Posts

Showing posts from July, 2020

SRI GOURI ASHTHOTARA NAMAVALI/ శ్రీ గౌరీఅష్టోత్తర నామావళి / श्री गौरी अ...

Image

అమ్మవారికి ఏ తిథి రోజున..ఏ అబిషేకం..ఏ నైవేద్యం.. పెట్టాలి

🌷🙏🙏🌷 పాడ్యమి రోజు.. ఆవు నేయి తో అభిషేకం చేస్తే సకల రోగాలు నివారణ అవుతాయి. విదియ రోజు.. చక్కర తో అభిషేకమ చేస్తే దీర్గాయువు కలుగుతుంది. తదియ రోజు.. ఆవు పాలు తో అభిషేకం చేస్తే ఎలాంటి అకాల మృత్యు దోషాలు తొలిగిపోతాయి. చవితి రోజున.. పిండివంటలు నైవేద్యం పెట్టడం వలన సకల విద్యలు లబిస్తాయి. పంచమి రోజు.. అరటి పళ్ళు నైవేద్యం పెట్టడం వలన మేధస్సు, బుద్ది శక్తి పెరుగుతుంది. షష్టి రోజున.. తేనే తో అమ్మవారిని అభిషేకించి, బ్రహ్మణునికి దానం ఇవటం వలన కాంతి పెరుగుతుంది, యషస్సు పెరుగుతుంది. అష్టమి రోజున.. బెల్లం నీటి తో అభిషేకించి, మంచి బెల్లం ఎవరికయినా దానం ఇవటం వలన అష్ట కష్టాలు అంటారు కదా అలాంటివి అన్నీ తీరిపొతాయి అంటారు. నవమి రోజున.. నైవేద్యం పెట్టడం వలన సకల సౌభాగ్యలు కలుగుతాయి. దశమి రోజున.. నల్ల నువ్వులు తో చేసిన పదార్ధాలు నైవేద్యం పెట్టడం వలన సకల రోగలు పోతాయి అని , దీర్గాయుషు పెరుగుతుంది. వారాలలో ఏ నైవేద్యం..! ఆదివారం రోజు - పాలు సోమవారం - పాయసం మంగళవారం - అరటిపళ్ళు బుధవారం - వెన్న గురువారం - పటికబెల్లం శుక్రవారం - తీపి పదార్ధాలు శనివారం - ఆవు నేయి అమ్మవారికి ఇష్టమయిన అన్నం.💐 పులగం - అన్నం + పెసరపప...

ఏవి చేయకూడదు? ఏవి చేయాలి?

1. గడప ఇవతల నుంచి భిక్షం వేయకూడదు. 2. ఎంత అవసరమైన  కర్పూరాన్ని ఎండాకాలంలో దానమివ్వకూడదు. 3. మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటికి భోజనానికి ఎవర్ని పిలవకూడదు. 4. శుభానికి వెళ్తున్నప్పుడు స్రీలు ముందుండాలి. అశుభానికి స్రీలు వెనక వుండాలి. 5. ఉదయం పూట చేసే దానకార్యాలు ఏవైనా సరే ఎక్కువ ఫలన్నిస్తాయి . 6. అమంగళాలు కోపంలోను , ఆవేశంలోను ఉచ్చారించకూడదు. తదాస్తు దేవతలు ఆ పరిసరాల్లో సంచరిస్తూ వుంటారు. 7. పెరుగును చేతితో చితికి మజ్జిగ చేసే ప్రయత్నం ఎన్నడు చేయకూడదు. 8. పిల్లి ఎదురొస్తే కొన్ని నిముషాలు ఆగి బయలుదేరాలి.కుక్క ఎదురొస్తే నిరభ్యంతరంగా ముందుకు సాగాలి. 9. చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు. 10. పగలు ధనాన్ని సంపాదించాలి. రాత్రి సుఖాలను పొందేందుకు సిద్దపడాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకున్నాం కదా ... కొన్ని నిజాలు చూద్దాం ... అరటిఆకులో భోజనం చేయడానికి/పెట్టడానికి కారణం అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది, వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని  అనేక రకాల పోషకాలు ఈ అరటిఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి ,మరియు పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి...

