Posts

Showing posts from February, 2020

Bathing time for success ,good health, prosperity, and good relationship

*MUNI BATH and DEV BATH* Bathing Between 4 am to 6 am Brings happiness, peace, wealth, and good health in your life.  *MANAV BATH* Bathing Between 6 am to 8 am Brings success in your work, good luck, mutual relationship, good health and wealth. *RAAKSHAS BATH* Bathing After 8 am leads to  arguments at home and also at work, depression, loss in income and bad health.  So for successful life, have a bath before 8 am.

నవగ్రహాల అనుగ్రహాన్ని కలిగించే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం

శ్రీ ఆంజనేయస్వామి వారిని పూజిస్తే సకల దేవతలని పూజించిన ఫలితం వస్తుందని పరాశర సంహిత'లో ఉంది. నవగ్రహాల అనుగ్రహం త్వరగా పొందాలంటే వాల్మీకి రామాయణం లోని ఈ 9 శ్లోకాలు నిత్యం పారాయణ చేయడం మంచిది. నవగ్రహాలు అత్యంత కరుణా స్వరూపులు. మనం పూర్వజన్మలలో చేసిన పుణ్యపాపాల బట్టి ఫలితాలని ఇస్తారు.  కానీ భక్తితో వారిని ఇటువంటి స్తోత్రాలతో స్తుతిస్తే శుభఫలితాల్ని అనుగ్రహిస్తారు.  శ్రీ ఆంజనేయ నవరత్నమాలా శ్లోకాల పారాయణం వల్ల విద్యార్థులకు మేధస్సు, ఉద్యోగస్తులు, వ్యాపారులకు అభివృద్ధి, స్త్రీలకు వివాహం, సత్సంతానము మరియు వృద్దులకు ఆరోగ్యం కలుగుతుంది. నిత్యం లేదా శనివారం అయినా వీటిని పారాయణ చేయడం వలన శుభఫలితాలని పొందవచ్చు. వాల్మీకి రామాయణమునకు సుందరకాండ తలమానికము.సుందరకాండ సారమైన 9 శ్లోకములతో ఏర్పడినదే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం.  రత్నములవంటి తొమ్మిది శ్లోకములను ఒక మాలగా కూర్చి శ్రీ ఆంజనేయస్వామి వారికి సమర్పించబడినది. ఈ తొమ్మిది శ్లోకములు తొమ్మిది గ్రహములకు చెందునని చెప్పబడినది.  ఇవి శ్రీ ఆంజనేయస్వామి వారి వైభవము, స్వామి వారికి నవ గ్రహములతో గల సంబంధము తెలియబర్చును. ఈ స్తోత్రం పారాయణ చేస...

శ్యామశాస్త్రిగారు/Sri Syamasastry

కర్ణాటక సంగీత మూర్తిత్రయం గురించి మీరువినే ఉంటారు..వారే...శ్యామశాస్త్రి,త్యాగరాజు,దీక్షితులు-వీరి ముగ్గురిలోశ్యామశాస్త్రిగారి రచనలు బహు కొద్దిగా సుమారు 300 వరకూ మాత్రమే ఉన్నాయి.వాటిలోనూ ప్రస్తుతం అందరికీ తెలిసినవి వందలోపే ఉంటాయి.సంఖ్యాపరంగా తక్కువ రచనలుచేసినా,మిగిలిన ఇరువురితో సమాన స్థానం శ్యామశాస్త్రిగారికి దక్కటం విశేషం.     తంజావూరులో వంశపారంపర్యంగా తమకు లభించిన బంగారుకామాక్షి ఆలయ అర్చకత్వ విధులు నిర్వర్తిస్తూ,పరమభక్తులైన శ్యామశాస్త్రిగారు,నిత్యం అమ్మవారితో జరిపిన సంభాషణే కృతులుగా మనకు లభించాయి.వర్ణాలు,స్వరజతులు కూడా శ్యామశాస్త్రిగారు చేశారు.భాషాపరంగా చాలా సరళంగా ఉన్నా,సంగీతపరంగా ఎంతో ఘనమైనవి వారి రచనలు.ముఖ్యంగా లయ జ్ఞానంలో అసామాన్యులు వారు.     వారి జీవితంలో జరిగిన ఒక ఘట్టం వివరిస్తాను...         అది తంజావూరు రాజాస్థానం.శరభోజి మహారాజుగారు కొలువుతీరి ఉన్నారు.సభలోకి ఒక సంగీత విద్వాంసుడు ప్రవేశించాడు.ఆయన ఆంధ్రదేశం నుండివచ్చిన 'భూలోక చాపచుట్టె'గా ప్రసిద్ధులైన బొబ్బిలి కేశవయ్యగారు.ఆయన లోకమంతా చుట్టబెడుతూ,తన సంగీత విద్వత్తుతో అనేక రాజాస్థానాలలోని వి...

