కాలభైరవస్వామి జన్మదినం.
🌸
ఈరోజు
కాలభైరవస్వామి జన్మదినం.
🌸
కాలభైరవాష్టమికి సంబంధించి
శివపురాణంలో ఆసక్తికరమైన
పురాణగాధ వుంది.
ఒకప్పుడు
ఋషులకు త్రిమూర్తులలో
ఎవరు అసలు బ్రహ్మము అని
సందేహం వచ్చింది.
ఆ సందేహమును తీర్చమని
ఋషులందరు కలసి
త్రిమూర్తులనే అడిగారు.
శంకరుడికి
సద్యోజాత,
అఘోర,
తత్పురుష,
ఈశాన,
వామదేవ
అను అయిదు
ముఖములు ఉంటాయి.
ఈ అయిదు ముఖములతో
ఋషుల వంక చూస్తూ...
బ్రహ్మము ఎవరని
అడుగుతారేమిటి?
నేనే బ్రహ్మమును
అని పరమశివుడు
అన్నాడు.
అపుడు,
బ్రహ్మ దేవుడు
నేనే ఈ లోకములన్నిటిని సృష్టించాను,
నేనే నీ పుట్టుకకు కర్తను.
నేనే ఈ సమస్త లోకములను
ప్రవర్తింపచేశాను.
నేనే వీటిని సంహారం చేస్తాను.
నేనెప్పుడూ బతికే ఉంటాను.
కాబట్టి,
నాకన్నా బ్రహ్మము ఎవరూ లేరు.
నేనే బ్రహ్మమును’ అన్నాడు.
తరువాత,
ప్రక్కనే వున్న విష్ణువు
బ్రహ్మాతో..
అసలు నీవు పుట్టింది
నా నాభి కమలంలోంచి కదా,
కావున నేనే బ్రహ్మమును అన్నాడు.
ముగ్గురికీ ఈ విషయంలో
జగడం వచ్చింది.
మనకి స్మృతులే ప్రమాణం కదా!
అందుకని వేదాలని పిలుద్దాం
అని వేదాలని పిలిచారు.
అపుడు,
ఋగ్వేదం ఈ సమస్తమునకు
సృష్టికర్త ,
ఏ మహానుభావుడు
సంకల్పం వలన
మొట్టమొదట
నారాయణుడు
జన్మించాడో,
ఎవడు చిట్టచివర
ఈ లోకములని
తనలోకి తీసుకుంటున్నాడో ,
అటువంటి ఆ పరమశివుడే
పరబ్రహ్మము అంది.
ఋగ్వేదం చెప్పిన మాటను
తీసి పారేసి,
యజుర్వేదమును పిలిచారు.
అసురీశక్తులు పోయి
ఈశ్వరీ శక్తులు రావడానికి
జ్ఞానమును మహేశ్వరుడే ఇస్తాడు.
కాబట్టి,
జ్ఞాన యజ్ఞమునందు
ఆరాధింప బడుతున్నవాడు
పరమశివుడే పరబ్రహ్మము
అని చెప్పింది.
ఆ తరువాత,
సామవేదమును
కూడా పిలిచి అడిగారు..
మూడు కన్నులున్న వారెవరు
ఉన్నారో,
ఎవరు ఈ లోకమునంతటినీ
తిప్పుతున్నారో,
ఆ తిప్పుతున్న వారిని,
ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో,
ఏ యోగులకి ఉపాసన చేత
జ్ఞానమునందు తెలియబడుతున్నాడో,
ఎవడు తనలో తాను రమిస్తూ ఉంటాడో,
అటువంటి శివుడే
పరబ్రహ్మము అని చెప్పింది.
పిమ్మట,
అధర్వణ వేదము చెబుతూ,
ఏ మహానుభావుడిని
భక్తులందరూ
సంసార సముద్రమును దాటి
దుఃఖమును పోగొట్టుకుని
ఆనందమును తెలుసుకోవడానికి
ఉపాసన చేస్తున్నారో ,
అటువంటి పరమశివుడే
పరబ్రహ్మము అని చెప్పింది.
అంటే,
సృష్టి చేసింది మనం కాదు,
నిలబెట్టింది మనం కాదు,
వేరొకడున్నాడు.
తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం.
నాలుగు వేదములు అదే చెప్తున్నాయి.
చివరిగా,
ప్రణవాన్ని పిలిచారు.
