శ్రీ అమర లింగేశ్వరస్వామి

గుంటూరు జిల్లా గురజాల  కు 6 కి.మీ దూరం లో ఉన్న దైద గ్రామం లోని మహిమాన్వత శ్రీ అమర లింగేశ్వరస్వామి ఆలయం చరిత్ర:
సుందర అడవి ప్రాంతం,పవిత్ర కృష్ణానది తీరంలో ఈ ఆలయ పరిసర ప్రాంతం మనోహరంగా ఉంటుంది.ఈ దేవాలయం వెలుగులోకి వచ్చి 120 సం;అయినను కొన్నివందల సం; క్రితమే ఇక్కడశివుడు స్యయంభూ గా శివలింగం రూపంలో ఒక కొండ బిలంలో వెలిసినట్లు చారిత్రక కధనాలు ఉన్నాయిఈ ప్రశాంత వాతావరణంలో సిద్దులు,ఋషులు,దివ్యపురుషులు ఇక్కడకు వచ్చి శివున్ని ఆరాధించేవారు. ఈ అడవి ప్రాంతంలో దైద,తేలుకుట్ల,గొట్టిముక్కల కి చెందిన పశువుల కాపరులు తమ పశువులను మేత కు తీసుకెళ్లేవారు.ఒకరోజు ఇప్పుడున్న దేవాలయ కొండ ప్రాంతంలో పశువులు మేపుతుండగాఓం నమశివాయ: అంటూ శబ్దం వినిపించింది.
పశువుల కాపరులు కొండ వద్దకు వెళ్లి కొండ చుట్టూ శబ్దం వచ్చిన వైపు వెళ్లగా ఒక బండ రాయి నుండి శబ్దం వస్తున్నట్లు గ్రహించి,ఆ రాయి ని తొలగించగా కొండ లోపలికి ఒక సొరంగ మార్గం కనిపించింది. పశువుల కాపరులు ఆ బిలంగుండా అతి కష్టమయిన ఇరుకు దారిలో వెళ్లి చూడగా ఒక అధ్బుత దృశ్యం గోచరించింది. అక్కడ ఒక శివలింగం నకు కొందరు పెద్ద గడ్డాలతో ఉన్న ఋషులు ఉన్న అభిషేకం చేస్తూ,శివ స్తోత్రం చేస్తున్నారు.లకు వారి దగ్గరకు వెళ్లేందుకు దైర్యం చాలక వెనుకకు వచ్చి దగ్గరలో పొలంలోపని చేస్తున్న కొందరికి చెప్పగా,వారు చూద్ద్దాం పదండి అంటూ పశువుల కాపరులు తో కలసి ఆప్రాంతంకు వచ్చారు.
అందరు లోపలికి పోయి చూడగా అక్కడ ఋషులు కనపడలేదు,కాని శివలింగం కు పూజ చేసిన ఆనవ్వాళ్లు కనిపించాయి,అంతట వారు తన్మయత్వంతో శివలింగం కి పూజ చేసి బయటకు వచ్చి ఈ అద్బుత విషయం ప్రజలందరికి తెలియచేసారు.అక్కడకు వెళ్లి చూసిన ఆయా గ్రామ ప్రజలు కీకారణ్యంలో కొండలో గుహ లో శివలింగం వెలసిన తీరు చూసి భక్తి పారవశులయి పూజలు చేయ ప్రారంభించారు.దేవతలు అంటే అమరులు ఆరాధించిన శివలింగం కాబట్టి అమర లింగేశ్వరస్వామి గాపేరు వచ్చినట్లు చెపుతారు.
ఈ కొండ బిలం చూసిన ప్రతి వారు ఆశ్ఛర్యం పొందుతారు.ఇదంతా ఆ శివుని లీల అని భావిస్తారు.అప్పటి నుంచి ఈ దేవాలయం కు భక్తులు సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రతి సోమవారం ఇక్కడ కు భక్తులు వచ్చి పొంగళ్లు పెట్టి శివున్ని ఆరాదించి ఇక్కడే నిద్ర చేస్తారు.అలా చేస్తే వారి కోరికలు తీరతాయని నమ్మకం.సంతానం లేనివారు,రోగగ్రస్తులు ఈ స్వామి దర్శిస్తే సంతానం కలుగుతుం దని,,అలగే రోగాలు నయమవుతాని భక్తులు తమ ప్రత్యక్ష అనుభవాలు చెపుతారు.
ఒకప్పుడు ఈ ప్రాంతానికి సరైన రవాణా మార్గంలే దు కాలి నడక గుండా నే అరణ్య మార్గాన వెళ్లాలి. అయినను భక్తులు అధిక సంఖ్యలో వచ్చేవారు,నేడు కొంత వరకు ప్రయాణ సౌకర్యం బాగానే ఉంది.ఆటోలు,కారు లు వెళ్ళవచ్చు. పవిత్ర కృష్ణానది లో స్నాన మాచరించి, తడి బట్టలతో నే బిలంలో కి ప్రవేశించిశివలింగం ను ఆరాదిస్తారు.ఈ బిలంలోకి జట్టు,జట్టులుగా లోపలికి వెల్తారు.ఎందుకంటే ఈ బిలంలో అనేక మార్గాలు ఉన్నవి.తప్పిపోయే ప్రమాదం ఉంది.
