Bhagawadgeeta quiz
*భగవద్గీత పైన అందరికి ఉండవల్సిన అవగాహన కోసం...హిందూ ధర్మం పాటించే ప్రతీ ఒక్కరికీ షేర్ చేయండి* *1.* భగవద్గీతను లిఖించినదెవరు? =విఘ్నేశ్వరుడు. *2.* భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగము? = భీష్మ పర్వము. *3.* గీతాజయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును? =మార్గశిర మాసము. *4.* గీతాజయంతి ఏ ఋతువులో వచ్చును? =హేమంత ఋతువు. *5.* ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను? = వసంత ఋతువు. *6.* భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను? =శ్రీకృష్ణుడు అర్జునునికి. *7.* భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను? =కురుక్షేత్ర సంగ్రామము. *8.* భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యెను? =కౌరవ పాండవులకు. *9.* పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధిగా వుండెను? =అర్జునుడు. *10.* వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను? =సామవేదము. *11.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి? =పాంచజన్యము. *12.* భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు? =పద్దెనిమిది (18) *13.* “నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది” అని చెప్పిన స్వాతంత్ర్