Posts

Showing posts from 2022

SHIRIDI SAI BHAJAN|SUNDERA VADANA SAIEESHA|DEVOTIONAL|SRIVANI GORANTLA|

Image

KOEL SONG|GUNNAMAMIDI KOMMA UYALA|SONG OF NATURE|SRIVANI GORANTLA|T PADM...

Image

SAI BHAJAN|SAI NAM|SAI NAMAMMRUTAM|DIVYA NAMAM|DEVOTIONAL|SAI BHAJAN|SRI...

Image

SAI MAHIMA|MAMA HRUDAYAVASI SAI|SAI BHAJAN|SAI GEET|SRIVANI GORANTLA|DEV...

Image

Bhagyanagaram Temples

అడపాదడపా తిరుపతి, కాశీ, అరుణాచలం వంటి తీర్థయాత్రలు చేసే మనం, మన ఊళ్ళోనే మన భాగ్యనగరంలోనే  గొప్ప ప్రాచీన దేవాలయాలూ, ఎంతో ప్రాశస్థ్యాన్ని కలిగి పురాణ కథలతో కూడుకున్న ఆలాయాలున్నాయంటే ఒకింత ఆశ్చర్యం వేస్తుంది. హైదరాబాద్ లో మనకి తెలిసిన ఆలయాల వెనుక మనకి తెలియని కథలు ఎన్నో ఉన్నాయి.  అందులో కొన్ని కథలు.. 1) కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయస్వామి వారి ఆలయం. 1143 వ సంవత్సరంలో రెండవ ప్రతాపరుద్రుడనే కాకతీయ రాజు ఓ పులి గాండ్రింపు విని వేటాడుతూ ఈ ప్రాంతంలో కి రాగా, ఓ చెట్ల పొదల్లోంచి 'రాం' 'రాం' అని వినపడిందట. సైనికుల సహాయంతో అక్కడ వెతకగా హనుమత్ రూపం చెక్కబడిన రాయి కనబడిందిట. ఆయన యధాశక్తి పూజాదికాలు కావించి తన కోటకు మరలి వెళ్ళాడు. ఓ రాత్రి ఆంజనేయస్వామి కలలో కనపడి తనకి ఆలయం కట్టించాల్సిందిగా ఆదేశిస్తే ఆయన ఇక్క పెద్ద ఆలయం కట్టించినట్టు చరిత్రకారులు చెప్తారు. 17వ శతాబ్ధంలో ఔరంగజేబు దుర్మార్గంగా ఎన్నో దేవాలయాలు ధ్వంసం చేయించాడు.  ఈ ఆలయ ప్రాంతానికి వచ్చిన అతని సైనికులు గుడి కూలగొట్టడానికి పూనుకోగా చెవులు చిల్లులు పడేంత పెద్ద ధ్వని వినపడిందట. ఆ వింతవిని ఔరంగజేబే స్వయంగా ఇక్కడికి రాగా "నా గుడి

Pitru Dosha Pariharam పితృ దోషము నుండి బయటపడే సులువైన పరిష్కారం

*పితృ దోషము నుండి బయటపడే సులువైన పరిష్కారం* పితృ దోషం' ... మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించటానికి మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో ... అలాగే...  తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి. మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది. అలాగే అదే పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే అది తెలుసు కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా గాని వారు చేసిన పాప కర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు -  మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ముఖ్యమైనది ఒక్కటే. అదే " పితృ దోషం " ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం. అందుకే ఈ పోస్టు పెడుతున్నాను. పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది. ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు. వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే. పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని చర్చించుకుందాము... చిన్న

Bride in cane Basket - బుట్టలో పెళ్లికూతురును ఎందుకు కూర్చోబెడతారు..? మేనమామనే ఎందుకు తీసుకొస్తారు..?*

*బుట్టలో పెళ్లికూతురును ఎందుకు కూర్చోబెడతారు..? మేనమామనే ఎందుకు తీసుకొస్తారు..?*   పెళ్లిలో కన్యను గంపలో తెచ్చే ఆచారము కొంత మందికి ఉంటుంది. ఇలా ఎందుకు తేవాలి దీని వెనుక ఉన్న కారణం ఏమిటి ? పెళ్లిలో కన్యను గంపలో మేనమామ ఎందుకు తేవాలి, తెస్తారు? ముందుగా అమ్మాయితో గౌరీ పూజ చేయించి ఆ తరువాత వెదురుతో చేసిన బుట్టలో కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమని మేనమామలు కలిసి ఆ అమ్మాయిని వివాహ వేదిక మీదకి తీసుకొని వస్తారు . బుట్టలో ఎందుకు కూర్చుంటోంది అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది. అవతలి వారి వద్ద భార్యా స్థానాన్ని పొందుతోంది. పత్నీ స్థానాన్ని పొందుతోంది. సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు. సహధర్మచారిణి. ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు. అనగా దైవ రుణం పిత్రు రుణం ఋషి ఋణం తీరవు. అసలు ఆయనకి అభ్యున్నతి లేదు. ఆయనకు ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యం కాదు. ఆయన అభ్యున్నతి అంతా ఎవరిమీద ఆధారపడింది అంటే ఆమె మీదే ఆధారపడింది. ఆయన ఒక యజ్ఞం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆయన కన్యాదానం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆమె లేనినాడు ఆయన ఏమీ చేసుకోలేడు. మరి లక్ష్మియే కదా జీవుడికి! పైగా ఇల్లాలు కాగా