Posts

Showing posts from December, 2018

శివ పార్వతుల నివాసం - కైలాస మానస సరోవరం

మానస సరోవరం శివ పార్వతుల నివాసం - మానస సరోవరం పరమేశ్వరుని నివాసం కైలాసం బ్రహ్మ దేవుడు మనస్సంకల్పంతో సృష్టించిన మహాద్భుత సరస్సు ..!! అన్ని మతాలకు అతి పవిత్రం . ఆరాధించే దైవ రూపం .. రజత కాంతులతో వెలిగే కైలాస శిఖరం సచ్చిదానందానికి నెలవు ..!! లలితా దేవి కాళీ అందెల రవళులతో మ్రోగే ఓంకారం .. నటరాజు తాండవంలో ధ్వనించే ఆత్మ సారం .. కుబేరుడి నివాసం ..మానస సరోవరం కొన్ని వేల ఏళ్ల నుంచి హిందువుల నమ్మకాలు ఇవి. అందుకే జీవితంలో ఒకసారైనా- మానస సరోవరంలో స్నానం చేయాలని.. కైలాస పర్వతాన్ని దగ్గరగా చూసి ప్రదక్షిణం చేయాలని కోట్లాది మంది భావిస్తూ ఉంటారు. కాని సముద్రమట్టానికి దాదాపు 15 వేల అడుగుల ఎత్తున ఉన్న మానస సరోవరాన్ని.. దానికి సమీపంలో ఉన్న కైలాస పర్వతాన్ని అధిరోహించటం అంత సులభం కాదు. అందుకే చాలా మందికి కైలాస యాత్ర ఒక కల. తీరని కోరిక. కాని ఇప్పుడు చైనా ప్రభుత్వం అక్కడికి సులభంగా చేరుకోవడానికి ఏర్పాట్లు చేస్తోంది. భారీ వాహనాలు సైతం సునాయాసంగా ప్రయాణించటానికి వీలుగా రోడ్లు.. కొండ చరియలు విరిగి పడకుండా ఇనుప కంచెలు.. హఠాత్తుగా వరదలు వచ్చి రోడ్డు కొట్టుకుపోకుండా పక్కనే కాలువలు వంటి అనేక సదుపాయాలను

కాలభైరవస్వామి జన్మదినం.

🌸 ఈరోజు కాలభైరవస్వామి జన్మదినం. 🌸 కాలభైరవాష్టమికి సంబంధించి శివపురాణంలో ఆసక్తికరమైన పురాణగాధ వుంది. ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో ఎవరు అసలు బ్రహ్మము అని సందేహం వచ్చింది. ఆ సందేహమును తీర్చమని ఋషులందరు కలసి త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి సద్యోజాత, అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ అను అయిదు ముఖములు ఉంటాయి. ఈ అయిదు ముఖములతో ఋషుల వంక చూస్తూ... బ్రహ్మము ఎవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మమును అని పరమశివుడు అన్నాడు. అపుడు, బ్రహ్మ దేవుడు నేనే ఈ లోకములన్నిటిని సృష్టించాను, నేనే నీ పుట్టుకకు కర్తను. నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను. నేనే వీటిని సంహారం చేస్తాను. నేనెప్పుడూ బతికే ఉంటాను. కాబట్టి, నాకన్నా బ్రహ్మము ఎవరూ లేరు. నేనే బ్రహ్మమును’ అన్నాడు. తరువాత, ప్రక్కనే వున్న విష్ణువు బ్రహ్మాతో.. అసలు నీవు పుట్టింది నా నాభి కమలంలోంచి కదా, కావున నేనే బ్రహ్మమును  అన్నాడు. ముగ్గురికీ ఈ విషయంలో జగడం వచ్చింది. మనకి స్మృతులే ప్రమాణం కదా! అందుకని వేదాలని పిలుద్దాం అని వేదాలని పిలిచారు. అపుడు, ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త , ఏ మహానుభావుడు సంకల్పం వలన