అపుడు ప్రణవం ఎవడు
నిరంతరమూ శక్తి స్వరూపముతో
క్రీడిస్తూ ఉంటాడో,
శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో,
శక్తీశ్వరులై వారున్నారో,
అటువంటి శక్తీశ్వరుడై
శక్తి ఆయనతో,
ఆయన శక్తితో
విడివడకుండా కలిసి
ఉంటారో,
అటువంటి పార్వతీ
పరమేశ్వరులు,
పార్వతి వామార్థ భాగమునందు
ఉన్న శంకరుడే పరబ్రహ్మము
అని చెప్పింది.
ప్రణవం చెప్పిన మాటను కూడా
విష్ణు బ్రహ్మలు అంగీకరించలేదు.
ఈమాటలు రుచించకపోతే ఇప్పుడు ఈశ్వరుడు
దండించవలసి ఉంటుంది.
కాబట్టి,
ఈశ్వరుడు అంతటా నిండిన
పరబ్రహ్మము జ్యోతిగా మారాడు
జ్యోతి సాకారం అయింది.
సాకారమును చూసినప్పుడు
విష్ణువు శివుడే గొప్ప అని
ఊరుకున్నాడు.
కానీ బ్రహ్మ నీవు ఎవరు?
నువ్వు నా రెండు కనుబొమల
మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు.
నన్ను స్తోత్రం చెయ్యి అన్నాడు.
బ్రహ్మలో మార్పు రాలేదు.
ఆయన దండింపబడాలి.
కాబట్టి ఇపుడు ఆ జ్యోతి
ఘోర రూపమును పొందింది.
ఏమి నీ ఆజ్ఞ అని
మొదటి రూపమును అడిగాడు.
బ్రహ్మ అహంకారంతో మాట్లాడుతూ,
పరమశివుడి
అయిదవ తలను గిల్లెయ్యి’ అన్నాడు
ఇప్పుడు,
ఈ జ్యోతిస్వరూపం
ప్రచండ రూపమును పొందింది.
దిగంబరమై రూపంతో,
బ్రహ్మ దేవుని అయిదవ తలను
తన గోటితో గిల్లేసింది.
ఆ జ్యోతి స్వరూపమే
కాలభైరవ స్వరూపం.
🌸
ఇలా జరిగేసరికి,
బ్రహ్మ దేవుడు భయపడిపోయి
నాలుగు తలకాయలు బట్టుకు వెళ్లి
అమ్మవారి చేతుల క్రింద పెట్టేసి
ఈశ్వరా,
నేను చేసిన పొరపాటును
మన్నించి ఉదారుడవై
నన్ను కాపాడుము అన్నాడు.
అపుడు శంకరుడు
జ్యోతి స్వరూపంతో
నీవు అచ్చం కాలము వలె
ప్రకాశించుచున్నావు.
కాలము ఎలా వెళ్ళిపోతూ
ఉంటుందో అలాగే ఉంది నీ నడక.
నీ నడకతోనే
బ్రహ్మ తల తెగిపోయింది.
కాబట్టి,
నిన్ను ఇవాళ్టి నుంచి
కాలభైరవ అని పిలుస్తారని
నామకరణం చేస్తాడు.
కాలభైరవా!
నీవు ఎంత గొప్ప వాడవయినా
బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి,
నీకు బ్రహ్మహత్యాపాతకం
అంటుకుంది.
ఈ అయిదవ తలకాయ పుర్రెను
చేతిలో పట్టుకుని
పన్నెండు సంవత్సరములు
భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను.
అపుడు నీ బ్రహ్మహత్యాపాతకం
పోతుందని పరమేశ్వరుడే
చెబుతాడు.
బ్రహ్మహత్యాపాతకమును
తొలగించుకునేందుకు
బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి
అనేక క్షేత్రాలలో పర్యటించినా
తనకు సోకిన ఈ
బ్రహ్మహత్యాపాతకము
తొలగకపోవడంతో కాలభైరవుడు
శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు.
కాలభైరవుడి ప్రార్థన విన్న
శ్రీ మహావిష్ణువు
కాలభైరవా!
నీవు శివుడి పుత్రుడవు
కనుక,
శివుడితో సమానుడవు.
బ్రహ్మ దేవుడి గర్వమును
అణుచుటకే జనించినవాడవు.
నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా
ఉపయోగం లేదు.
కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు.
కాశీ క్షేత్రంలో అడుగుపెట్టినంతనే
నీ బ్రహ్మ హత్యాపాతకం
భస్మమైపోతుంది అని
సలహాయిచ్చాడు.
దీనితో,
కాలభైరవుడు కాశీ నగరానికి
చేరుకోవడంతోనే బ్రహ్మహత్యాపాతకం తొలగిపోగా,
బ్రహ్మకపాలాన్నీ కాశీలో
పూడ్చిపెట్టాడు.
