Posts

Showing posts from September, 2022

Bhagyanagaram Temples

అడపాదడపా తిరుపతి, కాశీ, అరుణాచలం వంటి తీర్థయాత్రలు చేసే మనం, మన ఊళ్ళోనే మన భాగ్యనగరంలోనే  గొప్ప ప్రాచీన దేవాలయాలూ, ఎంతో ప్రాశస్థ్యాన్ని కలిగి పురాణ కథలతో కూడుకున్న ఆలాయాలున్నాయంటే ఒకింత ఆశ్చర్యం వేస్తుంది. హైదరాబాద్ లో మనకి తెలిసిన ఆలయాల వెనుక మనకి తెలియని కథలు ఎన్నో ఉన్నాయి.  అందులో కొన్ని కథలు.. 1) కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయస్వామి వారి ఆలయం. 1143 వ సంవత్సరంలో రెండవ ప్రతాపరుద్రుడనే కాకతీయ రాజు ఓ పులి గాండ్రింపు విని వేటాడుతూ ఈ ప్రాంతంలో కి రాగా, ఓ చెట్ల పొదల్లోంచి 'రాం' 'రాం' అని వినపడిందట. సైనికుల సహాయంతో అక్కడ వెతకగా హనుమత్ రూపం చెక్కబడిన రాయి కనబడిందిట. ఆయన యధాశక్తి పూజాదికాలు కావించి తన కోటకు మరలి వెళ్ళాడు. ఓ రాత్రి ఆంజనేయస్వామి కలలో కనపడి తనకి ఆలయం కట్టించాల్సిందిగా ఆదేశిస్తే ఆయన ఇక్క పెద్ద ఆలయం కట్టించినట్టు చరిత్రకారులు చెప్తారు. 17వ శతాబ్ధంలో ఔరంగజేబు దుర్మార్గంగా ఎన్నో దేవాలయాలు ధ్వంసం చేయించాడు.  ఈ ఆలయ ప్రాంతానికి వచ్చిన అతని సైనికులు గుడి కూలగొట్టడానికి పూనుకోగా చెవులు చిల్లులు పడేంత పెద్ద ధ్వని వినపడిందట. ఆ వింతవిని ఔరంగజేబే స్వయంగా ఇక్కడికి రాగా "నా గుడి...