కాశీకంటే పురాతనమైన పుణ్యక్షేత్రం వృద్ధాచలక్షేత్రం

తమిళనాడులోని ఓ పుణ్యక్షేత్రం కాశీ క్షేత్రం కంటే పురాతనమైనది. అందువల్లే ఇక్కడ స్వామివారిని పూజిస్తే కాశీలో విశ్వనాధుడిని సేవించిన దానికంటే ఎక్కువ పుణ్యం వస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడ పుట్టినా, చనిపోయినా అప్పటి వరకూ చేసిన తప్పులు సమిసిపోయి తప్పక కైలాసానికి వెళ్తామని  ప్రతీతి. అందుకే కాశీలో జీవిత చరమాంకం గడపడానికి వీలుకుదరని వారు ఇక్కడికి వచ్చి దైవ సన్నిదిలో తమ శేష జీవితాన్ని ముగిస్తారు. ఈ నేపథ్యంలో ఆ దేవాలయానికి సంబంధించిన కథనం. వృద్దాచలాన్ని వృద్ధ కాశి అని కూడా పిలుస్తారు. ఇందుకు కారణం లేకపోలేదు. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇక్కడి స్థల పురాణం ప్రకారం వృద్ధ కాశి అని పిలువబడే ఈ విరుదాచలంలో మరణిస్తే కాశీలో మరణించిన వారికంటే ఎక్కువ పుణ్యమే లభిస్తుందని చెబుతారు. మహిళలు తమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని ఈ దేవతను పూజిస్తారు కాశీలో చెప్పినట్టే ఇక్కడ కూడా చనిపోతున్నవారి శిరస్సును తన ఒడిలో ఉంచుకొని ఇక్కడ కొలువై ఉన్న వృధ్ధాంబిక తన చీర కొంగుతో విసురుతూ ఉండగా వారి చెవిలో పరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశించి వారికి మోక్షం ప్రసాదిస్తాడని చెబుతారు. అదే విధంగా పరమశివుడు నటర...

భీష్మాష్టమి

మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమి అంటారు. ఈ రోజునే భీష్మ పితామహుడు మోక్షప్రాప్తిని పొందిన పర్వదినము . భీష్మాష్టమి రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. నలభై ఆరు రోజుల పాటు అంపశయ్య మీద ఉన్న కురువృద్ధుడు ఈ రోజున తన ఇష్టం ప్రకారం ప్రాణాలను వదిలాడు.  మాఘ మాసే సితాష్టమ్యాం   సతిలం భీష్మ తర్పణం ! శ్రాద్ధం యే మానవాః కుర్యుస్తేస్యు స్సంతతి భాగినః !!  ఏతజ్జీవ పిత్రుకేన అపి   కార్యం !  సాధారణంగా తండ్రి బతికి ఉన్నవారు తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కారు. కానీ భీష్మ తర్పణం విషయంలో ఆ నియమాన్ని పాటించరు. నరకచతుర్దశి, దీపావళి సమయంలో యమ తర్పణం ఎలాగైతే  తండ్రి జీవించి వున్నవాళ్ళు కూడా చేస్తారో. అదే విధిన భీష్మ తర్పణం కూడా నిర్వహించాలి. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం అని పద్మ పురాణం చెబుతుంది.  అంతటి ప్రత్యేక స్థానం భీష్ముడికి ఉంది. *భీష్మతర్పణ విధి* భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా సత్యధర్మములకు కట్టుబడి జీవించి చివర శ్రీకృష్ణుని సన్నిధిలో ముక్తినిబడసినవాడు, మూడు దోసిళ్ళ అర్ఘ్యం భీష్మ ప్రీతికి కింద ఇచ్చిన శ్లోకములను చెప్పి ఇవ్వవలస...