బ్రహ్మకపాలం
పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన
తీర్థమే - నేటి కాశీ క్షేత్రంలోని
కపాల మోక్షతీర్థం.
కాశిలో,
కాలభైరవుడు
విశ్వనాథ లింగాన్ని భక్తితో
పూజించి తరించాండు.
విశ్వనాధుడు కాల భైరవుని
భక్తికి మెచ్చి కొన్ని వరాలు
ఇచ్ఛాడు.
కాలభైరవా!!
ఎవడు ఈశ్వరుని ధిక్కరించి
బ్రతుకుతాడో వాడి
ప్రాణోత్క్రమణము అవగానే
నువ్వే కనపడతావు.
దీనిని ‘భైరవ యాతన’ అంటారు.
అప్పుడు జీవుడు నిన్ను చూసి
హడలిపోతాడు.
కానీ,
ఎవరు నీ చరిత్ర గురించి వింటారో,
శివాలయమునకు వచ్చినపుడు
ఎవరు కాలభైరవుడి యందు
శిరస్సు వంచి నమస్కరిస్తారో
వాళ్ళ పాపమును నీవే తీసెయ్యి.
అలా తీసేసే శక్తిని
నేను నీకు ఇస్తున్నాను.
కాబట్టి,
నిన్ను ‘అమర్దకుడు’ అని కూడా పిలుస్తారు.
ఇకనుంచి,
నీవే నా దేవాలయములలో
క్షేత్ర పాలకుడవయి ఉంటావు.
భక్తుల పాపములను
నీవు తీసిన వాటిని
నువ్వు తినేయ్యి.
నువ్వు భక్తుల పాపములను
తినేసి వాళ్ళను రక్షిస్తావు.
కాబట్టి,
నీకు ‘పాప భక్షకుడు’ అనే
పేరును కూడా ఇస్తున్నాను.
నిన్ను కాశీ క్షేత్రమునకు
అధిపతిగా ఉంచుతున్నాను.
నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే
కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు అని
పరమేశ్వరుడు చెప్పాడు.
అందుకే,
మనను కాశీక్షేత్రంలోని
కాలభైరవుడు ఆ క్షేత్రప్రవేశానికి
అనుమతించిన క్షేత్రపాలకుడు.
కనుక,
అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపములను
దగ్ధం చేశావు కాలభైరవా’ అని
ఆ మహానుభావుడి వద్ద నుండి
ఇంటికి రాగానే కృతజ్ఞతా
పూర్వకంగా కాలభైరవ పూజ
అని చేసి,
ఇకనుంచి మంచి పనులు
చేస్తామని అని అన్నసంతర్పణ చేస్తారు.
భైరవమూర్తి ప్రసన్నమూర్తి
అయినాడని చెప్పడానికే
ఆయన మెడలో ఒక గారెలదండ వేస్తారు.
కాశీ నుండి వచ్చిన వారు
సంతర్పణ చేస్తే తప్పకుండా
పిలువ కున్నా వెళ్లి
ఆ ప్రసాదమును ప్రతీ వారు తీసుకోవాలి.
ఇహలోకమునందు
ఇప్పటివరకు ఈశ్వరుడి పట్ల
తాము చేసిన దూషణల
పాప ఫలితము ఎలా పోతుందని
బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం
భైరవ యాతన ఇక్కడే తేలికగా
అనుభవింప చేస్తాడు.
హరిద్వార్, ఋషికేశ్
క్షేత్రాలకు వెళ్ళిన వాళ్ళు
మానసా దేవి ఆలయమునకు
వెళ్లి బయటకు వచ్చేటప్పుడు
ఒకసారి ఒంగోండి అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు.
అదే భైరవ యాతన.
అని ఆ కర్ర ఠప్ అనికొట్టగానే
అక్కడితో పాపాలు పోతాయి.
ఈవిధంగా,
ఆ నాడు పరమేశ్వరుడు
కాలభైరవుడికి ఇన్ని వరములను
గుప్పించాడు.
ఆ మూర్తే ఇప్పటికీ మనకి
ప్రతి శివాలయంలో ఆయన
ఈశ్వర ఆజ్ఞను ఔదలదాల్చి
వచ్చినవాడు
కనుక ఆ మహానుభావుడు
కాలభైరవ స్వరూపంతో ఉంటాడు.
కాల బైరవుడు
భక్తుల పాలిట కొంగుబంగారం.
ఎవడు ఈశ్వర ధిక్కారం
చేస్తాడో వారి పాలిట
భైరవ దర్శనంగా భయంకరంగా
కనపడతాడు.
