సుందరకాండ లఘుపారాయణ - Sunderakanda Song
సుందరమైనది సుందరకాండ సుందర మెంతో సుందరము..| మారుతి విజయం మరి మరి వినగా మనసే పరవశ మొందెనుగా|| సుగ్రీవుండను వానర రాజు శ్రీరాముని ప్రియ మిత్రుండు | సీతను వేడుకగా నలుదిక్కులకు వానర సేనను పంపెనుగా||1|| నలుడు నీలుడు జాంబవంతుడు జాతి సుతుడగు అంగడు..| హనుమంతుడు.. వెంటరాగా దక్షిణ దిక్కుగా పయనించే ||2|| శత యోజనముల విస్తీర్ణముగల సంద్రము నెట్టుల దాటుదము| జానకి నెట్టుల చూచెద మనుచు దుఃఖము నొందిరి కపివరులు||3|| అతి భీకరమగు సంద్రము దాటగ అంజని సుతునికి తగుననుచు| ఉత్సాహంబును కలుగ జేసిరి హనుమను అందరు కీర్తించి ||4|| ||సుందర|| ఆంజనేయుడు మహేంద్రగిరిని కరచరణంబుల మర్ధించి| దేహము పెంచి అతివేగంబున ఆకా...