శివ పార్వతుల నివాసం - కైలాస మానస సరోవరం
మానస సరోవరం శివ పార్వతుల నివాసం - మానస సరోవరం పరమేశ్వరుని నివాసం కైలాసం బ్రహ్మ దేవుడు మనస్సంకల్పంతో సృష్టించిన మహాద్భుత సరస్సు ..!! అన్ని మతాలకు అతి పవిత్రం . ఆరాధించే దైవ రూపం .. రజత కాంతులతో వెలిగే కైలాస శిఖరం సచ్చిదానందానికి నెలవు ..!! లలితా దేవి కాళీ అందెల రవళులతో మ్రోగే ఓంకారం .. నటరాజు తాండవంలో ధ్వనించే ఆత్మ సారం .. కుబేరుడి నివాసం ..మానస సరోవరం కొన్ని వేల ఏళ్ల నుంచి హిందువుల నమ్మకాలు ఇవి. అందుకే జీవితంలో ఒకసారైనా- మానస సరోవరంలో స్నానం చేయాలని.. కైలాస పర్వతాన్ని దగ్గరగా చూసి ప్రదక్షిణం చేయాలని కోట్లాది మంది భావిస్తూ ఉంటారు. కాని సముద్రమట్టానికి దాదాపు 15 వేల అడుగుల ఎత్తున ఉన్న మానస సరోవరాన్ని.. దానికి సమీపంలో ఉన్న కైలాస పర్వతాన్ని అధిరోహించటం అంత సులభం కాదు. అందుకే చాలా మందికి కైలాస యాత్ర ఒక కల. తీరని కోరిక. కాని ఇప్పుడు చైనా ప్రభుత్వం అక్కడికి సులభంగా చేరుకోవడానికి ఏర్పాట్లు చేస్తోంది. భారీ వాహనాలు సైతం సునాయాసంగా ప్రయాణించటానికి వీలుగా రోడ్లు.. కొండ చరియలు విరిగి పడకుండా ఇనుప కంచెలు.. హఠాత్తుగా వరదలు వచ్చి రోడ్డు కొట్టుకుపోకుండా పక్కనే కాలువలు వంటి అనేక సదుపాయాలను