🕉️ *గణానాం త్వా గణపతి గం..* 🕉️

మహా గణపతి ఆయన వదనం ఓంకారం... ఆయన మాట శ్రీకారం... ఆయన పూర్ణసృష్టికి సంకేతం.  అతి గొప్ప ఆధ్యాత్మికతత్త్వం ఆయనదేనంటూ శాస్త్రాలు, ఉపనిషత్తులు వివరిస్తున్నాయి. గణపతిని పూజించే మంత్రాల్లో అత్యంత ప్రసిద్ధిపొందిన మంత్రం రుగ్వేదం రెండో మండలంలో ఉంది. *ఓం గణానాం త్వా గణపతిగ్‌ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం* *జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన సృణ్వన్నూతిభిస్సీదసాదనం* తాత్పర్యం:  భూత గణములకు అధిపతివి, విద్వాంసులలో విద్వాంసుడవు, పోల్చదగిన కీర్తి శ్రేష్టులకు కూడా నీవే పోలికవు, బ్రహ్మణ్యులలో బ్రహ్మణ్యుడవు, సర్వ జగత్తుకు అధిపతివి (రాజాది రాజువు), అయిన నిన్ను మా కోర్కెలు తీర్చుటకు, మా ప్రార్థన ఆలకించి ఈ పూజా సమయము నందు ఈ స్థానమును లేక ఆసనమును అలంకరించుము. గణపతిని రాజుల్లో పెద్దవాడుగా, దేవతల్లో పూజలందుకునే మొదటివాడుగా, 33 కోట్ల దేవతాగణాలకు అధినాయకుడిగా వర్ణిస్తుంది రుగ్వేదం. గణాలకు నాయకుడిగా గణపతిని చెబుతోందే కానీ గజముఖ స్వరూపం గురించి ఈ వేదంలో కనిపించదు. పునరావృతం అవుతున్న ఈ స్తోత్రం వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. మధుర భక్తి రస గానం : *శ్రీ ప్రకాష్ కౌశిక్

Amarnath Aarati/ శ్రీ అమర్నాథ్ ఆరతి / श्री अमरनाथ आरती (22nd July 2019)

Image

వ్యాస పూర్ణిమ - కథ

మన (చాంద్రమాన) పంచాంగం లో ఆషాఢ మాసం  లో వచ్చే పౌర్ణమిని "గురు పూర్ణిమ" లేదా "వ్యాస పూర్ణిమ" గా పరిగణిస్తారు. ఇది వేద వ్యాసుని జన్మ దినం (వ్యాస జయంతి). ఇతడు పరాశర మహర్షికి, సత్యవతికి కృష్ణ వర్ణం (నల్ల రంగు) తో ఒక ద్వీపంలో జన్మించాడు. కనుక "కృష్ణ ద్వైపాయనుడు" అని పిలవబడ్డాడు. అయితే, తన తండ్రియైన పరాశర మహర్షి సంకల్పించి ప్రోగు చేసిన వేద రాశులను నిత్య కర్మలలో, క్రతువులలో వాటివాటి ఉపయోగాన్ని బట్టి ఋగ్-యజుర్-సామ-అధర్వణ అను నాలుగు వేదములుగా విభజించి లేదా వేర్పరచినందువలన "వేద వ్యాసుడు" అను పేర సార్ధక నామధేయుడైనాడు. తదుపరి బ్రహ్మ అనుజ్ఞతో, సరస్వతీ కటాక్షంతో విఘ్నాధిపతియైన గణేశుడు వ్రాయగా చతుర్వేదములలోని సారం ప్రతిబింబించేవిధంగా ఘనతకెక్కిన మహాభారత ఇతిహాసకావ్యాన్ని రచింపజేసాడు. అందుకే భారతాన్ని "పంచమవేదం" అన్నారు. ఇవే కాక, వేద వ్యాసుడు మనకు అష్టాదశ (పద్ధెనిమిది) పురాణాలను, మరెన్నో పురాణేతిహాసాలను ప్రసాదించిన పూజ్యుడు, తొలి గురువు. విష్ణుతేజం తో జన్మించిన ఈ మహనీయుని సాక్షాత్తు శ్రీమహావిష్ణు అవతారంగా భావిస్తారు. అందుకే శ్రీ విష్ణుసహస్రనామం పీఠికలో ...