ఈ బిలం నుంది ఎత్తిపోతల,కాశీ,త్రిపురాంతకం లకు కూడాసొరంగం నుండి మార్గాలు ఉన్నట్లు పెద్దలు చెపుతారు.ముందు ఒకతను దారి చూపిస్తూ భక్తులను బిలంలోకి తీసుకెళ్లతాడు.ఒకప్పుడు విధ్యుత్ సొకర్యం కూడా ఈ బిలంలో లేదు.అర చేతిలో దీపం వెలిగించుకునిఆ వెలుతురులో వెళ్లేవారు.ప్రస్తుతం బిలంలో విద్యుత్ సౌకర్యం కలదు.ఒక మనిషి మాత్రమే వెల్లేందుకు సన్నని మార్గంఉంటుంది.ఒకరి వెనుక ఒకరు వెళ్లాలి.కొన్ని చోట్ల ఒంగుతూ,మోకాళ్ల పైన కూడా లోపలికివెళ్లాలి.బిలంలో అనేక మార్గాలు కనిపిస్తాయి,ముందు తెలిసిన వారు వెళుతుండే వారి వెనుక అనుసరించాలి. శివలింగం ఉన్న ప్రదేశం మాత్రం 10 మంది కూర్చుని అభిషేకం చేసుకునేలా ఏర్పాటు అయి ఉంది. ఆ ప్రాంతం పంచాముఖాకృతి లో వాస్తు రీతిలో ఉంటుంది.శివునికి ఇక్కడ ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు.
11 రుద్రాక్షలతో పూజ చాలా ఇష్టం అందుకే నేమో శివలింగం ఏర్పడిన ప్రాంతం 11 రాళ్లతో కలసిఏర్పడింది.ఇదంతా ఆ శివుని లీల గా భక్తులు భావిస్తారు.ఈ అద్బుత ప్రాంతం చూసి తన్మయత్వం పొందని వారు ఉండరు.మాఘమాస,కార్తీక మాసంలొ,శివరాత్రి సమయంలో ఇక్కడకు దేవతలు,ఋషులు సూక్ష్మ రూపంలో తెల్లవారు జామున వచ్చి పూజలు చేస్తారని పెద్దలు,మరియు ఇక్కడ చేసిన పూజారులు చెపుతారు అభిషేకాలు పూజలు చేసి బిలం మూసి వేసి,మరుసటి రోజు వచ్చి చూస్తేవారు చేసిన పూజా విధానం కాక వేరే వస్తువులు తో చేసిన పూజలు,అప్పుడే అభిషేకం చేసినట్లు నీటి చాయలు,మరియు అతి సువాసనలు వెదజల్లే పరిమళాలు కలిగి ఉంటుందట.
అతి మహినాన్విత ఈ దేవాలయం చూడని వారు సందర్శించండి.కోరిన కోర్కెలు తీర్చుతాడని సందర్శించిన వారు చెపుతారు.బిలంలోనే ఒక పక్క పార్వతి అమ్మగారి ప్రతిమ భక్తి భావం ఇంకా పెంచుతుం ది. ప్ర కృతి ప్రేమికులకు ఈ ప్రాంతం చూస్తే ముగ్దులవుతారు.రాత్రి వేళ ఇక్కడ నిద్ర చేసే భక్తుల ను ఆశీర్వదించటానికి ఇక్కడ శివుడు సంచరిస్తు ఉంటారని పెద్దలు చెపుతారు. మనోహర్ అడవి ప్రాంతం,పరవళ్లు తొక్కే నీరు,ప్రశాంత వాతావరణం కనులు విందు చేస్తుంది. ఒకప్పుడు బిలంలోకి పోవటానికి,రావటానికి ఒకే మార్గం ఒకే మార్గం ఉండేది,కాల క్రమేణా మరోదారి కనిపించగా బండ రాయి తొలగించగా మరో మార్గం కనిపించదట,అప్పుటి నుండి ఈ మార్గం గుండా భక్తులు బయటకు వస్తారు.
ఈ ఆలయ పరిసరల్లో భక్తులుకు ఎన్నో వింతలు,విశేషాలు జరిగాయి, సంఘటనలు ఈ ఆలయ పరిసరాల్లో జరిగాయి..ఇలాంటి మహిమాన్విత దేవాలయం మన పల్నాడు లో ఉండటం మన అదృష్టం. ఈదేవాలయానికిశివరాత్రి,కార్తీక మాసాలల్లో అధికంగా భక్తులు వస్తారు. ప్రతి సోమవారం ఈ దేవాలయ ప్రాంగణంలో నిద్ర చేసే భక్తుల భజనలు,ఓం ననశివాయ: అంటూ చేసే ప్రార్ధనలు ఆలయ ప్రాంగణంలో మారుమ్రోగుతూ ఉంటాయి శ్రీ అమర లింగేశ్వరస్వామి ఆశీస్సులు అందరి పై ఉండాలి.

Comments

Popular posts from this blog

Ananda Nilayam/ ఆనంద నిలయం /आनंद निलयम

బీజాక్షర సంకేతములు/ Meaning of Bheejaksharas