మంత్ర శక్తి- బీజాక్షరాలు - విశ్లేషణ

*మంత్ర శక్తి- బీజాక్షరాలు - విశ్లేషణ :*

మనస్సును ప్రక్షాళన చేసి, నిర్మలత్వాన్ని ప్రసాదించేది మంత్రం. మంత్రంలో ‘మ’ కారం అంటే మననం. ‘త్రం’ అంటే రక్షించేది. కొన్ని అక్షరాలా ప్రత్యేక ఉచ్చారణే  మంత్రం. ఈ మంత్రం దైవాధీనమై ఉంటుంది. అత్యంత శక్తివంతమైన బీజాక్షరాలే మంత్రాలు. మాట మంత్ర శక్తిగా పని చేయాలంటే ధృడమైన మానసిక ఏకాగ్రత ఉండాలి. ప్రతి మంత్రానికి అధిష్టాన దేవతను వర్ణించే ధ్యాన శ్లోకం ఉంటుంది.మంత్రాలు రెండు రకాలు......1..  దీర్ఘ  మంత్రాలు, 2.. హ్రస్వ మంత్రాలు.

*హ్రస్వ మంత్రాలు:* సాధారణంగా బీజ మంత్రం అనబడే హ్రస్వ బీజాలే ఎక్కువగా ఉంటాయి. హుమ్, శ్రీమ్ వంటివి మూల శబ్దాలుగా పిలవబడే ఈ మంత్రాలనుండే సంస్కృత భాష ఉద్భవించింది.

*దీర్ఘ  మంత్రాలు:* గాన రూపంలో కొన్ని పాదాలతో కూడుకొని ఉంటాయి. గాయత్రి మంత్రం అటువంటిదే. గాయత్రి మంత్రం 3 పాదాలతో 24 అక్షరాలతో, 24 ఛందస్సులతో, 24 తత్వాలకు సంకేతంగా చెప్పబడుతుంది.మంత్రానికి బీజాక్షరాలు ప్రాణప్రదాలు. ప్రతి మంత్రాన్ని ఒక ఋషి, ఛందస్సు, దేవత, బీజం, శక్తి, కీలకం ,అంగన్యాసం, కరన్యాసములనే సప్త అంగములతో క్రమం తప్పకుండా ధ్యానించాలి.

    మంత్రాలకు ఆధారమైన ప్రణవ మంత్రం “ఓం” అన్నిటికంటే ముఖ్యం.   మంత్ర శాస్త్రాన్ని గురువు వద్దనే నేర్వాలి. మంత్రోచ్ఛారణ లో కూడా స్వరం ప్రధానం.  మంత్రం, తంత్రము, యంత్రములను త్రిపుటి అంటారు. మంత్రం వల్ల దైవదర్శనం, తంత్రం వల్ల దైవ సాన్నిధ్యం, యంత్రం వల్ల దైవ శక్తి కలుగును. మంత్రానుష్టానంలో... అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ చేస్తే మేలు జరగకపోగా కీడు జరుగుతుంది. మంత్రం వినాశనమునకు కారణం కాకూడదు. మంత్రముతో పుష్పాలు పూయించవచ్చు. ప్రాణాలు నిలుపవచ్చును. ప్రాణాలు తీయవచ్చు. సూక్ష్మంలో “ఓం” కారంతో మొదలయ్యే మంత్రం అతి శక్తి వంతమైనది. “ఓం” కారం అనగానే దేవతా మండలానికి సంకేతం వెళుతుంది. “శ్రీమ్” అనగానే లక్ష్మీదేవికి, “హ్రీమ్” అనగానే పరాశక్తికి ప్రచోదనమ్ చేస్తుంది. మంత్ర నిర్మాణంలో బీజాక్షరాల ఎంపిక, కలయిక వరుస అనేవి ప్రధానమైనవి. లక్ష్మిని దానం కోసం, సరస్వతిని విద్య కోసం, కాళిని నిశ్చయ సంకల్పం కోసం, కార్తవీర్యార్జునికి పోయిన వస్తువులు దొరుకుట కొరకు ఉపాసిస్తే ఫలితం ఉంటుంది.

Comments

Popular posts from this blog

Ananda Nilayam/ ఆనంద నిలయం /आनंद निलयम

బీజాక్షర సంకేతములు/ Meaning of Bheejaksharas