Posts

Showing posts from May, 2021

Midnight Birthday celebration ?

మీరు మీ పుట్టినరోజుని అర్ధరాత్రి 12 గంట లకు జరుపుకుంటున్నారా ??? అయితే తస్మాత్ జాగ్రత్త! ఈ మధ్యకాలం లో సమాజం లో ఓ "వింత పోకడ /సాధనను" మనం గమనిస్తున్నాము.  అదే మిటంటే అర్ధరాత్రి 12 గంటలకు పుట్టినరోజు వేడుకలు, కానీ ఇది ఎంత తప్పో మీకు తెలుసా ? హైందవ గ్రంధాల ప్రకారము ఇది తప్పు! అవును ఈ విధంగాఅర్ధరాత్రి వేడుక ఎంత  తప్పో మీకు తెలియజేసే ప్రయత్నము చేస్తాను  ఈ మధ్య కాలములో నేటి సమాజములో ఎవరిదైనా  పుట్టినరోజు కానీ, పెళ్లిరోజు కానీ మరే ఇతర వేడుకైన గాని రాత్రి 12 గంటలకు జరుపుకోవడం ఫాషన్ గా మారిపోయింది. జనాలు కూడా ఈ విధంగా రాత్రి వేడుకలో కేకులు కోస్తూ సంబరాలు జరుపు కోవడంలో ఆనందాన్ని వెతుకుతున్నారు.  కానీ హైందవ గ్రంధాలూ రాత్రి 12 గంటల సమయమును "నిషిద్ధ " కాలంగా అభివర్ణించాయి.  అవును మధ్య రాత్రి 12 గంటల నుంచి జాము 3 గంటల వరకు హైందవ శాస్త్ర ప్రకారము "నిషిద్ధ గడియలు".  అనగా అర్ధ రాత్రి 12 గంటలు సమయములో జరిగే సంబరాలు మనము నిషిద్ధ కాలములో జరుపుకొంటున్నాము.  కానీ హైందవ గ్రంథల ప్రకారము ఈ నిషిద్ధ సమయములో మానవ నేత్రాలకు కనబడిని ఎన్నో దుష్ట శక్తులు, దెయ్యాలు, రక్త పిశాచాల...