Posts

Showing posts from March, 2020

నక్షత్ర గాయత్రి

ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి ని రోజుకు 9 సార్లు పఠించాలి 1.అశ్విని ఓం శ్వేతవర్ణై విద్మహే సుధాకరాయై ధిమహి తన్నో అశ్వినేన ప్రచోదయాత్  2.భరణి ఓం కృష్ణవర్ణై విద్మహే దండధరాయై ధిమహి తన్నో భరణి:ప్రచోదయాత్ 3.కృత్తికా ఓం వణ్ణిదేహాయై విద్మహే మహాతపాయై ధీమహి తన్నో కృత్తికా ప్రచోదయాత్ 4.రోహిణి ప్రజావిరుధ్ధై చ విద్మహే విశ్వరూపాయై ధీమహి తన్నో రోహిణి ప్రచోదయాత్ 5.మృగశిరా ఓం శశిశేఖరాయ విద్మహే మహారాజాయ ధిమహి తన్నో మృగశిర:ప్రచోదయాత్ 6.ఆర్ద్రా ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే పశుం తనాయ ధిమహి తన్నో ఆర్ద్రా:ప్రచోదయాత్ 7.పునర్వసు ఓం ప్రజా వరుధ్ధై చ విద్మహే అదితి పుత్రాయ ధిమహి తన్నో పునర్వసు ప్రచోదయాత్ 8.పుష్య ఓం బ్రహ్మవర్చసాయ విద్మహే మహాదిశాయాయ ధిమహి తన్నో పుష్య:ప్రచోదయాత్ 9.ఆశ్లేష ఓం సర్పరాజాయ విద్మహే మహారోచకాయ ధిమహి తన్నో ఆశ్లేష: ప్రచోదయాత్ 10.మఖ ఓం మహా అనగాయ విద్మహే పిత్రియాదేవాయ ధిమహి తన్నో మఖ: ప్రచోదయాత్ 11.పుబ్బ ఓం అరియంనాయ విద్మహే పశుదేహాయ ధిమహి తన్నో పూర్వఫల్గుణి ప్రచోదయాత్ 12.ఉత్తరా మహాబకాయై విద్మహే మహాశ్రేష్ఠాయై ధీమహి తన్నో ఉత్తర ఫల్గుణి ప్రచోదయాత్ 13.హస్త ఓం ప్రయచ్చతాయై విద్మహే ప్రకృప్రణీతాయై ధీమహి తన

రామాయణం - ప్రశ్నలు

రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి.. మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు కూడా పంపండి..🏹 1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు? = వాల్మీకి. 2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు? = నారదుడు. 3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు? = తమసా నది. 4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి? =24,000. 5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు? =కుశలవులు. 6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? =సరయూ నది. 7. అయోధ్య ఏ దేశానికి రాజధాని? =కోసల రాజ్యం. 8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు? =సుమంత్రుడు. 9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి? =కౌసల్య, సుమిత్ర, కైకేయి. 10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు? =పుత్రకామేష్ఠి. 11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను? = కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు. 12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వానరుడెవరు?

సుఖ జీవితానికి సూత్రాలు Secreats of Happy and Healthy Life

1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు.  2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.  3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి.  4. చిన్న పిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి సమర్పించుకోవాలి 5. భోజనానంతరం ఎంగిలి ఆకులు ఎత్తే వాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు. 6. తల్లిదండ్రులకు నిత్యపాద నమస్కారం చేయడానికి మించిన ధర్మం, నిత్యాన్నదానం చేయడం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలో లేవు.  7. ఒకేసారి నీరు, నిప్పు రెండు చేతులతో గాని, ఒకే చేత్తోగాని పట్టుకెళ్ళరాదు.  8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది.  9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి

వర్ణమాలతో పెళ్లి ఆహ్వానం

 *అ* - *అరుదైన* అమ్మాయి  *ఆ* - *ఆకతాయి* అబ్బాయి  *ఇ* - *ఇద్దరికి*   *ఈ* - *ఈడు* జోడి కుదిరి  *ఉ* - ఉంగరాలను తొడిగి  *ఊ* - ఊరంతా ఊరేగించారు  *ఋ* - *ఋణాల* కోసం   *ఎ* - *ఎ* వరెవరినో అడుగుతూ ఉంటే  *ఏ* - *ఏనుగు* లాంటి కుభేరుడితో అడిగి  *ఐ* - *ఐశ్వర్యం* అనే కట్నం ఇచ్చి  *ఒ* - *ఒకరికి* ఒకరు వియ్యంకులవారు  *ఓ* - *ఓర్పుతో* ఒప్పందం చేసుకొని  *ఔ* - *ఔదార్యాని* ఇరు కుటుంబాలకు  *అం* - *అందించాలని* కోరుకుంటూ  *అ* : - *అ* : అంటూ  *క* - *కలపతో* తయారయిన పత్రికలపై  కలంతో రాసిచ్చి  *ఖ* - *ఖడ్గలతో* నరికిన పందిరి ఆకులను  *గ* - *గడప* ముందుకు తీసుకొచ్చి  *ఘ* - *ఘనమైన* ఏర్పాట్లు చేయించి  *చ* - *చాపుల* (బట్టలు)నింటిని కొని  *ఛ* - *ఛత్రం* (గొడుగు) పట్టి గండదీపాని  *జ* - జరిపిస్తూ  *ఝ* - *ఝాము* రాత్రి దాక  *ట* - *ట* పకాయలను కాలుస్తూ  *ఠ* - *ఠీవిగా* (వైభవంగా)  *డ* - *డ* ప్పులతో  *ఢ* - *ఢం* ఢం అని శబ్దాలతో సాగుతుంది  *ణ* - కంక *ణా* లు చేతికి కట్టుకొని  *త* - *తట్టలో* తమలపాకులు పట్టుకొని  *థ* - థమన్(మ్యూజిక్ డైరెక్టర్) డప్పులతో  *ద* - *దగ్గరి* బంధువులను పిలిచి  *ధ* - *ధ* నవంతులను కూడా పిలిచి  *న* - *న* అనే నలుగురిన