్యేష్ఠ అమావాస్య ఆదివారం .మృగశిర -4 , ఆరుద్ర -1 పాదాలు మిథున రాశి లో రాహుగ్రస్త అంగుళ్యాకారంలో సూర్య గ్రహణం సంభవిస్తోంది . ఈ గ్రహణం భారతదేశముతో పాటు ఆసియా , ఉత్తర ఆస్ట్రేలియా , పాకిస్తాన్ , శ్రీలంక , ఆఫ్రికా మొదలగు ప్రాంతములయందు కూడా కనిపించును . చాలా ప్రాంతములలో పాక్షికముగా కనిపించును , డెహ్రాడూన్ ( ఉత్తరాఖండ్ ) లో సంపూర్ణంగా కనిపించును . *మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రముల వారు , మిథునరాశి వారు ఈ గ్రహణం అసలు చూడరాదు.* *తెలంగాణ రాష్ట్రానికి* గ్రహణ ఆరంభకాలం : ఉ . 10.14 గ్రహణ మధ్యకాలం : ఉ . 11.55 గ్రహణ అంత్యకాలం : మ . 1.44 గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 30 నిమిషాలు *ఆంధ్ర రాష్ట్రానికి* గ్రహణ ఆరంభకాలం : ఉ . 10.23 గ్రహణ మధ్యకాలం : మ .12.05 గ్రహణ అంత్యకాలం : మ . 1.51 గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 28 నిమిషాలు *గ్రహణ నియమాలు* గ్రహణం రోజు అనగా 21-06-2020 ఆదివారం నాడు ఉదయం 6 గంటల వరకు సామాన్య మానవులు అందరూ అన్నపానాదులు ముగించాలి. వృద్ధులు, చిన్నపిల్లలు,...