కాబట్టి,
ఆ కాలభైరవ స్వరూపం
అంత గొప్పది.
మేము కాశీ వెళ్ళాము,
మాకు,మా ఇంట ఏ భయమూ
లేదు అని చెప్పడానికి
ఒక నల్లతాడును రక్షగా కూడా
కట్టుకుంటారు.
కాబట్టి,
ఇన్ని రూపములుగా
ఆ కాలభైరవ స్వరూపం
ఆనాడు ఆవిష్కరింపబడింది.
ఎవరైతే,
ఈ కాలభైరవ స్వరూపమును
గురించి వింటున్నారో,
భక్తితో ప్రణమిల్లుతున్నారో,
మానస్ఫూర్తిగా నమస్కరిస్తున్నారో
అటువంటి వారు
శివానుగ్రహాన్ని పొందుతారు.
కాలభైరవుడు అటువంటి
వాళ్ళని ఇబ్బంది పెట్టడు.
వాళ్ళు ఎప్పుడూ ఎంతో
సంతోషంగా, సుఖంగా ఉంటారు.
🌸
కాలభైరవాష్టకం
🌸
దేవ రాజ సేవ్య మాన
పావనాంఘ్రి పంకజం
వ్యాల యజ్ఞ సూత్ర
మిందు శేఖరం కృపాకరమ్
నారదాది యోగిబృంద
వందితం దిగంబరం
కాశికాపురాధి నాథ
కాలభైరవం భజే !
🌸
భాను కోటి భాస్వరం
భవాబ్ధి తారకం పరం
నీల కంఠ మీప్సితార్థ
దాయకం త్రిలోచనమ్
కాల కాల మంబుజాక్ష
మక్ష శూల మక్షరం
కాశికాపురాధి నాథ
కాలభైరవం భజే !
🌸
శూలటంక పాశదండ
పాణిమాది కారణం
శ్యామ కాయ మాది దేవ
మక్షరం నిరామయమ్
భీమవిక్రమం ప్రభుం
విచిత్ర తాండవప్రియం
కాశికాపురాధి నాథ
కాలభైరవం భజే !
🌸
భుక్తి ముక్తి దాయకం
ప్రశస్త చారు విగ్రహం
భక్తవత్సలం స్థితం
సమస్త లోక విగ్రహమ్
నిక్వణన్మనోజ్ఞ హేమ
కింకిణీలసత్కటిం
కాశికాపురాధి నాథ
కాలభైరవం భజే !
🌸
ధర్మ సేతు పాలకం
త్వధర్మ మార్గ నాశకం
కర్మ పాశ మోచకం
సుశర్మ దాయకం విభుమ్
స్వర్ణవర్ణ కేశపాశ
శోభితాంగ మండలం
కాశికాపురాధి నాథ
కాలభైరవం భజే !
🌸
రత్న పాదుకాప్రభాభిరామ
పాద యుగ్మకం
నిత్య మద్వితీయ
మిష్టదైవతం నిరంజనమ్
మృత్యుదర్పనాశన
కరాలదంష్ట్రభూషణం
కాశికాపురాధి నాథ
కాలభైరవం భజే !
🌸
అట్టహాస భిన్న పద్మజాండ
కోశ సంతతిం
దృష్టిపాతనష్ట
పాపజాలముగ్రశాసనమ్
అష్టసిద్ధి దాయకం
కపాలమాలికా ధరం
కాశికాపురాధి నాథ
కాలభైరవం భజే !
🌸
భూతసంఘ నాయకం
విశాలకీర్తి దాయకం
కాశివాసి లోక పుణ్యపాప
శోధకం విభుమ్
నీతిమార్గ కోవిదం
పురాతనం జగత్పతిం
కాశికాపురాధి నాథ
కాలభైరవం భజే !
🌸
కాలభైరవాష్టకం పఠంతి
యే మనోహరం
జ్ఞానముక్తి సాధకం విచిత్ర
పుణ్య వర్ధనమ్
శోక మోహ దైన్యలోభ
కోపతాప నాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి
సన్నిధిం ధ్రువమ్ !
🌸
కాశికాపురాధి నాథ
కాల భైరవం భజే
🌸
కాశికాపురాధి నాథ
కాల భైరవం భజే
🌸
కాల భైరవం భజే
🌸
కాల భైరవం భజే
🌸
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం
కాలభైరవాష్టకం సంపూర్ణమ్
🌸
మీ
నాగమల్ల విశ్వప్రసాద్
ప్రొద్దుటూరు .. కడపజిల్లా
9676243399 .. 9676253399
🌞🌏🌙
Comments
Post a Comment